పాటలు ,దాసరి నారాయణ రావు పాటలు ,దాసరి నారాయణ రావు పాత్రల మధ్యన ఎమోషన్స్ ,సన్నివేశాల మధ్య ట్రాన్సిషన్ ,నేపధ్య సంగీతం ,బలవంతంగా జొప్పించిన కామెడీ

రాజేష్ (మంచు విష్ణు) తాతయ్య నారాయణ రావు(దాసరి నారాయణ రావు ) దగ్గరే పెరుగుతాడు , బాగా చదువుకొని మంచి ఉద్యోగంలో స్థిరపడతాడు. రాజేష్ ఎలాగయినా అమెరికా వెళ్లి స్థిరపడాలి అనుకుంటాడు అదే లక్ష్యంగా పెట్టుకొని కష్టపడి తను అనుకున్నది సాదిస్తాడు. ఇదే సమయంలో అతనికి రజ్జి(కేథరిన్ త్రేస) పరిచయం అవుతుంది. మూడు నెలల్లో అమెరికా వెళ్ళాల్సి రావడంతో తాతని తన దగ్గరకు తెచ్చుకుంటాడు రాజేష్.. అక్కడి నుండి తాతయ్య వాళ్ళ రాజేష్ కి సమస్యలు ఎదురు అవుతుంటుంది. అంతే కాకుండా తాతయ్య చేసే పనుల వాళ్ళ అతని జీవితంలో అల్లకల్లోలం సృష్టిస్తుంది. అంతే కాకుండా అతని ప్రేమ జీవితం కూడా నారాయణ రావు వలన ప్రభావితం అవుతుంది. అతని అమెరికా కలలకి కూడా సమస్య వస్తుంది.. ఈ సమస్యలన్నింటిని అతను ఎలా అధిగమించాడు? అన్నదే మిగిలిన కథాంశం ..

దాసరి నారాయణ రావు నటన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది లేదు ఎప్పటిలానే అయన పాత్రకి వంద శాతం న్యాయం చేసాడు. ఇలాంటి పాత్రలు ఆయనకి వెన్నతో పెట్టిన విద్య అని నిరూపించుకున్నారు.. మంచు విష్ణు కి డ్రామా చాలా కొత్తది అయినా కూడా అయన తన శక్తి మొత్తం పెట్టి ఈ పాత్రకి న్యాయం చెయ్యడానికి ప్రయత్నించారు , నిజమయిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఎలా ఉంటాడో సరిగ్గా చూపించారు... కేథరిన్ పాత్రకి తగ్గ నటన కనబరిచింది ఇంతకు మించి ఈ పాత్ర గురించి ఈ నటి గురించి చెప్పుకోడానికి ఎం లేదు.. కొన్ని సన్నివేశాలలో కనిపించి రఘుబాబు ఆకట్టుకున్నారు. మిగలిన నటీనటులలో సూర్య పాత్ర చాల బాగుంది. చిన్న పాప పాత్ర చేఇస్న అమ్మాయికి నటించడానికి ఎక్కువగా ఆస్కారం దొరకలేదు. మిగిలిన నటీనటులందరు వారి పాత్రల మేరకు నటించారు..

కథ పరంగా ఇది చాలా పాత కథ , ఆరోజుల్లోనే ఈ చిత్రాన్ని ఆరోజుల్లో వచ్చింటే బాగుండేది అనేవారు... అలాంటి కథతో ప్రేక్షకులను ఆకట్టుకోవాలన్న ప్రయత్నం నిజంగా సాహసోపేతం అయినది.. కథనం విషయంలో జాగ్రత్త వహించి ఉంటె ఇది కనిపించేది కాదు కాని చిత్రం లో పాత్రల స్వభావాల గురించి వివరణ ఇవ్వడానికే మొదటి అర్ధ భాగం మొత్తం సరిపోయింది రెండవ అర్ధ భాగం వచ్చేసరికి కథ మొదలవుతుంది.. సహాయం కోసం తీసుకున్న కామెడీ సన్నివేశాలు సహాయపదకపోగా చిరాకుపెట్టాయి.. డైలాగ్స్ కొన్ని సన్నివేశాలలో బాగున్నాయి.. దర్శకత్వం బాగుంది కాని కథనం దగ్గరే సమస్య ఉండటంతో ఇది కూడా ఒక లోపంలా కనిపిస్తుంది.. సినిమాటోగ్రఫీ బాగుంది.. కోటగిరి వెంకటేశ్వర రావు అందించిన ఎదిఒతిన్గ మరింత నిక్కచ్చిగా ఉండాల్సింది కొన్ని బ్రహ్మానందం సన్నివేశాలను కత్తిరించినా చిత్రంలో మార్పు ఉండదు అయిన ఎందుకు కట్టిరించాలేదో ఆయనకే తెలియాలి.. చక్రి అందించిన సంగీతం బాగుంది కాని నేపధ్య సంగీతం సన్నివేశానికి బొత్తిగా నప్పలేదు.. కాస్ట్యూమ్స్ చాలా ఘోరంగా ఉన్నాయి, పాత్రకి తగినట్టుగా ఎక్కడా కనిపించలేదు. తారక ప్రభు ఫిలిమ్స్ వారి నిర్మాణ విలువలు బాగున్నాయి...

డ్రామా చిత్రంలో డ్రామా వర్క్ అవుట్ అవ్వలేదు అలాగని బలవంతంగా జొప్పించిన కామెడీ వర్క్ అవుట్ అవ్వలేదు పోనీ సెంటిమెంట్ అయిన సరిగ్గా సరిపోయిందా అంటే అదీ లేదు , అన్ని సగం సగం మాత్రమే సఫలం అయ్యాయి "ఎర్రబస్" చిత్రంలో, బ్రహ్మానందం చేత చేయించిన కాకి కామెడీ చిత్రానికి అవసరం లేదు. కృష్ణుడు తో చేయించిన కామెడీ కూడా చాలా ఎబ్బెట్టుగా ఉంది.. తమిళంలో మంజపై అనే చిత్రం కూడా గొప్ప చిత్రం కాదు కాని అందులో నతీనతులన్దరి ప్రదర్శన చిత్రాన్ని నిలబెట్టింది ఈ చిత్రంలో కూడా నటీనటులందరు మంచి ప్రదర్శన కనబరిచారు కాని అక్కడి సన్నివేశాలను ఇక్కడికి మార్చేప్పుడు జరిగిన లోపం గమనించలేదు. ఆ చిత్రంలో ప్రతి పాత్రకి ఇంకొక పాత్రతో బలమయిన బంధం ఉంటుంది ఈ చిత్రంలో అది లోపించింది అది లేకుండా సెంటిమెంట్ పండించాలన్న ప్రయత్నం వృధా అయిపోయింది.. మొత్తానికి ఈ చిత్రం ఎటూ కాకుండా మిగిలిపోయింది కాస్త ఫ్రెష్ కామెడీ కి మంచి సెంటిమెంట్ సన్నివేశాలను జతపరిచి ఉంటె ఈ చిత్రం చాలా బాగుండేది.. ఎవరో ఔత్సాహికుడు అన్నట్టు ఎయిర్ బస్ లు కూడా కామన్ అయిపోయిన ఈ రోజుల్లో ఎర్ర బస్సు లాంటి సినిమాలు ఎలా చూస్తారు. నిజమే మరి.. ఈ చిత్రాన్ని చూడాలా వద్దా అంటే కాస్త కష్టమయిన తమిళం నేర్చుకొని తమిళంలో చూడటం మంచిది...

Vishnu Manchu,Catherine Tresa,Dasari Narayana Rao,Chakri.చివరగా : ఎర్రబస్ : బ్రేక్ డౌన్ అయ్యింది...

మరింత సమాచారం తెలుసుకోండి: