చెప్పుకోదగినంత హైలెట్స్ ఎం లేవు ..చెప్పుకోదగినంత హైలెట్స్ ఎం లేవు ..చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి .ధన(కార్తీక్) మరియు జాజ్ రాజు(సుధాకర్) ల కథ ఇది, వైజాగ్ లో నివసించే వీరిద్దరూ మంచి స్నేహితులు అంతే కాకుండా వీరిద్దరూ జీవితంలో ఒక లక్ష్యంతో సాగుతుంటారు. ధన మంచి హాకీ ప్లేయర్ అందరిలా ఉద్యోగం కోసం కాకుండా ఆట అంటే ఉన్న ఇష్టంతో ధన హాకి ఆడుతుంటాడు. ఎలాగయినా జాతీయ జట్టుకి ఆడాలి అని అతని కల, అలానే రాజు పదవ తరగతి తప్పిన రాజు మంచి డ్రమ్మర్ అవ్వాలని కలగంటాడు. వీరిద్దరూ వైజాగ్ లో ఒక షేర్ ఆటో నడుపుకుంటూ ఉంటారు రాజు మాత్రం పెళ్ళిళ్ళకి బ్యాండ్ వాయిస్తూ ఉంటాడు. కాగా ధన చాలారోజుల నుండి పరి(నీతిక చౌదరి) ని ప్రేమిస్తూ ఉంటాడు. అదే సమయంలో రాజు చిన్నప్పటి నుండి ఇష్టపడుతున్న ఉజ్జు(అవంతిక మోహన్) తిరిగి రాజు జీవితంలోకి వస్తుంది. ఇక వీరిద్దరి కల ఎలా నెరవేరింది? అసలు నెరవేరిందా లేదా ? వీరి ప్రేమ ఫలించిందా లేదా? అన్నదే మిగిలిన కథ ...సుధాకర్ నటన గురించి చెప్పుకోడానికి ఎం లేదు గతంలో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రంలో చేసిన ఈ నటుడు ఆ చిత్రంలోలానే చేసాడు. ఈ పాత్రకి అతని బాడీ లాంగ్వేజ్ బాగా కుదిరింది కాని ఇంకాస్త మెరుగ్గా నటించాల్సింది. కార్తీక్ కొన్ని సన్నివేశాల్లో బాగానే చేసినా పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేకపోయారు. పరి పాత్రలో చేసిన నీతిక చౌదరి ఆకట్టుకోలేదు.. అవసరమున్న లేకపోయినా ప్రతి సన్నివేశంలో నవ్వుతూ కనిపించిన అవంతిక గురించి ఎం చెప్పుకోగలం చెప్పండి.. కొన్ని సన్నివేశాలలో అందంగా కనపడింది అంతే.. నరేష్ ధన కి తండ్రి పాత్రలో చేసిన ఈ నటుడు సినిమాలో అసలు ఎం జరుగుతుంది అనేది ఎప్పటికప్ప్పుడు చెప్తూ వచ్చాడు కాబట్టి చిత్రం మీద ఒక అవగాహన ఉంటుంది.. అనుభవంతో కూడిన ప్రదర్శన కనబరిచారని చెప్పుకోవచ్చు.. రాధిక పాత్రకి చిత్రంలో బొత్తిగా ప్రాముఖ్యత లేదు ఇంత చిన్న పాత్రను రాధిక చేత చేయించడంలో ఉద్దేశం ఏంటో దర్శకుడికే తెలియాలి.. కాని ఉన్న కొన్ని సన్నివేశాలు రాధిక బాగా చేసారు.. మిగిలిన అందరు నటీనటులు వారి పాత్రల స్థాయి మేరకు ఆకట్టుకున్నారు...ఈ చిత్ర కథ చాలా పాతది కథనం చాలా నెమ్మది ఇంత నెమ్మదయిన కథనాన్ని దాదాపుగా రెండున్నర గంటల పాటు సాగదీసారు. అసలు చిత్రం ఎం జరుగుతుందో అని క్లారిటీ ఉండకుండా చిత్రం మొత్తం సాగదీసారు.. అరుణ్ దాశ్యం తరువాతి చిత్రంలో అయిన బేసిక్ అంశాలను కూడగట్టి మంచి సాంకేతిక విలువలు ఉన్న చిత్రంతో వస్తారేమో చూడాలి.. ఎక్కడా కథనం మీద ఒక పట్టు కనపడదు దర్శకుడికి చిత్రం లో ఒక విషయం గురించి చెప్పాక దాదాపు ఇరవై నిమిషాల పాటు మరొక్క విషయం వైపు కూడా వెళ్ళలేదు దర్శకుడు.. సినిమాటోగ్రాఫర్ కూడా చాలా కష్టపడి ఘోరమయిన అవుట్ పుట్ ఇచ్చారు సరయిన వసతులు లేకపోవడం వలన అయ్యి ఉండచ్చు కాని ఇలాంటి కారణాల గురించి మాట్లాడుకోవడం కూడా వ్యర్థం.. మారుతీ అందించిన సంగీతం పర్లేదు అనిపించింది.. డైలాగ్స్ సన్నివేశానికి తగ్గట్టు ఉన్నాయి , ఎడిటర్ చిత్రాన్ని చాలా కత్తిరించి ఉండవచ్చు కాని కనికరించి వదిలేసాడు ఆం ఆద్మీ పిక్చర్స్ వారి నిర్మాణ విలువు యావరేజ్ గా ఉన్నాయి సమాజానికి సందేశం ఇవ్వాలనుకున్న చిత్రాలు చాలా ఉన్నాయి ఇది కూడా ఆ కోవలోకే వస్తుంది అందరు మరిచిపోతున్న క్రీడా హాకీ ని అందరికి ఒకసారి గుర్తు చెయ్యాలి అన్నదే ఈ చిత్ర ప్రధాన నేపధ్యం లా అనిపిస్తుంది కాని చిత్రం మొదలయిన చాలాసేపటి వరకు ఎం జరుగుతుందో అర్ధం కాదు మొదటి కాసేపు విషయాన్ని వివరించాక చిత్రం ఎకడికి కదలకుండా అక్కడే ఉండిపోతుంది విశ్రాంతి సమయంలో కూడా కదలలేదు అంటే అర్ధం చేసుకోండి రెండవ అర్ధ భాగం వచ్చేసరికి హీరో ఆశయాలు అన్ని పక్కన పెట్టేసి ప్రేమ కథ అందులోని కష్టాలను తెర మీదకు తీసుకు వస్తారు.. చివరికి కాస్త సెంటిమెంట్ లో కి వెళ్లి ఆశయాన్ని మరిచిపోతారు పోనీ అలా అయినా ముగిస్తారా అంటే మల్లి ఊహించిన అంశాలనే తీసుకొచ్చి అతికించేసి ముగించేసారు.. ఈ చిత్రం ఇటు నిజానికి దగ్గరగా ఉండదు అటు పూర్తిగా ఊహాజనితంగా ఉండదు.. తరువాత సన్నివేశాలు ఏంటో కొన్ని సన్నివేశాలలో తరువాతి డైలాగు ఏంటో కూడా కనిపెట్టేయచ్చు అంత సులువుగా ఉంటుంది చిత్రం .. నిజమే ఈ చిత్రం తెరకెక్కించడం వెనుక మంచి ఉద్దేశం ఉండవచ్చు కాని అది తెర మీద అర్ధం అయ్యేలా చెప్పనప్పుడు ఎం చెప్పినా ఎం లాభం.. ఇంటర్వెల్ దగ్గర వచ్చే హాకీ గేమ్ ని ఇంటరెస్టింగ్ గ చూపించలేదు సెకండ్ హాఫ్ లో సుధాకర్ డ్రం వాయించే సన్నివేశం చిత్రానికి వెన్నెముక వంటివి కాని వాటిని అతి నాసిరకంగా తెరకెక్కించారు.. ఈ చిత్రాన్ని చూడాలని కూడా ఎవరు అనుకోని ఉండరు ఒకవేళ చూడాలని అనుకునేవాళ్లు మీ నిర్ణయాన్ని మార్చుకోవడమే మంచిది అని నా సలహా ...Sudhakar,Avanthika,Arun Dasyam,Ravi Rash Dasyam,Ram Narayan.చివరిగా : ఉందిలే మంచి కాలం ముందు ముందునా : సినిమా కాలం గడపాలిగా నందనందనా ...

మరింత సమాచారం తెలుసుకోండి: