ఏమీ లేవు..ఏమీ లేవు..అన్నీ మైనస్ లేజై (వరుణ్ సందేశ్) మొదట అమ్మాయిలంటే దూరంగా ఉంటాడు, ఆ తర్వాత ఒక సాంప్రదాయబద్దమైన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అంటాడు. అందులో భాగంగా ఓ ఇద్దరు అమ్మాయిల చేతిలో మోసపోతాడు. కట్ చేస్తే ఒక రోజు రైలు ప్రయాణంలో మహాలక్షి (హరిప్రియ)ను చూసి తొలిచూపులోనే ప్రేమలో పడతాడు. ఎలాగైనా తన ప్రేమని చెప్పాలని మహాలక్ష్మి ఊరైన రాజమండ్రి వెళతాడు. కానీ అప్పుడే జై కి ఓ షాకింగ్ న్యూస్ తెలుస్తుంది. అదే పెళ్లి పీటల మీద నుంచి వేరెవరితోనో లేచిపోయి ఉంటుంది. ఆ తర్వాత జై కి మహాలక్ష్మి ఎక్కడన్నా కనపడిందా.? కనపడితే ఎలాంటి సందర్భంలో కనపడింది.? అసలు మహాలక్ష్మి లేచిపోయిన వ్యక్తి ఎవరు.? ఎందుకు లేచిపోయింది.? ఈ జర్నీలో జై ప్రేమకథ ఏమైంది..? వంటి ప్రశ్నలకు సమాధానం మీకు వెండితెరపైనే దొరుకుతుంది. 'కొత్త బంగారు లోకం' నుంచి బాక్స్ ఆఫీసు వద్ద విజయం కోసం వరుసగా గజినీ మొహమ్మద్ లా దండయాత్ర చేస్తున్న యంగ్ హీరో వరుణ్ సందేశ్.. ఈ సినిమాకి నటీనటుల డిపార్ట్ మెంట్ లో చాలా తప్పులే జరిగాయి. అస్సలు ఎవరికీ పెద్దగా సెట్ అయ్యే పాత్రలు చెయ్యలేదు. ఇప్పటికే చాలా సినిమాలు చేసిన వరుణ్ సందేశ్ ఇకనైనా మేలుకొని తన నటనని మెరుగుపరుచుకోవాలి. ఎవరైనా సినిమా సినిమాకి నటనలో మెచ్యూరిటీ చూపిస్తారు కానీ వరుణ్ సందేశ్ మాత్రం సినిమా సినిమాకి నటనలో దిగజారిపోతున్నాడు. కేవలం నటనలో మాత్రమే కాకుండా కథల ఎంపికలో కూడా సరైన నిర్ణయాలు తీసుకోవాలి. ఏదో కాస్తో కూస్తో ఇమేజ్ ఉంది కదా అని డబ్బు కోసం, ఎంజాయ్ మెంట్ కోసం వచ్చిన సినిమాలన్నీ ఒప్పుకోకుండా సెలక్టివ్ గా ముందుకు వెళ్తే తన కెరీర్ బాగుంటుంది. ఇక హరిప్రియ సినిమాలో లూక్స్ పరంగా మాత్రం బాగుంది. హావభావాలు పలికించాల్సిన సీన్స్ పెద్దగా లేవు, అవసరమైన సీన్స్ లో బాగానే చేసింది. చలపతిరావు, హేమ, కాశీ విశ్వనాధ్, జీవలు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక కమెడియన్స్ అయిన ధన్ రాజ్, జీవ, చంద్ర, శీను గ్యాంగ్ పలు విధాలుగా కామెడీ చెయ్యాలని ట్రై చేసారు కానీ ఆడియన్స్ ని మాత్రం నవ్వించలేకపోయారు. మిగతా నటీనటులకు చెప్పుకునేంత పాత్రలు లేవు. ఈ సినిమా కోసం డైరెక్టర్ చాలా చిన్న లైన్ ని కథగా ఎంచుకున్నాడు. కానీ ఆ చిన్న కథతో ఆడియన్స్ ని మెప్పించలేకపోయాడు. ఈ సినిమా కథనం లో చెప్పలేనన్ని లూప్ హోల్స్ దొరుకుతాయి.. ఈ సినిమా కథ మన పాత తెలుగు సినిమాలైన దొంగోడు, నీ మనసు నాకు తెలుసు సినిమాల్లాగే ఉంటుంది. కానీ ఐదు పది నిమిషాల్లో ఫినిష్ చెయ్యాల్సిన ట్రాక్ ని మొదటి అరగంటదాకా సాగదీసారు. అలాగే డైరెక్టర్ హీరోకి అమ్మాయిలంటే ఇష్టం ఉందా లేక అస్సలు లేదా అనే విషయాన్నీ సరిగా చెప్పలేదు. హీరో పాత్ర ఏంటనేది కరెక్ట్ గా చెబితే ఆడియన్స్ ఆ పాత్రతో ట్రావెల్ అవుతారు, అసలు ఆ పాత్రే ఆడియన్స్ కి కనెక్ట్ కాకపోతే ఇక సినిమా ఏం చూస్తారు, ఎలా నచ్చుతుంది.? ఈ సినిమాలో ఆడియన్స్ ని ఎగ్జైట్ చేసేలా ఏమీ లేదు, ఏమైనా వస్తుందేమో, ఇకపై బాగుంటుందేమో అని ఎదురు చూస్తున్న ఆడియన్స్ చివరికి నిరాశ చెందాల్సిందే తప్ప డైరెక్టర్ మాత్రం మిమ్మల్ని ఎంటర్టైన్ చెయ్యడు. ఫస్ట్ హాఫ్ చాలా బోరింగ్ గా ఉండడమే కాకుండా ఎందుకురా బాబు సాగదీస్తున్నావ్ అనే ఫీలింగ్ ని కలుగజేస్తుంది. ఇంటర్వల్ లో సెకండాఫ్ కాస్ట్ బాగుంటుందేమో అని అనుకునే ఆడియన్స్ ని ఇంకా చిరాకు పెట్టేలా సెకండాఫ్ ఉంటుంది. కావున ఈ వర్షం సాక్షిగా లో మీ చేత బాగుంది అని అనిపించేలా ఏమీ లేదు. అనిల్ గోపి రెడ్డి అందించిన సాంగ్స్ బిలో యావరేజ్ గా ఉంటే విలాస్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అంతంత మాత్రంగానే ఉంది. సినిమాటోగ్రాఫర్ తనకిచ్చిన లోకేషన్స్ ని చాలా బాగా చూపించాడు. చెప్పాలంటే డైరెక్టర్ లోకేషన్స్ ని బాగా చూపిస్తే సినిమా బాగుంటుంది అనే టాక్ వస్తుందనే భ్రమలో ఉన్నాడేమో అనిపిస్తుంది. ఎడిటర్ నందమూరి హరి ఈ సినిమాలో చాలా సీన్స్ ని సింపుల్ గా కట్ చేసి ఉండచ్చు. ముఖ్యంగా చేజ్ సీక్వెన్స్ ని.. చివరిగా ప్రొడక్షన్ వాల్యూస్ ఓకే అనేలా ఉన్నాయి.. పైన చెప్పినట్టు వారున సందేశ్ చేసిన ఈ దండయాత్ర కూడా పరాజయాన్నే మిగిల్చింది. ఈ వర్షం సాక్షిగా అనే సినిమా టికెట్ డబ్బుతో మీ జేబుకు చిల్లు పెట్టి మరీ మీకు తలనొప్పి తెచ్చే సినిమా. కావున ఈ సినిమాకి ఎంత దూరంగా ఉంటే మీకంత మంచిది.. గత నాలుగైదు వార్లుగా బాక్స్ ఆఫీసు పై దాడి చేస్తున్న ప్రతి చిన్న సినిమా ఆడియన్స్ కి చెడు అనుభవాన్నే మిగిల్చింది. Varun Sandesh,Haripriya,Ramana Mogili,B. Obul Subba Reddy,Ramajogaya Sastry.పంచ్ లైన్ : ఈ వర్షం సాక్షిగా - ఇది వర్షం కాదు మన ప్రాణాలు తీసే వరద.!

మరింత సమాచారం తెలుసుకోండి: