పూర్ణపూర్ణకథ , కథనం , దర్శకత్వం , ఎడిటింగ్ , ఇంకా చాలా

మోహిని (పూర్ణ) - హర్ష(హర్ష వర్ధన్ రాణే) నూతన జంట ఊరి బయట ఒక గేటెడ్ కమ్యూనిటీ లో ఒక ఇంట్లో చేరుతారు, అ ఇంట్లో అప్పటికే చనిపోయిన కెప్టెన్ రాజు(రవిబాబు) మోహిని మీద కోరిక తో రగిలిపోయి ఆమెను ఎలాగయినా అనుభవించాలని అనుకుంటాడు. ఆ ప్రయత్నంలోనే హర్షను పొడుస్తుంది మోహిని.


ఇక్కడ ముగుస్తుంది మొదటి భాగం, ఇక్కడే మొదలవుతుంది రెండవ భాగం. ఇల్లు మారి సిటీ లో ఒక హాయ్ టెక్నాలజీ ఇంట్లో ఉంటారు హర్ష - మోహిని, మోహిని ని వెతుక్కుంటూ ఆ ఇంటికి కూడా చేరుతాడు కెప్టెన్ రాజు ఆ ఇంట్లో చేరాక ఆ ఇంట్లో కొన్ని విచిత్ర సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఆ తరువాత ఏమయ్యింది అసలు ఏమయినా అయ్యిందా లేదా? మోహిని రాజు నుండి తప్పించుకుందా? అనేది తెర మీద చూడండి... 

ఈ చిత్రంలో చెప్పుకోదగ్గ ప్రదర్శన కనబరిచింది పూర్ణ, చిత్రం మొత్తం తన చుట్టూనే తిరుగుతుంది ఆమె పాత్ర ఎంత కీలకమో ఆమె కూడా ఆ పాత్రకి న్యాయం చెయ్యడానికి అంతే స్థాయిలో ప్రయత్నించింది. కాని కథనంలో ఉన్న లొసుగుల మూలాన పాత్రతో ప్రేక్షకుడు కనెక్ట్ కాలేడు . హర్షవర్థన్ రానే పరవాలేదనిపించాడు ముఖ్యంగా క్లైమాక్స్ లో వచ్చిన సన్నివేశంలో అతని నటన ఆకట్టుకుంది. రవివర్మ నటన బాగుంది కాని అతని పెట్టుడు గెడ్డం అతని నటనను డామినేట్ చెయ్యడమే కాకుండా ప్రేక్షకుల దృష్టిని లాగేసుకుంది. ఇతని పాత్ర మీద మరింత దృష్టి పెట్టి ఇంకాస్త ఆసక్తికరంగా మలచి ఉంటె బాగుండేది. చక్రవర్తి పాత్ర పరవాలేదు, మిగిలిన అన్ని పాత్రలు ఉన్నంతలో ఆకట్టుకున్నాయి. 

ఈ చిత్ర కథ చాలా సన్నగా అసలు ఉందా లేదా అన్నట్టు ఉంటుంది. కాని కథ కదులుతున్న కొద్ది ప్రేక్షకుడిలో ఒక క్లారిటీ వస్తుంది అది కథ ఏమి లేదని. చిత్రం మొదలయ్యింది , మొదటి సన్నివేశంలో మొదలయ్యే కెప్టెన్ రాజు వాంఛ కథ చివరి వరకు అదే కథ, ఒకే సన్నివేశం తిప్పి తిప్పి అదే వస్తుంటుంది. నిజానికి ఈ కథ ఇంగ్లీష్ లో ఎంటిటి అనే చిత్రం నుండి ప్రేరణ పొందింది కాని ఆ చిత్రంలో ఉన్న హారర్ ఈ చిత్రంలో ఏ సన్నివేశంలో కూడా కనపడదు. కామంతో రగిలిపోయే ఒక దయ్యం, అది ఏం చెయ్యగలదు అనేది మొదటి భాగంలో చాలా క్లియర్ గా చూపించారు.


మళ్ళీ అవే చూపించి జనాన్ని భయపెట్టగలం అన్న దర్శకుడి ఆలోచనే ఈ చిత్రానికి మొదటి డ్రా బ్యాక్, ఇదే కథను ఇలానే చూపించి ఇకపై ప్రేక్షకులను మోసం చెయ్యలేరు. అవే సన్నివేశాలను పదే పదే  ఉపయోగించి భయపెట్టడం మానెయ్యాలి. ఒక్క సన్నివేశానికి కూడా సరయిన గమ్యం ఉండదు. అవసరం లేని సన్నివేశాలు అంతర్యం లేని పరిస్థితులు ఈ చిత్రంలో కోకొల్లలు, ఇంత వీక్ కథనం ఉన్న ఈ చిత్రానికి దర్శకత్వం మరొక దారుణమయిన డ్రా బ్యాక్ , ఎక్కడా కూడా ఆసక్తికరంగా ఉండదు. హారర్ చిత్రమన్న పేరే  కాని ఒక్కటంటే ఒక్క సన్నివేశం భయపెట్టలేదు కదా ఒక్క సన్నివేశం కూడా చిరాకు పెట్టకుండా ఉండలేదు. చిత్రంలో కొన్ని అంశాలు ఆసక్తి రెకెత్తించినా వాటిని ఉపయోగించుకోలేకపోవడం దర్శకుని వైఫల్యంకి నిదర్శనం.

Ravi Babu Avunu 2 Interview Photos,Avunu 2 movie review,Avunu2 videos

ఇంకొక పాత్రకి మానసిక సమస్యని చూపెట్టి దాన్ని కూడా సరిగ్గా ఉపయోగించుకోలేదు. మంత్రించిన తాయత్తుని దెయ్యం చూస్తే కాని పని చెయ్యకపోవడం వెనుక ఉన్న లాజిక్ గురించి చెప్పడం కూడా వ్యర్థం. మాటలు ఆకట్టుకునే స్థాయిలో లేదు, భుపేష్ . ఆర్ . భూపతి  సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. శేఖర్ చంద్ర అందించిన నేపధ్య సంగీతం దారుణం , ప్రేక్షకుడికి తప్పక వచ్చే తలనొప్పికి కారణం. ఎడిటర్ ఇంకాస్త కఠినం గా వ్యవహరించి సన్నివేశాలను కత్తిరించి ఉంటె ప్రేక్షకుడికి ఉపసమనం దొరికేది. సురేష్ ప్రొడక్షన్స్ మరియు ఫ్లయింగ్ ఫ్రాగ్స్ నిర్మాణ విలువలు బాగున్నాయి. 

ఒక హారర్ చిత్రాన్ని ఒక థ్రిల్లర్ అంశాన్ని ఎంత అనాసక్తికరంగా తెరకేక్కించవచ్చు అనే అంశం మీద ఎక్కడయినా ఒక స్టడీ జరుగుతుంటే ఎవరయినా ఒక లిస్టు ప్రిపేర్ చేస్తుంటే ఆ లిస్టు లో తప్పక చేరవలసిన చిత్రం "అవును-2". అవును అనే చిత్రం ఎందుకు బాగుంది అని బేరీజు వేస్తే అందులో ఒక అంశం ఉంటుంది అది వివరించి దానికి సరయిన సమాధానం ఇచ్చారు. ఇప్పటికే వివరించేసిన విషయాన్నీ మళ్ళీ పదే పదే చెప్పడంలో దర్శకుడి శాడిజం ఏంటో అర్ధం కాదు.


మొదటి అర్ధ భాగం మొత్తం ఒక్కటంటే ఒక్కటి కూడా ఆకట్టుకునే సన్నివేశం లేదు. పోనీ రెండవ అర్ధం లో అయినా ఉన్నాయా అంటే ఉన్నాయి మంచి కాన్సెప్ట్ లు రెండు ఉన్నాయి కాని వాటిని పట్టించుకునే పరిస్థితుల్లో దర్శకుడు లేదు పూర్తిగా వాటిని పక్కన పెట్టేసి కెప్టెన్ రాజు "కామం" మీద నే దృష్టి పెట్టారు. సరిగ్గా చెప్పాలంటే ఈ చిత్రంలో పూర్ణ అందాలలో ఉన్న విషయంలో పది శాతం కూడా చిత్రంలో లేదు. మొదటి భాగంలో రాజు కామం ఎలాగయినా మోహిని ని దక్కించుకోవాలన్న కోరిక స్పష్టంగా కనిపిస్తుంది కాని ఇందులో కెప్టెన్ రాజు దెయ్యం టెక్నాలజీ ని ఎలా ఉపయోగించుకుంది అన్నదే చూపించాడు. పాస్ వర్డ్ బ్రేక్ చేస్తాడు టాబ్లెట్ ఉపయోగిస్తాడు, కెప్టెన్ రాజు దెయ్యం కన్నా ఎక్కువ సాఫ్ట్వేర్ ఇంజనీర్ లా కనిపించాడు.


ఒక సన్నివేశంలో శరీరం అవసరం లేకుండానే మోహిని ని మానభంగం చెయ్యడానికి ప్రయత్నిస్తాడు ఇంకొక సన్నివేశం లో ఎవరో ఒకరి శరీరంలో కి దూరుతాడు. ఒక దెయ్యానికి లేని క్లారిటీ ఒక దర్శకునికి లేని క్లారిటీ ఒక ప్రేక్షకుడికి ఎలా వస్తుంది అంటారు రవి బాబు గారు... అవును చుసిన వాళ్ళకి ఇందులో చూడడానికి కొత్తగా ఏమి లేదు .. అయినా చూస్తాను అనుకుంటే పూర్ణ అందాల కోసం ఒకసారి ప్రయత్నించవచ్చు.. 

Poorna,Harshvardhan Rane,Nikita Thukral,Sanjana,Ravi Babu,D. Suresh Babu,Sekhar Chandra.చివరగా : అవును 2 - హారర్ కాదు హారిబుల్ చిత్రం ..

మరింత సమాచారం తెలుసుకోండి: