రకుల్ ప్రీత్ సింగ్ గ్లామర్ అండ్ పెర్ఫార్మన్స్ , ఎంటర్టైనింగ్ గా స్టార్ట్ అయ్యే ఫస్ట్ 40 నిమిషాలు , మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ , ఎస్ఎస్ తమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ , ప్రొడక్షన్ వాల్యూస్రకుల్ ప్రీత్ సింగ్ గ్లామర్ అండ్ పెర్ఫార్మన్స్ , ఎంటర్టైనింగ్ గా స్టార్ట్ అయ్యే ఫస్ట్ 40 నిమిషాలు , మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ , ఎస్ఎస్ తమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ , ప్రొడక్షన్ వాల్యూస్సెకండాఫ్ లో ఎంటర్టైన్మెంట్ పూర్తిగా లోపించడం , రన్ టైం , చాలా చోట్ల సాగదీసిన సీన్స్ , స్లో నేరేషన్ , ఆసక్తికరంగా సాగని కథనం , రొటీన్ ఫ్లేవర్ లో సాగే సెకండాఫ్ , కిక్ స్థాయికి మ్యాచ్ కాలేక పోయిన కథ , వెరీ బోరింగ్ సెకండాఫ్ స్టార్టింగ్ , సెకండాఫ్ లో కంఫర్ట్ పాత్రని సరిగా వాడుకోకపోవడం
ప్రతి మనిషి తన రోజూవారి జీవితంలో అనుకునే 'కిక్' అనే పదాన్ని బేస్ చేసుకొని ఓ పాత్రని సృష్టించి, దాని చుట్టూ ఓ కథని అల్లుకొని తీసిన 'కిక్' సినిమా 2009లో విడుదలై తెలుగు ప్రేక్షకులకు పిచ్చ కిక్ ఇచ్చింది. కిక్ సినిమాలోని కళ్యాణ్ అలియాస్ (రవితేజ)-నైన(ఇలియానా)ల కుమారుడైన రాబిన్ హుడ్(రవితేజ) కథనే 'కిక్ 2'లో చెప్పారు. కళ్యాణ్ తన కిక్ కోసం పక్కోడి ప్రాణాలతో పేకాడుకునే టైపు అయితే, ఇందులో రాబింగ్ హుడ్ తనకి కావాల్సిన కంఫర్ట్ మిస్ అయితే పక్కోడి నరాలు తెంచి గిటార్ వాయించే టైపు. అదే తనకు కంఫర్ట్ గా ఉంటే పక్కనోడి ప్రాణాలు పోతున్నా ఎవరి సమస్యను వారే పరిష్కరించుకోవాలని అంటుంటాడు. ఇక కిక్ 2 కథలోకి వెళ్దాం.. 


తన కంఫర్ట్ కోసం 9 నెలలు తల్లి కడుపులో ఉండలేక 7 నెలలకే బయటకి వచ్చేసిన కంఫర్ట్ అలియాస్ రాబిన్ హుడ్(రవితేజ) పుట్టి పెరిగేది అంతా అమెరికాలోనే.. చిన్నప్పటి నుంచే తల్లి తండ్రులకి, ఫ్రెండ్స్ కి కంఫర్ట్ తో చుక్కలు చూపించిన రాబిన్ హుడ్ తనకు ఇండియాలో ఉన్న ఆస్తులన్నీ అమ్మేసి, యుఎస్ లోనే ఓ మంచి హాస్పిటల్ పెట్టి అక్కడే కంఫర్ట్ గా సెటిల్ అవ్వాలనుకుంటాడు. అందులో భాగంగానే ఇండియా వస్తాడు. అలా వచ్చిన రాబిన్ హుడ్ కి చైత్ర (రకుల్ ప్రీత్ సింగ్) పరిచయం కావడం, చైత్ర రాబిన్ హుడ్ తో ప్రేమలో పడడం చకాచకా జరిగిపోతాయి. కానీ రాబిన్ హుడ్ మాత్రం లవ్ చెయ్యడు. ఫైనల్ గా తిరిగి అమెరికా తిరిగి వెళ్ళిపోతున్న రోజు చైత్రని తను కూడా ప్రేమిస్తున్నాడని రియలైజ్ అవుతాడు. కట్ చేస్తే అదే టైంలో చైత్ర కిడ్నాప్. కట్ చేస్తే సినిమా బీహార్ లోని విలాస్ పూర్ అనే గ్రామానికి కథ షిఫ్ట్ అవుతుంది. అక్కడే మన మెయిన్ విలన్, సన్ అఫ్ గాడ్ అని చెప్పుకునే సోలోమాన్ సింగ్ ఠాకూర్(రవి కిషన్), అతని కొడుకు (కబీర్ సింగ్)లు ఎంటర్ అవుతారు.ఈ ఇద్దరూ రాబందులు పీక్కుతిన్నట్టు అక్కడి ప్రజల్ని అష్ట కష్టాలు పెడుతుంటారు. అక్కడికి వచ్చిన రాబిన్ హుడ్ కి కొన్ని కారణాల వల్ల సోలోమాన్ సింగ్ ఠాకూర్ ఫ్యామిలీ వల్ల తన కంఫర్ట్ మిస్ అవుతుంది, దాంతో సోలోమాన్ సింగ్ ఠాకూర్ తో యుద్ధం మొదలవుతుంది. రాబిన్ హుడ్ - సోలోమాన్ సింగ్ ఠాకూర్ కి మధ్య యుద్ధం మొదలవ్వడానికి గల కారణం ఏమిటి.? సోలోమాన్ సింగ్ ఠాకూర్ ఏ విషయంలో రాబిన్ హుడ్ ని టచ్ చేస్తాడు.? అసలు చైత్రని ఎవరు, ఎందుకు కిడ్నాప్ చేసారు.? హైదరాబాద్ లో ఉన్న చైత్రకి, విలాస్ పూర్ గ్రామానికి ఉన్న సంబంధం ఏమిటి.? ఆ ఊరికి రాబిన్ హుడ్ కి ఏమన్నా సంబంధాలు ఉన్నాయా.? అనే ఆసక్తికర మలుపులను మీరు సిల్వర్ స్క్రీన్ పై చూసి థ్రిల్ అవ్వాల్సిందే..  

'కిక్ 2' సినిమాలో చాలామంది నటీనటులే ఉన్నారు.. ముందు మిస్టర్ కంఫర్ట్ అదేనండి రవితేజ నుండి మొదలు పెడతా.. ముందుగా రవితేజ డైరెక్టర్గ అనుకున్న కంఫర్ట్ అనే పాత్రకి బాగా ఫిట్ అయ్యాడు. ఇక మాస్ డైలాగ్స్, మాస్ మానరిజమ్స్ చూపడంలో రవితేజ పెట్టింది పేరు కాబట్టి మాస్ గా మంచి నటనని కనబరిచాడు. లుక్ విషయానికి వస్తే గత సినిమా కంటే ఈ సినిమాలో చాలా స్లిమ్ అండ్ ఫిట్ గా కనిపిస్తాడు. ఉన్నపాటుగా తగ్గడం వలన చాలా చోట్ల ఫేస్ లో మునుపటి కళ కనిపించదు, అలాగే చాలా చోట్ల ముసలి కళ కనపడుతుంది. ఇకపోతే ఫస్ట్ పార్ట్ కి సంబందించిన కళ్యాణ్ పాత్రలో రవితేజ బాగా సెట్ అయ్యాడు. ఇక టాలీవుడ్ లేటెస్ట్ లక్కీ గర్ల్ రకుల్ ప్రీత్ సింగ్ కి గ్లామర్ తో పాటు కాస్త నటనకి కూడా ప్రాధాన్యం ఇచ్చారు. మొదట్లో, పాటల్లో మోడ్రన్ లుక్ లో కనిపించి తన అందచందాలతో ఆకట్టుకున్న రకుల్ ప్రీత్ బీహార్ విలాస్ పూర్ విలేజ్ గెటప్ సూపర్బ్ గా సెట్ అయ్యింది. ఆ విలేజ్ లుక్ లో చాలా చాలా క్యూట్ గా ఉంది. ఇక తనకి ఇచ్చిన ఎమోషనల్ సీన్స్ చాలా బాగా చేసింది. కామెడీ కింగ్ బ్రహ్మానందం పండిట్ రవితేజగా ఒక మాదిరిగా నవ్వించాడు. రవితేజ - బ్రహ్మానందం కాంబినేషన్ సీన్స్ ఓకే అనేలా ఔన్నాయి, కానీ కిక్ సినిమా రేంజ్ లో లేవు. బీహార్ బ్యాక్ డ్రాప్ మూవీ కావడం వలన రాజ్పల్ యాదవ్, సంజయ్ మిశ్రాలను పెట్టుకున్నారు. వీరిద్దరూ సెకండాఫ్ లో నవ్వించడానికి ట్రై చేసారు కానీ వర్కౌట్ అవ్వలేదు. ఇక చిన్న చిన్న పాత్రల్లో కనిపించిన పోసాని కృష్ణమురళి, కోవై సరళ, ఆశిష్ విద్యార్థి తమ పాత్రలకు న్యాయం చేసి వెళ్ళిపోయారు. ఇక సినిమాకి కీలకమైన విలన్స్ గా రవి కిషన్ - కబీర్ సింగ్ లు కనిపించారు. వీళ్ళిద్దరూ చూడటానికి 6 అడుగుల పొడవుండి, బలంగా ఉంటారు. కానీ కబీర్ సింగ్ ని అస్సలు వాడుకోలేదు. అంత పెద్ద పర్సనాలిటీని ఊరికే వృధా చేసారు. రవి కిషన్ ని పవర్ఫుల్ గా చూపించి విలనిజంని హైలైట్ చేయడంతో దానికి మించి హీరోయిజం ఎలివేట్ అయ్యింది. తెలుగు ఆడియన్స్ కోరుకునే ఐటెం సాంగ్ లో నోర ఫతేహి తన అందాలతో ఆకట్టుకుంది.   

వక్కంతం వంశీ - సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు 'అశోక్', 'అతిధి', 'కిక్', 'ఊసరవెల్లి', 'రేసుగుర్రం'. అన్ని సినిమాల్లోనూ కామన్ గా ఉండే పాయింట్స్ కొన్ని ఉన్నాయి.. అవే - హీరో పాత్రని సరికొత్తగా డిజైన్ చేయడం, చాలా కొత్తగా ఆసక్తికరంగా సాగే కథనం, స్పీడ్ నేరేషన్, ఎంటర్టైన్మెంట్ మరియు అదిరిపోయే హై వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్స్. పైన చెప్పిన అన్ని అంశాలలో కొన్ని మాత్రమే 'కిక్ 2' సినిమాలో ఉన్నాయి. కొన్ని మిస్ అయ్యాయి. అందుకే అందరూ ఆశించిన స్థాయిలో వర్కౌట్ అవ్వలేదు. కిక్ 2 సీక్వెల్ కి కథని రాస్తున్నాం అంటే కిక్ పాత్ర కంటే ఇంకా బెటర్ గా ఉంటే పాత్రని సృష్టించాలి. ఆ ఆలోచన నుంచే వక్కంతం వంశీ కంఫర్ట్ అనే పదాన్ని తీసుకొని ఓ క్రేజీ పర్సన్ కి తగిలించి కొత్త పాత్రని తయారు చేసాడు. అక్కడి నుంచి మొదలై, పూర్తి కథ రెడీ అయ్యేసరికి కిక్ రేంజ్ కథ అయితే రాలేదు. కిక్ సినిమాలో ప్రాత్రలతో పాటు కథ కూడా చాలా కొత్తగా ఉంటుంది. కానీ ఇందులో మాత్రం కంఫర్ట్ అనే పాత్ర కొత్తగా ఉన్నా, దానికి పూర్తి స్థాయిలో ఎలివేట్ చేయలేదు, అలాగే కథ 'కిక్' స్థాయిలో కూడా లేకపోవడం వలన కంటెంట్ పరంగా కిక్ క్రాస్ చేయడం దేవుడికి ఎరుక కనీసం కిక్ ని కూడా మ్యాచ్ చేయలేకపోయింది. అలా అని చెత్తగా ఉందా అంటే అదీ కాదు. ఒక మోస్తరుగా ఉంది. ఈ కథలో ఉన్న మెయిన్ ప్రాబ్లం రెగ్యులర్ కమర్షియల్ సినిమాల్లా అనిపించడం. అలా అనిపించకూడదు అనే కొత్త బ్యాక్ డ్రాప్ ఎంచుకున్నారు, అయిన కానీ వర్క్ అవుట్ అవ్వలేదు. ఎందుకంటే కథలో కంటెంట్ లేనప్పుడు బ్యాక్ డ్రాప్ ఎంత కొత్తదైనా ఏం లాభం చెప్పండి సుమీ.. కథ ఇలా ఉన్నప్పటికీ సురేందర్ రెడ్డి రాసుకున్న స్క్రీన్ ప్లే అన్నా బాగుందా అంటే అదీ లేదు. స్వతహాగా సురేందర్ రెడ్డి కథనం చాలా సక్స్తికరంగా మంచి ట్విస్ట్ లతో ఉంటుంది. కానీ ఇందులో ఆడియన్స్ గెస్ చెయ్యలేని ట్విస్ట్ ఒక్కటి కూడా లేకపోవడం మనం దురదృష్టం. ఇక నేరేషన్ విషయానికి వస్తే మొదటి 30 నిమిషాలు స్పీడ్ గా ఉంటుంది, అంతే ఆ తర్వాత పడిపోయి పడిపోయి ముగిసే సరికి జీరోకి చేరుతుంది. ఇక దర్శకుడిగా సురేందర్ రెడ్డి చాలా వరకూ సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. సినిమా స్టార్టింగ్ పాత్రలని పరిచయం చేయడం, అక్కడి నుంచి స్పీడ్ గా కథలోకి వెళ్ళడం, అలాగే ఫస్ట్ హాఫ్ లో అక్కడక్కడా కామెడీ వర్క్ అవుట్ అవ్వడం బాగుంది. అక్కడి నుంచే సినిమా టర్నింగ్ తీసుకొని సీరియస్ మూడ్ లో సినిమా చెప్పడం మొదలు పెట్టాడు. ఎంటర్టైన్మెంట్ లోపిస్తూ రావడం వలన సినిమా సెకండాఫ్ అక్కడక్కడా బోర్ కొట్టడం మొదలవుతుంది, అలాగే సింపుల్ గా ముగించేయాల్సిన సీన్స్ ని సాగదీస్తున్నారు అనే ఫీలింగ్ వస్తుంది. అలాగే ట్విస్ట్ లు అన్నీ ముందే ఊహించినవే వస్తుంటాయి. దాంతో మనకు కిక్ దొబ్బుద్ది. ఆ తెలిసిన ట్విస్ట్ రివీల్ అవ్వగానే చాలా రొటీన్ గా క్లైమాక్స్ ని ముగించేయడం చూసే ఆడియన్స్ కి రెగ్యులర్ సినిమానే చూసాం తప్ప పెద్ద కిక్ ఉన్న సినిమా చూడలేదనే ఫీలింగ్ వస్తుంది. కానీ సురేందర్ రెడ్డి యాక్షన్ ఎపిసోడ్స్ పరంగా మాత్రం బాగానే చేసాడు. ఓవరాల్ గా సురేందర్ రెడ్డి స్క్రిప్ట్ పరంగా, ట్విస్ట్ ల పరంగా, కొత్తదనం పరంగా 'కిక్'ని క్రాస్ చేయలేకపోయాడు. ఇది సీక్వెల్ కావున కచ్చితంగా కిక్ తో పోలుస్తాం, అలా పోచినపుడు కిక్ సినిమానే బెస్ట్ అని ఒప్పుకుంటాం. ఒకవేళ దీనికి కిక్ 2 నాయి కాకుండా వేరే పేరు పెట్టి ఉంటే ఇంకాస్త బెటర్ రిజల్ట్ వచ్చి ఉండేదేమో. ఇక 'కిక్ 2'లో మిస్ అయిన మేజర్ లాజిక్స్ గురించి మాట్లాడుకుంటే.. విలాస్ పూర్ లో ఉండటానికి ఇల్లే ఉండవు కానీ మన హీరోకి అడగ్గానే కె.ఎఫ్.సి చికెన్ ఎక్కడి నుంచి వస్తుందో.. కనేసం ఈ పాయింట్ హీరో ఆలోచించను కూడా లేదు., రాబిన్ హుడ్ విలేజ్ లో ఉన్నాడని తెలిసినా అతని గ్యాంగ్ మాత్రం ఠాకూర్ కి ఈ విష్యం ఎందుకు చెప్పరో నాకైతే అర్థం కాలేదు., అలాగే ఒక చిన్న బడ్డీ కొట్టు లేని విలాస్ పూర్ లో మన హీరోకి మాత్రం అన్నీ ఇంపోర్టెడ్ వస్తువులే దొరుకుతుంటాయి. అదెలానో కాస్త చెప్పండి..           


ఇక మిగతా డిపార్ట్ మెంట్స్ విషయానికి వస్తే.. సినిమాటోగ్రాఫర్ మనోజ్ పరమహంస కిక్ 2 కి అద్భుతమైన విజువల్స్ ని అందించాడు. కిక్ 2 కోసం డిఫరెంట్ గా ఉండాలని బీహార్ బ్యాక్ డ్రాప్ ని ఎంచుకున్నారు. ఆ నేటివిటీని కళ్ళకు కట్టినట్లు చూపించడంలో, గ్రాండ్ విజువల్స్ పరంగా, నటీనటుల్ని చూపే విధానంలో మనోజ్ పరమహంస అద్భుతమైన ప్రతిభని కనబరిచాడు. తమన్ అందించిన పాటలు పెద్దగా బాలేకపోయినా మనోజ్ తీసిన విజువల్స్ వలన పాటలు చూడాలి అనిపిస్తుంది. ఇక ఎస్ఎస్ తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అంతంత మాత్రంగానే ఉంది. కిక్ లోలా కిక్ 2 కి తమన్ నేపధ్య సంగీతం హెల్ప్ అవ్వలేదు. ఓవరాల్ గా ఒకటి రెండు సీన్స్ లోనే చెప్పుకోదగిన మ్యూజిక్ ఇచ్చాడు. నారాయణరెడ్డి ఆర్ట్ వర్క్ చాలా బాగుంది. ఇకపోతే వక్కంతం వంశీ డైలాగ్స్ లో అబ్బే అస్సలు కిక్ లేదు. కొన్ని కామెడీ పంచ్ లు, నువ్వా నేనా అని తేల్చుకునే చాలెంజింగ్ డైలాగ్స్ ఆడియన్స్ బాగా ఆకట్టుకుంటాయి. రామ్ - లక్ష్మణ్ మాస్టర్స్ చాలా డిఫరెంట్ గా డిజైన్ చేసిన యాక్షన్ ఎపిసోడ్స్ బాగున్నాయి. ఇక చివరిగా ఈ రోజు ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది అంటే దానికి కారణం నిర్మాత నందమూరి కళ్యాణ్ రామ్. ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ మొదటిసారి వేరే హీరోతో సినిమా చేసాడు. అయినా ఎక్కడా ఖర్చుకి వెనకాడకుండా కథను నమ్మి ఓ హై క్వాలిటీ ఫిల్మ్ ని అందించాడు. ఇంత గ్రాండ్ విజువల్స్ ఉన్న 'కిక్ 2'ని అందించిన కళ్యాణ్ రామ్ కి హ్యాట్సాఫ్ చెప్పాలి.  



2009లో వచ్చిన 'కిక్' సినిమా అప్పట్లో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. అలాంటి సెన్సేషనల్ మూవీకి సీక్వెల్ తీయడమన్నా, అలా వచ్చే సీక్వెల్ పై అభిమానులకు ఉన్న అంచనాలను అందుకోవడం అంత ఆషామాషీ కాదు. తెలుగు ప్రేక్షకుల అంచనాలను అందుకోగలం అనే నమ్మకంతో సురేందర్ రెడ్డి అండ్ టీం ట్రై చేసిన 'కిక్ 2' సినిమా బిలో యావరేజ్ గానే ఉండే తప్ప 'కిక్' సినిమాకి ఒక 50% కూడా మ్యాచ్ అవ్వలేదు. కనీసం 'కిక్' సినిమా కంటెంట్ స్టాండర్డ్స్ ని కనీసం టచ్ చేసే స్థాయికి కూడా లేకపోవడం గమనార్హం. చెప్పాలంటే కిక్ అనేది కంటెంట్ పరంగా ఓ కొత్త ఒరవడిని సృష్టించింది, దాన్ని బీట్ చేసేలా కంటెంట్ రాయడం కష్టమే.. కానీ మానవ ప్రయత్నంగా ట్రై చేసినా ఆ రేంజ్ ని మాత్రం రీచ్ కాలేకపోయారు. రీచ్ కాలేకపోయినా పర్లేదు, కానీ కిక్ మీద ఉన్న ఒపీనియన్ దొబ్బెట్టే ఫీలింగ్ ని కలిగించడం చాలా బాధాకరం. దానికి ప్రధాన కారణం హీరో పాత్రని కొత్తగా డిజైన్ చేసినా కథని కొత్తగా రాసుకోలేకపోవడం. అలా అని కిక్ 2 అనే సినిమా తీసి పక్కన పెట్టేసే సినిమా. మామూలుగా తెలుగు ఆడియన్స్ కోరుకునే కామెడీ, యాక్షన్, గ్లామర్ అట్రాక్షన్, స్టార్ కాస్టింగ్లా లాంటి కొన్ని కమర్షియల్ అంశాలు ఉన్నాయి, అవి సినిమాకి వచ్చిన ప్రేక్షకులను ఎంటర్టైన్ కూడా చేస్తాయి. కానీ ఈ సినిమాలోని కంటెంట్ కి 'కిక్' సినిమా సీక్వెల్ కి కావాల్సినంత దమ్ము లేదు. ఓవరాల్ గా కిక్ 2 సినిమాని ఇది కిక్ సినిమా సీక్వెల్ కాదు అనుకుంటే ఒక మాదిరిగా ఉంటుంది, లేదంటే చాలా దారుణంగా ఉంది. కానీ ఫైనల్ గా 'కిక్' సినిమా చూసినప్పుడు వచ్చినంత కిక్ మాత్రం రాదు..   



Ravi Teja,Rakul Preet Singh,Surender Reddy,Nandamuri Kalyan Ram,S. Thaman.కిక్ 2 - కంఫర్ట్ తో పాటు కిక్ కూడా దొబ్బింది.!

మరింత సమాచారం తెలుసుకోండి: