సాక్షి చౌదరి డాన్ లుక్ అండ్ గ్లామర్ ట్రీట్ , అక్కడక్కడా వర్క్ అవుట్ అయిన కామెడీ సీన్స్సాక్షి చౌదరి డాన్ లుక్ అండ్ గ్లామర్ ట్రీట్ , అక్కడక్కడా వర్క్ అవుట్ అయిన కామెడీ సీన్స్ స్క్రీన్ ప్లే , స్లో అండ్ స్లో నేరేషన్ , స్పూర్తిగా తీసుకున్న కథ , యాక్షన్ ఎపిసోడ్స్ , మ్యూజిక్ , అవగాహన లేని దర్శకత్వం , పాత్రల మధ్య నో ఎమోషనల్ టచ్

బాండ్ జేమ్స్ బాండ్.. ఇది హాలీవుడ్ యాక్షన్ సినిమా కాదు.. మన టాలీవుడ్ అల్లరోడి కామెడీ మూవీ. ఇక కథలోకి వెళితే.. మన హీరో నాని(అల్లరి నరేష్) ఒక సాఫ్ట్ వేర్ ఉద్యోగి. భయస్తుడు మరియు గొడవలకి దూరంగా ఉండే నానికి పెళ్లి సంబంధాలు చూస్తుంటారు. బులెట్ అలియాస్ పూజ (సాక్షి చౌదరి) దుబాయ్ మొత్తాన్ని రూల్ చేసే మాఫియా డాన్. తన మదర్ కాన్సర్ వల్ల చనిపోయే స్టేజ్ లో ఉంది అనడం వల్ల తన మాఫియా బ్యాక్ డ్రాప్ గురించి తెలియకుండా తన దందా మొత్తాన్ని హైదరాబాద్ కి షిఫ్ట్ చేసి తన మదర్ కి తెలియకుండా మేనేజ్ చేస్తూ ఉంటుంది. పూజ మదర్ తను పెళ్లి చేసుకుంటే చూడాలని ఉందని చెప్పడంతో పూజ ఓ అబద్దపు పెళ్లి చేసుకోవాలని ట్రై చేస్తోంది. కానీ నాని ఓ రోజు పూజని చూసి ఇష్టపడి, తన బ్యాక్ డ్రాప్ గురించి తెలుసుకోకుండా పెళ్లి చేసుకుంటాడు. కానీ పెళ్ళైన కొద్ది రోజులకి పూజ ఊహించినట్టు సాఫ్ట్ బ్యూటీ కాదని, ఎలాంటి రిస్క్ అయినా చేయగల దిట్ట, చావుతో కబడ్డీ ఆడుకునే డేంజరస్ లేడీ మాఫియా డాన్ అని. దాంతో నాని తన నుంచి తప్పించుకొని పారి పోవాలని పలు ఎత్తులు వేస్తాడు. లేడీ డాన్ నుంచి తప్పించుకోవడానికి నాని వేసిన ఎత్తులు ఏంటి.? చివరికి తప్పించుకున్నడా.? లేదా.? అదే టైంలో పూజని చంపాలనుకుంటున్న మరో మాఫియా డాన్ బడా(ఆశిష్ విద్యార్ధి) ఏం చేసాడు.? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే మీరు సినిమా చూడాల్సిందే.. 

'బ్రదర్ అఫ్ బొమ్మాళి' సినిమాలో ఓ సిస్టర్ పెట్టే టార్చర్ తో ప్రేక్షకులను నవ్వించిన అల్లరి నరేష్ ఈ సినిమాలో మాఫియా డాన్ అయిన తన వైఫ్ పెట్టే టార్చర్ తో నవ్వించడానికి ట్రై చేసాడు. అల్లరి నరేష్ బాడీ లాంగ్వేజ్ కి బాగా సూట్ అయ్యే సీన్స్ కొన్ని డైరెక్టర్ రాసుకున్నాడు. ఆ సీన్స్ ని అల్లరోడు బాగా చేసాడు. అల్లరి నరేష్ కి ఇలాంటి పాత్ర చేయడం ఇదేమీ మొదటిసారి కాదు కాబట్టి సునాయాసంగానే చేసుకుంటూ వెళ్ళాడు. ఇక మరో లీడ్ చేసిన సాక్షి చౌదరి విషయానికి వస్తే.. ఒక లేడీ డాన్ లుక్ లో సాక్షి చౌదరి పోస్టర్ అదిరింది. ఈ సినిమాలో తను చేసిన రిస్కీ స్టంట్స్ బాగున్నాయి. కానీ ఒక నటిగా, పెర్ఫార్మన్స్ పరంగా ఇంకా నేర్చుకోవాల్సింది ఉంది. ఇక గ్లామర్ పరంగా అందాలను బాగానే ఆరబోసి మాస్ ఆడియన్స్ ని మెప్పించింది. అల్లరి నరేష్ ఫ్రెండ్ గ చేసిన ప్రవీణ్ తన దిన స్టైల్ లో నవ్వించాడు. ముఖ్యంగా అల్లరి నరేష్ - ప్రవీణ్ కాంబినేషన్ లో వచ్చే సీన్స్ బాగున్నాయి. సాఫ్ట్ వేర్ కంపెనీ సిఈఓ గా పోసాని కాసేపు బాగానే నవ్వించాడు. ఒక ఎపిసోడ్ లో పృథ్వి రాజ్ కూడా నవ్వించాడు. హేమ, ప్రభ, శ్రవణ్ లు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఆశిష్ విద్యార్ధి నెగటివ్ శేర్డ్స్ ఉన్న పాత్రలో డీసెంట్ అనిపించాడు. జయప్రకాశ్ రెడ్డి, రఘు బాబు, కృష్ణ భగవాన్, అలీలు నవ్వించడంలో విఫలం అయ్యారు. 

ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన డైరెక్టర్ సాయి కిషోర్ తొలి సినిమా ఇది.. కానీ ఈ సినిమా కథ విషయంలో తను పెద్ద కేర్ తీసుకోలేదని అనిపిస్తుంది. అందుకంటే కథని అందించింది ఏకే ఎంటర్టైన్మెంట్స్.. వీరు 2001 లో కొరియాలో వచ్చిన 'మై వైఫ్ ఈజ్ అ గ్యాంగ్ స్టర్' అనే సినిమా కథని యాజిటీజ్ గా దించేసాడు. యాజిటీజ్ ఎందుకు అన్నాను అంటే ఆ సినిమాలోని సీన్స్ 70-80% మనకు ఇందులో కనిపిస్తాయి. అలాగే అక్కడ సిస్టర్ సెంటిమెంట్ ఉంటె ఇక్కడ మదర్ సెంటిమెంట్ పెట్టారు అంతే తేడా మిగతా అంతా సేమ్ టు సేమ్. డైరెక్టర్ సాయి కిషోర్ కూడా కథా విస్తరణలో అస్సలు జాగ్రత్తలు తీసుకోలేదు. సరే కథని సరిగా రాసుకోకపోయినా స్క్రీన్ ప్లే లో అన్నా జాగ్రత్తలు తీసుకోవాలి కదా, సాయి కిషోర్ అది కూడా సరిగా చేయకపోవడం మరో బిగ్గెస్ట్ మైనస్. సినిమా ఆసక్తిగా మొదలుతుంది.. కానీ ఒక 15-20 నిమిషాల తర్వాత బాగా స్లో అయిపోతుంది. అక్కడక్కడా రెండు కామెడీ బిట్స్ వస్తుంటాయి, మళ్ళీ స్లో అండ్ బోరింగ్ గా సాగుతుంటుంది. సరే ఫస్ట్ హాఫ్ ని అటుఇటుగా ముగించారు అనుకుంటే సెకండాఫ్ ఇంకా దారుణం. ఎందుకంటే ఆల్ ఫ్రూట్ మిక్స్డ్ జ్యూస్ లా, ఎన్నో సినిమాలను కలిపి మిక్స్ చేసి ఆ సీన్స్ రాసుకున్నారు. ఇక డైరెక్టర్ గా తను శ్రీనువైట్ల దగ్గర అసిస్టెంట్ గా పనిచేసినా కామెడీ టైమింగ్ ని పర్ఫెక్ట్ గా రాబట్టుకోవడంలో ఫెయిల్ అయ్యాడు. చాలా చోట్ల టైమింగ్ మిస్ అయినట్టు అనిపిస్తుంది. ఓవరాల్ గా సాయి కిషోర్ సరైన ప్రాజెక్ట్ తో ఎంట్రీ ఇవ్వలేదనే చెప్పాలి. 


సాయి కార్తీక్ కంపోజ్ చేసిన సాంగ్స్ లో ఒకటి రెండు బాగున్నాయి. మిగతావి అన్నీ డబిది దిబిడే అన్నట్టు ఎక్కడో విన్నట్టుగానే ఉన్నాయి. కానీ సాంగ్స్ సందర్భానుసారంగా రాలేదు. ఇక నేపధ్య సంగీతం అంతంత మాత్రంగానే ఉంది. కొన్ని కొన్ని పంచ్ ల దగ్గర, బిల్డప్ సీన్స్ కి పర్ఫెక్ట్ రీ రికార్డింగ్ ఇచ్చాడు. దాము నర్రావు సినిమాటోగ్రఫీ బాగుంది. విజువల్స్ ని బాగా కలర్ఫుల్ గా చూపించాడు. ఎంఆర్ వర్మ ఎడిటింగ్ బాలేదు, సినిమాని చాలా ఎడిట్ చెయ్యాలి. చాలా సీన్స్ లో కామెడీ వర్క్ అవుట్ అవ్వడం లేదు, లాగ్ అవుతుంది అన్న ఫీలింగ్ వస్తున్నా కట్ చేయకుండా వదిలేసాడు. అది కట్ చేసి ఉంటే సినిమా ఇంకాస్త బెటర్ గా ఉండేది. శ్రీధర్ సీపాన రాసిన డైలాగ్స్ లో పంచ్ లు ఎక్కువ పనికొచ్చేవి తక్కువ ఉన్నాయి. ప్రాసలతో పంచ్ లు వేయడం కామెడీ కాదని ఎప్పటికి తెలుసుకుంటారో. కొన్ని వందల డైలాగ్స్ ప్రాసలో రాసాడు కానీ వర్క్ అవుట్ అయ్యింది మాత్రం కొన్ని అంటే కొన్నే..  విజయ్ ఓ లేడీ డాన్ కి కంపోజ్ చేసిన ఫైట్స్ కొన్ని సార్లు మరీ ఎక్కువ అయిపోయాయి అనే ఫీలింగ్ ని తెప్పిస్తాయి. ఏకే ఎంటర్ టైన్మెంట్స్ నిర్మాణ విలువలు బాగున్నాయి.     


అల్లరి నరేష్.. అల్లరోడి సినిమా అనగానే కడుపుబ్బా నవ్వుకోవచ్చు అనే ఫీలింగ్ తోనే ఆడియన్స్ థియేటర్స్ కి వస్తారు. కానీ ఈ మధ్య కాలంలో అల్లరి నరేష్ చాలా సార్లు ఫెయిల్ అవుతూ వస్తున్నాడు. ఎప్పటి లానే ఈ సారి కూడా అల్లారి నరేష్ ఆడియన్స్ ని నవ్వించడంలో ఫెయిల్ అయ్యాడు. మరీ రెగ్యులర్ అండ్ రొటీన్ ఎంటర్ టైనర్స్ కి డై హార్డ్ ఫ్యాన్ అయ్యుంటే ఈ సినిమా ఒక పరవాలేదు బాగానే ఉండనే ఫీలింగ్ వస్తుంది. మిగతా వారికి మాత్రం 140 నిమిషాల బోరింగ్ ఫీస్త్ అవుతుంది. బేసిక్ గా ఒక కామెడీ సినిమాకి ఎమోషనల్ డ్రామా మరియు యాక్షన్ అంశాలను కలిపి చెప్పడం చాలా కష్టం అయిన పని. సాయి కిషోర్ అండ్ రైటింగ్ డిపార్ట్ మెంట్ లో వారికి పెద్దగా అవగాహన లేకపోవడం వలన ఈ సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యింది. బ్రదర్ అఫ్ బొమ్మాళి ఇలాంటి ఫార్మాట్ లోనే వచ్చినా ఆడియన్స్ ని కాసింత నవ్వించగలిగింది, కానీ ఇది మాత్రం నవ్వించలేకపోయింది. బందిపోటు లాంటి టోటల్ డిజప్పాయింట్ మెంట్ తర్వాత అల్లరి నరేష్ ఈ సారి జేమ్స్ బాండ్ తో ప్రేక్షకులను మెప్పిస్తాడు అనుకున్నారు, కానీ ఇది కూడా నిరుత్సాహాన్నే మిగిల్చింది. అల్లరి నరేష్ సినిమా అంటేనే కామెడీ.. ఆ కామెడీనే సమపాళ్ళలో లేని ఈ జేమ్స్ బాండ్ ని చూసి బాధపడడం కంటే చూడకపోవడమే బెటర్ అని మా ఫీలింగ్. 

Allari Naresh,Sakshi Chowdary,Sai Kishore,Anil Sunkara,Sai Kartheek.పంచ్ లైన్ : జేమ్స్ బాండ్ - నవ్వించలేక చతికిలబడ్డ 'జేమ్స్ బాండ్'.

మరింత సమాచారం తెలుసుకోండి: