రెండు పాటలు (మిగిలిన వాటితో పోలిస్తే ఇది హైలెట్ అనే అనిపిస్తుంది)రెండు పాటలు (మిగిలిన వాటితో పోలిస్తే ఇది హైలెట్ అనే అనిపిస్తుంది)హీరో, హీరోయిన్, స్టొరీ స్క్రీన్ ప్లే,ఫస్ట్ హాఫ్ , సెకండ్ హాఫ్

చిన్నప్పటి నుండి అబ్బాయిల స్కూల్ మరియు కాలేజీ లోనే చదివాడు వికాస్ (కరణ్), చిన్నప్పటి నుండి అన్ని గర్ల్స్ స్కూల్ మరియు కాలేజీలోనే చదివి ఉంటుంది శ్రీ చైతన్య (సౌమ్య కుమార్) వీరిద్దరూ ఇంటర్ అయిపోయిన తరువాత ఇంజనీరింగ్ కోసం కో ఎడ్యుకేషన్ లో చేరుతారు మొదటిసారిగా అమ్మాయిలతో కలిసి చదువుతున్న వికాస్, తన వెంటపడుతున్న అబ్బాయిలను చూసి ఆనందపడే శ్రీ చైతన్య ప్రేమలో పడతారు కాని, అంతకముందే వికాస్ చేసిన ఒక పని వలన వీరిద్దరూ విడిపోవలసి వస్తుంది.. అసలు వీరికి వచ్చిన సమస్య ఏంటి? ఎందుకు విడిపోయారు? మళ్ళీ ఎలా కలిసారు? అన్నది తెర మీద చూడవలసిన అంశాలు..

హీరో గా నటించిన కరణ్ ని హీరో అని గుర్తు పట్టడానికి పది నిముషాలు అయిన పడుతుంది తరువాత కూడా కథ మొత్తం అతని చుట్టూ తిరగడం మూలాన హీరో అని గుర్తిస్తాం అంటే అందం గురించి మాట్లాడటం లేదు ఇక్కడ సమస్య అంత నటనతోనే అతనే ప్రధాన పాత్ర అన్న భావన ఎక్కడ కలగనివ్వలేదు ఈ హీరోగారు.. హీరోయిన్ గా నటించిన సౌమ్య కుమార్ క్యూట్ గా కనపడటానికి చాలా ప్రయత్నించింది కాని ఆకట్టుకోలేకపోయింది . మిగిలిన అందరు నటులు ఏదో ఉన్నాం అంటే ఉన్నాం అనిపించేసారు ఆకట్టుకునే స్థాయిలో ఎవరు నటించలేకపోయారు..

దర్శకుడు లంకపల్లి శ్రీనివాస్ ఈ చిత్రానికి కథ ఎందుకు అనుకున్నారేమో అనిపిస్తుంది , పాతబడిపోయిన ఒక కథను తీసుకొని దానికి రంగులు పూసి కథ అనేసారు, కథనం అయితే చివర్లో హీరో హీరోయిన్ కలవాలి కాబట్టి మధ్యలో ఏదో ఒక సన్నివేశాలు రాసుకుంటే సరిపోతుంది అన్నట్టు ఉన్నాయి అన్ని టైం పాస్ సన్నివేశాలే, మాటలు కూడా గొప్పగా లేవు కొన్ని డబల్ మీనింగ్ డైలాగ్స్ తప్ప మిగిలిన డైలాగ్స్ ఎటువంటి ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశం లేదు ... ఇంతలో బడ్జెట్ చిత్రానికి ఈ రకమయిన అవుట్ పుట్ వచ్చిందంటే గొప్ప విషయమే అని చెప్పుకోవాలి . ఈ చిత్రంలో ప్రధాన హైలెట్ అంతే కాకుండా ఉన్న ఏకైక హైలెట్ సంగీతం రెండు పాటలు బాగున్నాయి నేపధ్య సంగీతంలో కొన్ని ట్రాక్స్ ఎక్కడో విన్నట్టు ఉన్నా కూడా కొన్ని సన్నివేశాలు వరకు సరిగ్గా సరిపోయే నేపధ్య సంగీతం అందించారు.. ఎడిటింగ్ లో అవసరం లేని సన్నివేశాలను కత్తిరించడం అంటూ మొదలుపెడితే చిత్రంలో మిగిలే సన్నివేశాలు సున్నా... అవును ఒక్కటంటే ఒక్క సన్నివేశం కూడా ముఖ్యమయిన సన్నివేశంలా అనిపించదు కాబట్టి ఎడిటర్ చేసేదేమీ లేక వదిలేసాడు.. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి ..

రొమాంటిక్ చిత్రం అంటే కొన్ని క్యూట్ సన్నివేశాలు మరియు హీరో హీరోయిన్ మధ్యలో బంధం వారి మధ్య వచ్చే గొడవ అది పరిష్కరించుకున్న విధానం ఎటువంటి ప్రేమ కథ అయిన ఇలాగే ఉంటుంది ఈ చిత్రం కూడా అలానే ఉంటుంది కాని సన్నివేశాలు క్యూట్ గా ఉండదు, హీరోకి హీరోయిన్ కి నటన రాకపోవడంతో వారి మధ్య బంధం కూడా సరిగ్గా బయటకి రాలేదు సన్నివేశాలు కూడా అలానే ఉన్నాయిలెండి అది వేరే విషయం. ఇక వారి మధ్య ఒక గొడవ వచ్చి పోరా పోవే అనుకుంటే కథలోకి వెళ్లినట్టు చిత్రంలో ఇలాంటి ఒక పరిస్థితి చిత్రం అయిపోయే పదిహేను నిమిషాల ముందు వస్తుంది దాన్ని గుర్తించి ప్రేక్షకుడు ఆలోచించేలోపు సినిమా అయిపోయి శుభం కార్డు పడిపోతుంది ..

ఈ చిత్రం చూసిన ఏ ప్రేక్షకుడికి అయినా "అసలు మన తెలుగు సినిమాకి ఏమవుతుంది ఒక వైపు రొటీన్ చిత్రాలు మరొక వైపు చెత్త చిత్రాలు .... " అనిపించేస్తుంది. ఇంత గాడమయిన అభిప్రాయం కలగడానికి కారణం లేకపోలేదు ఈ వారం విడుదల అయిన చిత్రాలు చూస్తే ఎటువంటి ప్రేక్షకుడు అయిన జన్మలో మరోసారి తెలుగు చిత్రం చూడాలి అంటే భయపడతాడు.. సరేలెండి ఇది ప్రేక్షకుడికి తప్పినా సమీక్షకుడికి తప్పని శిక్షలు.. ఈ చిత్ర విషయానికి వస్తే పోరా పోవే అనగానే ఇదేదో రొమాంటిక్ చిత్రం అనుకోని థియేటర్ లో కి వెళ్తే ఎందుకు వచ్చాం రా బాబు అనిపించేస్తారు.. చిత్రం అయిపోయాక బయట ఎవరో ఔత్సాహికుడు అన్న మాటలు ఇవి " వాళ్ళది ఎం తప్పు లేదు రా సినిమా మొదట్లోనే పోరా పోవే అని చెప్పేశారు మనమే వాళ్ళ మాట వినకుండా చిత్రం ఆసాంతం చూసాం" అని అన్నాడు. నిజమే కదూ అనుకోవడం తప్ప మరొక అవకాశం లేకపోయింది ...

Karan,Soumya Sukumar,Lankapalli Srinivas,Virendra Reddy & Srinivas Bingamala,Yajamaniya.పోరా పోవే - ఈ చిత్రం హింసకి హైవే ...

మరింత సమాచారం తెలుసుకోండి: