హైలెట్స్ అంటూ ఏమి లేకపోవడం హైలెట్స్ అంటూ ఏమి లేకపోవడం అన్నీ చెప్పుకోడానికి ఓపిక లేకపోవడం ఈ చిత్రం ముగ్గురి జీవితాల చుట్టూ తిరుగుతుంది , మొదటి కథ వివేక్ (నవదీప్) ఒక నిరుద్యోగి కష్టపడి చదివినా కూడా ఉద్యోగం కోసం లంచం అడగడం, అది కట్టడానికి తన దగ్గర డబ్బులు లేకపోవడంతో నిరుద్యోగిగా ఉండిపోతాడు. వివేక్ మరియు శ్రీ లక్ష్మి (పూజ జవేరి) ప్రేమించుకుంటూ ఉంటారు. వివేక్ కి ఉద్యోగం వస్తే కాని శ్రీ లక్ష్మి ఇంట్లో పెళ్ళికి ఒప్పుకోరు వివేక్ కి డబ్బులిస్తే కాని ఉద్యోగం రాదూ .... అనుకోని పరిస్థితుల్లో వివేక్ వసూల్ రాజ (పంకజ్ కేసరి) దగ్గర సమస్యలో ఇరుక్కుపోతాడు..

ఇదే సమయంలో కృష్ణ(నవీన్ చంద్ర) ఒక దొంగ, వస్తువులను దొంగలించి సేట్ జీ(పోసాని) దగ్గర అమ్ముతూ ఉంటాడు. ఎప్పటికయినా దుబాయ్ కి వెళ్లి అక్కడ పెద్ద డాన్ అవ్వాలని కృష్ణ కల, అందుకోసం ఎలాగయినా పది లక్షలు సంపాదించి దుబాయ్ వెళ్ళాలని అనుకుంటాడు. ఆఫ్రికా కి చెందిన ఒక వజ్రాన్ని దొంగతనం చేస్తే ముప్పై లక్షలు ఇస్తాను అని సేట్ చెప్తాడు. దాన్ని కొట్టేసి తప్పించుకునే సమయంలో ఒక సమస్యలో ఇరుక్కుపోతాడు , ఈ సమస్యకి కూడా సమాధానం వసూల్ రాజ దగ్గరే ఉంటుంది ...

రామకృష్ణ అలియాస్ రాకీ (ప్రదీప్) మరియు రోషన్(కిరీటి) మాదక ద్రవ్యలకి బానిసలయ్యి ఉంటారు. వీరు మరియు వీరి గర్ల్ ఫ్రెండ్స్ కలిసి ఒకే ఇంట్లో ఉంటారు. ఒక రోజు సిటీ బయట జరిగే రేవ్ పార్టీ కి వెళ్తూ అనుకోని సమస్యలో ఇరుక్కుపోతారు వీరి సమస్యకి కూడా పరిష్కారం వసూల్ రాజ దగ్గరే ఉంటుంది .. మూడు కథలు ఎలా పరిష్కారం అయ్యింది అన్నదే మిగిలిన కథ..నటనాపరంగా అంతగా ఆస్కారం లేని చిత్రం ఇది, నవదీప్ ఉన్నంతలో ఆకట్టుకున్నారు ఇతని పాత్ర కి ఇతని ఆహార్యానికి పొంతన కుదరదు. నటించే అవకాశం లేని సన్నివేశాలలో నటుడు మాత్రం ఎంతని చెయ్యగలడు. పూజ జవేరి పాత్రకి కూడా నటించే అవకాశం దక్కలేదు పైగా అందాల ఆరోబోతకి కూడా ఆస్కారం లేని పాత్ర కావడంతో టీవీ యాంకర్ లా వచ్చి, నవ్వి, మాట్లాడి , వెళ్లిపోయింది అన్నట్టు సాగింది ఈ అమ్మాయి పాత్ర. నవీన్ చంద్ర, డాన్ అయిపోవాలని దొంగతనాలు చేసే పాత్ర ఇటు దొంగలాను కనపించడు అటు డాన్ లక్షణాలను చూపించలేదు. మాస్ గా చూపించాలని ప్రయత్నించారు కాని క్లాస్ గా కనిపించడంతో సగం ఉడికిన బంగాళదుంప అయిపోయింది ఇతని పాత్ర. ఇతని పక్కన ఉన్న ప్రవీణ్ అప్పుడప్పుడు నవ్వించాడు. విలన్ పాత్రలో చేసిన భోజ్పురి నటుడు పంకజ్ కేసరి కి బహుశా భాష అర్ధం కాలేదేమో అతని మాటకి అతని హవాభావాలకి మ్యాచింగ్ లేకుండా పోయింది కొన్ని సన్నివేశాలలో అవసరానికి మించి నటించేసి చిరాకు పెట్టించేసాడు. ప్రదీప్ నటన మాత్రమే ఈ చిత్రంలో చెప్పుకోదగ్గ ప్రదర్శన, మాదక ద్రవ్యాలకు బానిస అయిన యువకుడి పాత్రలో చాలా బాగా నటించాడు ఇతను మరియు కిరీటి మధ్యన తెరకెక్కించిన సన్నివేశాలు చాలా రియలిస్టిక్ గా ఉన్నాయి. వీరి పక్కన జంటగా నటించిన ప్రాచీ మరియు శ్రేయ అందాల ఆరబోత అంతిమ లక్ష్యంగా నటించారు అందులో సఫలీకృతులయ్యారు.. మిగిలిన అందరు కూడా ఉన్నా.. లేనట్టే ... కీలక పాత్రలకే అవకాశం లేని చోట చిన్న పాత్రల పరిస్థితి గురించి మాట్లాడుకోడానికి ఏమి ఉంటుందని ...కథ, కథనం , మాటలు మరియు దర్శకత్వం ఈ నాలుగు విభాగాలను దండు కార్తీక్ వర్మ మేనేజ్ చేసారు. కథ కమామీషు గురించి మాట్లాడుకుంటే కథ ఏంటంటే.. కథేంటి .. తెలుగు చిత్రాలలో "కథ కనబడుటలేదు" అనే కోవలోకి ఈ చిత్రాన్ని తోసేయ్యచ్చు.. కథనం విషయానికి వస్తే కథ ఉండి పాత్రలుంటే అవి బలంగా ఉండేది. ఈ చిత్రంలో అన్ని పాత్రలు కూడా పోషకాహార లోపంతో బాధపడుతున్నట్టు ఉన్నాయి . ఒక్కటి పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసినట్టు కనిపించదు.. కథన వేగం గురించి చెప్పుకుంటే.. రోడ్ రోలరుతో అనకాపల్లి నుండి ఆదిలాబాద్ ప్రయాణించినంత నీరసంగా సాగింది. చిత్రం మొదటి గంట లేకపోయినా రెండవ గంటలో ఏ మాత్రం మార్పు ఉండదు అంటే అంత వేగంగా సాగింది చిత్రం. డైలాగ్స్, చిత్రంలో అన్ని పాత్రలో ఒకేలాగా మాట్లాడితే ఆ పాత్రకి ఈ పాత్రకి తేడా ఏముంటది .. ఈ చిత్రంలో పాత్రలు అలానే ఉంటది .. నవదీప్ , నవీన్ చంద్ర ఒకేలాగా మాట్లాడుతారు.. ప్రవీణ్ , జోష్ రవి ఒకేలాగా మాట్లాడుతారు .. ఇలా ప్రతి రెండు పాత్రలు ఒకేలాగా మాట్లాడుతూ ఒకేలాగా ప్రవర్తిస్తుంటాయి. దర్శకత్వం విషయానికి వస్తే సాయి కార్తీక్ అందించిన ఒక పాటను చాలా అద్భుతంగా వాడుకున్నారు ఇదొక్కటే పోజిటివ్ గా చెప్పుకోదగ్గ విషయం అనవసరమయిన స్లో మోషన్ షాట్స్ అవసరం లేని లవ్ ట్రాక్ అబ్బో ఇలా చాలానే ఉన్నాయి లొసుగులు.. ఆలోచన బాగుంది కాని ఆచరణలో జరిగిన తప్పులు లోపాలు కోకొల్లలు.. భరణి కే ధరన్ అందించిన సినిమాటోగ్రఫీ బాగుంది ఈ చిత్రంలో చెప్పుకోదగ్గ అతి తక్కువ అంశాలలో ఇది ఒక్కటి.. సాయి కార్తీక్ అందించిన సంగీతం మరియు నేపధ్య సంగీతం ఆకట్టుకుంది. ఎడిటింగ్ బాగుంది కాని ఇంకొన్ని సన్నివేశాలను నిర్దయగా కత్తిరించి ఉంటె ప్రేక్షకుడు సంతోషించేవాడు. నిర్మాణ విలువలు బాగున్నాయి..ఏ చిత్రం అయిన బాగుండాలని కోరుకునే ప్రేక్షకుడు చూడటానికి వెళ్తాడు, ఏ చిత్రం అయినా బాగుంటుంది అని నమ్మే దర్శకుడు తెరకేక్కిస్తాడు.. కాని ఈ మధ్యలో చాలా విషయాలు లేదా సంఘటనలు ఫలితాన్ని మార్చేస్తాయి. ఈ చిత్రంలో కూడా అదే జరిగింది, మొదలయిన ఆలోచన బాగుంది కాని ఆ ఆలోచనని చెప్పడానికి రాసుకున్న సన్నివేశాలు పాత్రలు ఒక్కటంటే ఒక్కటి కూడా సఫలం అవ్వకపోవడం బహుశా చాలా తక్కువ చిత్రాలలోనే చూస్తుంటాము. ఈ చిత్రం కూడా అదే కోవలోకి వస్తుంది, ఈ చిత్రం పూర్తిగా దర్శకుడి వైఫల్యం , ఒక్క దర్శకుడికీ మాత్రమే ఈ క్రెడిట్ మొత్తం దక్కాలి, ఒక ఆలోచనను ఒక దర్శకుడు ఎలా అయితే చెయ్యకూడదు అనుకుంటాడో.. ఒక ప్రేక్షకుడు ఎలాంటి చిత్రం అయితే చూడకూడదు అనుకుంటాడో సరిగ్గా అలాంటి చిత్రమే "భం భోలే నాథ్" ...Navdeep,Naveen Chandra,Pooja Jhaveri,Karthik Varma Dandu,Siruvuri Rajesh Varma,Sai Karthik.భం భోలేనాథ్ - భం "బోర్" నాథ్ ...

మరింత సమాచారం తెలుసుకోండి: