Denikaina Ready Tweet Review || Denikaina Ready Full English Review                                                                                         మంచు విష్ణు హీరోగా నటించిన కొత్త సినిమా దేనికైనా రెడీ. ఈ సినిమాలో అందాల హన్సిక కథానాయికగా నటించగా, జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వం వహించారు.   ఇటీవల హీరో విష్ణు ఎన్ని సినిమాలు చేసినా, ఆశించిన విజయాన్ని అందుకోలేక పోతున్నాడు. దీంతో  తన కెరీర్ లో ఏకైక హిట్ చిత్రం డీ సీక్వెల్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈ ‘దేనికైనా రెఢీ’ సినిమా ఎలా ఉందో చూద్దాం..! చిత్రకథ :     వీర నరసింహమ నాయుడు (ప్రభు) చెల్లి సరస్వతి (సీత) భాష (సుమన్)ను ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. దీంతో వీరమనాయుడు ఆవేశంతో బాషా కాలు నరికేస్తాడు. సరస్వతి ఆస్తి కోసం భాష కోర్టులో కేసు వేస్తాడు. దీంతో సరస్వతి-బాష లపై వీర నరసింహమనాయుడు ఇంకా కోపం తెచ్చుకుంటాడు. అయితే సరస్వతికి తన అన్నతో కలిసుండాలని ఉంటుంది. తన అమ్మ కోరిక తీర్చడం కోసం, రెండు కుటుంబాలను కలపడం కోసం సరస్వతి కుమారుడు సులేమాన్ (మంచు విష్ణు) కృష్ణశాస్ర్తిగా వీరమనాయుడు ఇంటిలో ప్రవేశిస్తాడు. అక్కడ మేనమామ కూతురు షర్మిల (హన్సిక)తో ప్రేమలో పడతాడు. రెండు కుటుంబాలను సులేమాన్ ఎలా కలిపాడు.., తన మేనమామ కూతురును ఎలా దక్కించుకున్నాడు అనేది చిత్రకథ.     నటీనటుల ప్రతిభ :   మంచు విష్ణు ఈ సినిమాలో చలాకీగా నటించాడు. కామెడీ సన్నివేశాలలోనూ, యాక్షన్  సన్నివేశాలలోనూ మెప్పించాడు. సెంటిమెంట్ దృశ్యాలను పండించాడు. అయితే పాటల్లో డాన్సులు చాలా ఇబ్బందిగా చేసినట్లు కనిపించింది. హీరోయిన్ హన్సిక అందంగా ఉంది. కొంచెం లావుగా కనిపించినా గ్లామర్ గా ఉంది. బ్రహ్మనందం నవ్వించాడు. అతనికి ఎంఎస్ నారాయణ, ఎవీఎస్ జతకలిశారు. కొత్త అమ్మాయి ఐశ్వర్య, సురేఖావాణి ఆకట్టుకుంటారు. సుమన్, ప్రభు, సీత, కోట శ్రీనివాస రావు తదితరులు తమ పాత్రల పరిధిలో నటించారు.   సాంకేతిక వర్గం పనితీరు :     ఫోటో గ్రఫీ ఓకే. సంగీతం బావుంది. ఈ సినిమాకు సంగీత దర్శకులు యువన్ శంకర్ రాజా, చక్రి పని చేయడం విశేషం. మాటలు బాగున్నాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి. దర్శకత్వం విషయానికి వస్తే చిన్న కథను వినోదాత్మకంగా తీశారు. పెద్ద పెద్ద మలుపులు లేకుండా సాఫీగా సాగుతుంది. కామెడీ ప్రధానంగా సాగే ఈ సినిమాలో మదర్ సెంటిమెంట్ ను కూడా కలిపారు. ఈ సినిమాలో కొన్ని కులాల గురించి ఎక్కువగా ప్రస్తావించారు. అందుకే ఈ సినిమా సెన్సార్ వివాదంలో చిక్కుకున్నట్లు అనిపిస్తుంది. అలాగే సినిమాలో కొన్ని సన్నివేశాల్లో ప్రభాస్ డబ్బింగ్ చెప్పాడు. ఈ సన్నివేశాలకు ప్రభాసే డబ్బింగ్ చెప్పనవసరం లేదు. అయినా డబ్బింగ్ చెప్పడం ప్రభాస్ మంచితనం. హైలెట్స్ :     విష్ణు నటన, హన్సిక గ్లామర్, కామెడీ సన్నివేశాలు, పాటలు     డ్రాబ్యాక్స్ :   సాధారణమైన కథ, సన్నివేశాలు.   చివరగా :     వినోదం పంచే దేనికైనా రెడీ     Prasad can be reached at: Yedida.Viswaprasad@apherald.com
Editor can be reached at: editor@apherald.com
More Articles Dhenikaina Ready || Dhenikaina Ready Photos & Wallpapers

మరింత సమాచారం తెలుసుకోండి: