ఎం ఎం కీరవాణి సంగీతం ,సినిమాటోగ్రఫీ, ఫస్ట్ హాఫ్ లో కామెడీ సన్నివేశాలు ఎం ఎం కీరవాణి సంగీతం ,సినిమాటోగ్రఫీ, ఫస్ట్ హాఫ్ లో కామెడీ సన్నివేశాలు కథనం ,ఎడిటింగ్ ,సాగదీసిన సెకండ్ హాఫ్ ,దర్శకత్వం

గోపాలకృష్ణ(అజయ్), స్టేట్ బ్యాంకు లో పని చేసే అధికారి చాలా చిన్న వయసులోనే పెళ్లి చేసేసుకోవలసి వస్తుంది. కాని ప్రేమించి పెళ్లి చేసుకోవాలి అనుకున్న అతని చిన్నప్పటి కల నెరవేరకుండాపోతుంది.. కాని అతనిలో ఆ కోరిక అలా బలంగా పాతుకుపోతుంది.. గోపాలకృష్ణ మరియు అతని భార్య భవాని(ఇంద్రజ) లకి ఇద్దరు కొడుకులు ఉంటారు అందులో పెద్ద కొడుకు మధు(నాగశౌర్య)ఇంజనీరింగ్ చదువుతూ ఉంటాడు. ఇదిలా సాగుతుండగా గోపాలకృష్ణ కి బ్యాంకు పని మీద సంహిత(సన మక్బూల్) పరిచయం అవుతుంది. ఎరోబిక్స్ నేర్పించే సంహిత తో గోపాలకృష్ణ స్నేహం పెంచుకుంటాడు.. అదే సమయంలో మధు కూడా సంహితను మొదటిసారి చూడగానే ప్రేమిస్తాడు .. ఇలా తండ్రికి తెలియకుండా కొడుకు కొడుకుకి తెలియకుండా తండ్రి ఒకే అమ్మాయిని ప్రేమిస్తారు.. ఒకానొక సమయంలో గోపాలకృష్ణ సంహితను తప్పక పెళ్లి చేసుకోవలసిన పరిస్థితి వస్తుంది..ఆ తరువాత ఎం జరిగింది అన్నదే మిగిలిన కథ ....

మధ్య వయస్కుడి పాత్రలో కనిపించిన అజయ్ అతని స్థాయి నటన కనబరిచారు , ఒక కుటుంబానికి పెద్ద లా బాద్యత తో కూడిన నటన కనబరచడమే కాకుండా రొమాంటిక్ సన్నివేశాలలో కూడా ఆకట్టుకున్నాడు. కాని క్లైమాక్స్ లో అతని నటన సన్నివేశానికి సరిపోలేదు అక్కడ వచ్చే సన్నివేశం కథకి కీలకం కాని ఆ సన్నివేశంలో అజయ్ తేలిపోయాడు... నాగశౌర్య తక్కువ కాలంలోనే మంచి పరిపక్వతతో కూడిన నటన కనబరుస్తున్నారు కీలక సన్నివేశాల వద్ద గొప్పగా కాకపోయినా అవసరమయిన స్థాయిలో నటన కనబరిచి ఆకట్టుకున్నారు కాని ఎమోషనల్ సన్నివేశాల వద్ద ఇంకా చాలా మెరుగుపడాలి.. సన మక్బూల్ కి ఇది మొదటి చిత్రమే అయినా పరవాలేదనిపించుకుంది... ఇంద్రజ నటనా పరంగా చిత్రంలో ఒక్క సన్నివేశం మినహా అన్ని సన్నివేశాలు ఏడుస్తూనే కనపడింది.. కొన్ని సన్నివేశాలలో ఎమోషన్ బాగా పండించారు.. బ్రహ్మాజీ పాత్ర మొదటి అర్ధ భాగంలో మనకి దొరికే ఏకైక సాంత్వన అక్కడక్కడా అతని పాత్ర చేసిన కామెడీ బాగా వర్క్ అవుట్ అయ్యింది.. అలీ , పోసాని కృష్ణ మురళి కొన్ని సన్నివేశాలలో కనిపించి నవ్వించడానికి ప్రయత్నించారు..

గిరి అందించిన కథ కాస్త విభిన్నంగా ఉంది , కథనం విషయం వచ్చేసరికి త్రికోటి పూర్తిగా తేలిపోయాడు చిత్రం మొత్తం చాలా నెమ్మదిగా సాగుతుంది. రెండవ అర్ధ భాగంలో చిత్రం క్లైమాక్స్ కి చేరుకోవలసిన సమయం వచ్చాక కూడా కొన్ని అనవసరమయిన సన్నివేశాలు జతపరిచి ప్రేక్షకుడిని విసిగించాడు.. కథలో కొన్ని కీలక అంశాలలో ప్రేక్షకులను ఒప్పించడంలో దారుణంగా విఫలం అయ్యాడు దర్శకుడు త్రికోటి.. మాటలు అందించిన రమేష్, గోపి సరళమయిన పదాలనే మాటలుగా అందించారు, ఎమోషనల్ సన్నివేశాల వద్ద బలమయిన సంభాషణలు అవసరం అయినప్పుడు కూడా అంతే సరళం అయిన పదాలను ఉపయోగించడంతో కావలసిన సెంటిమెంట్ పండలేదు.. ఈ చిత్రం చాలా పొడవుగా ఉండటమే కాకుండా సన్నివేశాల పొడవు కూడా బాగా ఎక్కువయ్యింది ఎడిటర్ కాస్త కత్తిరించి ఉంటె బాగుండేది.. రాజశేకర్ అందించిన సినిమాటోగ్రఫీ బాగుంది.. ఈ చిత్రానికి హైలెట్స్ లో మొదటిది ఎం ఎం కీరవాణి అందించిన సంగీతం, ముఖ్యంగా ఇంటర్వెల్ సన్నివేశం వద్ద ఎం ఎం కీరవాణి అందించిన నేపధ్య సంగీతం అద్భుతం అని చెప్పుకోవాలి.. వారాహి చలన చిత్ర వారి నిర్మాణ విలువలు బాగున్నాయి..

ఒక నదిని అతి కష్టం మీద ఈదుకొని ఒడ్డుకు చేరుకున్న వ్యక్తికి అవతలున్నది సముద్రం అని తెలిస్తే ఎలా ఉంటుందో ఈ చిత్రం మొదటి అర్ధభాగం అవ్వగానే ప్రేక్షకుడు అలానే ఫీల్ అవుతాడు. మొదటి అర్ధంభాగం కాస్త కామెడీ అయిన పండింది రెండవ అర్ధ భాగంలో అది కూడా లేదు సన్నివేశాలలో బలం ఉంది కూడా దర్శకుడు ఆ స్థాయిని తెర మీద చూపెట్టలేకపోయాడు.. చిత్రంలో అజయ్- సన రొమాంటిక్ ట్రాక్ మీద కన్నా అజయ్ - ఇంద్రజ ట్రాక్ మీద దృష్టి పెట్టి ఉంటె చాలా బాగుండేది.. అజయ్ ని హీరోయిన్ ఎందుకు ప్రేమిస్తుంది అనడానికి సరయిన కారణం చూపించలేదు. అన్ని పాత్రల తీరు తెన్నులు చాలా విచిత్రంగా ఉంటాయి మొదటి సన్నివేశం లో ఒకలా ప్రవర్తించే పాత్ర చివరికి వచ్చేసరికి వేరేలా ప్రవర్తిస్తుంటుంది. కాని దర్శకుడి మొదటి ప్రయత్నం కాబట్టి ప్రయత్నాన్ని మెచ్చుకోవచ్చు.. రొమాంటిక్ చిత్రం మరియు ఫ్యామిలీ డ్రామా మధ్యలో నలిగిపోయి ఇటు యువతకి చేరువ కాక అటు ఫ్యామిలీ లను మెప్పించక మిగిలిపోయే చిత్రం ఇది.. మొదటి అర్ధ భాగంలో కాస్త కామెడీ సన్నివేశాలు, పాటలు మరియు నేపధ్య సంగీతం ఈ చిత్రానికి ప్లస్ అయ్యాయి..మిగిలిన అంశాలేవి ఆకట్టుకోలేదు దీన్ని బట్టి మీరు బేరీజు వేసుకొని చూడాలా వద్దా అన్నది నిర్ణయించుకోండి..

Naga Shaurya,Sana Maqbool,Koti,Sai Korrapati,MM. Keeravaani.దిక్కులు "చూడకు" రామయ్య

మరింత సమాచారం తెలుసుకోండి: