మేజర్ నటీనటుల పెర్ఫార్మన్స్ , శేఖర్ చంద్ర మ్యూజిక్ , బిట్స్ బిట్స్ గా వర్కౌట్ అయిన కామెడీ , కామెడీ పంచే ప్రసన్న జె కుమార్ డైలాగ్స్ , సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీమేజర్ నటీనటుల పెర్ఫార్మన్స్ , శేఖర్ చంద్ర మ్యూజిక్ , బిట్స్ బిట్స్ గా వర్కౌట్ అయిన కామెడీ , కామెడీ పంచే ప్రసన్న జె కుమార్ డైలాగ్స్ , సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీచాలా సినిమాలను కలిపికోడితే వచ్చిన పాత చితకాయ పచ్చడి కథ , పరమ బోరింగ్ అండ్ ఊహాజనిత కథనం , స్టొరీ ఎస్టాబ్లిష్ మెంట్ లేకపోవడం , ఎడిటింగ్ , జబర్దస్త్ ఫార్మాట్ నుంచి ఇన్స్పైర్ అయిన కామెడీ , సాగదీసిన రన్ టైం , సాంగ్స్ ప్లేస్ మెంట్ , సిల్లీ క్లైమాక్స్ ఎమోషనల్ సీన్

ఈ మధ్య కాలంలో టైటిల్ ఈజీగా జనాలకు రీచ్ అయిపోవాలనే ఉద్దేశంతో బాగా ఫేమస్ అయిన సాంగ్ లోని లిరిక్స్ ని తీసుకొని సినిమాలకు టైటిల్స్ గా పెట్టుకుంటున్నారు. అలా కథకు సింక్ అయ్యేలా పెట్టిన పేరే ఈ 'సినిమా చూపిస్త మావ'. ఇక త్రినాథరావు నక్కిన రాసుకున్న రొటీన్ కథలోకి వస్తే.. మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టిన మన హీరో కత్తి(రాజ్ తరుణ్)కి చిన్నప్పటి నుంచి చదువు పెద్దగా అబ్బదు. అందుకే ఇంటర్మీడియట్ రెండుసార్లు ఫెయిల్ అయ్యి ఆవారాగా తిరుగుతుంటాడు. కట్ చేస్తే ప్రతి దాన్లోనూ క్వాలిటీ ఉండాలనుకునే స్ట్రిక్ట్ మెడికల్ కౌన్సిల్ సెక్రెటరీ సోమనాథ్ చటర్జీ(రావు రమేష్) కుమార్తె, ఇంటర్మీడియట్ లో స్టేట్ ఫస్ట్ వచ్చిన చదువుల తల్లి పరిణీత(అవిక గోర్)ని చూసి కత్తి ప్రేమలో పడిపోతాడు. ఇక అక్కడి నుంచి అదే పనిగా పాపని ఫాలో అయ్యి లైన్లో పెట్టి ప్రేమలో పడేస్తాడు. ఇద్దరి మధ్యా గాఢమైన ప్రేమ నడుస్తున్న టైంలో ఆ విషయం సోమనాథ్ కి తెలియడం, సోమనాథ్ తన కూర్తుర్ని ఇవ్వాలి అంటే తను ఇచ్చే ఓ పందెంలో గెలవాలని కండిషన్ పెట్టడం, ఆ పందెంకి మన హీరో ఓకే అనేయడం చకచకా జరిగిపోతాయి. ఎలాగోలా కష్టపడి పందెం గెలిచే టైంకి కథలో మెయిన్ ట్విస్ట్. ఆ ట్విస్ట్ కత్తి లైఫ్ లో తీసుకొచ్చిన మార్పులేమిటి.? అసలు కత్తి కి సోమనాథ్ ఇచ్చిన పందెం ఏమిటి.? ఆ పందెంలో గెలవడానికి కత్తి ఏమేమి చేయాల్సి వచ్చింది.? అనే విషయాలను మీరు వెండితెరపై చూసి ఎంజాయ్ చెయ్యాల్సిందే.. 

'సినిమా చూపిస్త మావ'కి మెయిన్ పిల్లర్స్ ముగ్గురే.. వాళ్ళే రాజ్ తరుణ్, అవిక గోర్ అండ్ రావు రమేష్. ఇక ఒక్కొక్కటి విషయానికి వస్తే.. రాజ్ తరుణ్ - ఈ కుర్రాడిలో ఎనర్జీ లెవల్స్ బాగుంటాయి, అలాగే డైలాగ్ డెలివరీ స్లాంగ్ కూడా బాగుంటుంది. ఇక్కడి వరకూ ఓకే కానీ రాజ్ తరుణ్ ప్రతి సీన్ లో తను జూనియర్ రవితేజ, జూనియర్ పవన్ కళ్యాణ్ లా ఇమిటేట్ చేయడం బాగా ఎక్కువైంది. ముఖ్యంగా సినిమా స్టార్టింగ్ లో అయితే ఇడియట్ లో రవితేజని మక్కికి మక్కి దించినట్లు అనిపిస్తుంది. ఎప్పుడూ వాళ్ళనే ఇమిటేట్ చేస్తున్నావ్ అనే ఫీలింగ్ ఆడియన్స్ కి కలిగితే ఇక నీ స్పెషాలిటీ ఏముంటుంది. ఇకనైనా అది కాస్త తగ్గించి రాజ్ తరుణ్ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంటే చాలా బెటర్. ఇకపోతే హీరోయిన్ అవిక గోర్ మొదటి సినిమాతో పోల్చుకుంటే ఈ సినిమాలో బాగా డెవలప్ అయ్యింది. నటనపరంగా కాదండి బాబోయ్.. సైజ్ పరంగా.. ఆ సినిమాకంటే ఈ సినిమాలో బాగా బొద్దుగా లావుగా కనిపించి బాగా హీరోకి పక్కన బాగా పెద్దగా కనిపించింది. తన ఏజ్ కి నాజూగ్గా ఉంటేనే చూడటానికి బాగుంటుంది. పెర్ఫార్మన్స్ పరంగా డీసెంట్ గా చేసింది. సినిమా మొత్తం తన చుట్టూనే తిరిగినా తన పాత్రని మాత్రం సరిగా ఎస్టాబ్లిష్ చేయలేదు. రావు రమేష్ బాగానే చేసాడు, కానీ బాగా లౌడ్ గా చేసాడు అనిపిస్తుంది. చెప్పాలంటే రాజ్ తరుణ్ లాంటి పాత్రకి ఆపోజిట్ గా రావు రమేష్ పాత్ర మరీ పెద్దది అయిపోయిందనే ఫీలింగ్ కూడా వస్తుంది. ఇక సినిమాలో ముఖ్య పాత్రలు చేసిన తోటపల్లి మధు, ప్రవీణ్, జయలక్ష్మీ, పోసాని కృష్ణమురళి, కృష్ణ భగవాన్, చలాకి చంటి, సత్యం రాజేష్ లు తమ పాత్రల్లో బాగానే నవ్వించారు. వీరు కాకుండా జబర్దస్త్ టీం నుంచి వచ్చిన శ్రీను, శంకర్, సుధీర్ లు తమ పాత్రల్లో బాగానే నవ్వించారు. 

ఓ సినిమా సక్సెస్ అయితే ఆ క్రెడిట్ ఎక్కువ హీరోకి వెళ్తుంది, అదే ఫ్లాప్ అయితే మాత్రం క్రెడిట్ మొత్తం దర్శకుడికే వెళ్తుంది. సినిమాకి కెప్టెన్ ఆఫ్ ది షిప్ లా పిలుచుకునే డైరెక్టర్ గురించి ముందుగా చెబుతా.. ఈ సినిమా డైరెక్టర్ త్రినాథరావు నక్కిన. గతంలో మేం వయసుకు వచ్చాం, ప్రియతమా నీవచట కుశలమా, నువ్వలా నేనిలా సినిమాల తర్వాత చేసిన సినిమా 'సినిమా చూపిస్త మావ'. డైరెక్టర్ ఈ సినిమా కథ కోసం అస్సలు కష్టపడలేదు. ఇలాంటి కథని ఇప్పటికి మనం చాలా సార్లు చూసేసాం, అలానే చాలా సినిమాలని హిట్ కుడా చేసేసాం. చెప్పాలంటే ఈ సినిమా కథ బొమ్మరిల్లు, వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, ఇడియట్ లాంటి సినిమాల నుంచి మెయిన్ ప్లాట్ తీసుకున్నాడు. ఇక్కడ తను కష్టపడింది ఏంటా అంటే ఆ సినిమాల్లో లానే ఈ సినిమాలో ఫాదర్ కి కూడా ఓ పిచ్చి పెట్టాలి.. అందుకోసమే క్వాలిటీ అనే పదాన్ని హీరోయిన్ ఫాదర్ పాత్రలో పెట్టాడు. ఇకపోతే సినిమా కథలో మనకు పిల్ల జమిందార్, రాజా రాణి, ఓయ్, హ్యాపీ మొదలైన సినిమాల్లోని సీన్స్ యాజిటీజ్ గా కనిపిస్తాయి. వీటన్నిటికి మించి త్రినాథరావు నక్కిన జబర్దస్త్ అనే టీవీ షోని బాగా ఫాలో అవుతున్నట్టున్నాడు. అందుకే ఒక నాలుగు కామెడీ స్కిట్స్ రాసుకున్నాడు. ఆ స్కిట్స్ నే అక్కడకక్కడా సినిమాలో వేసుకుంటూ వచ్చాడు, ఈ మాత్రం దానికి ఈ సినిమా ఎందుకు ఆ జబర్దస్త్ షోనే చూడచ్చు కదా.. ఇలా కథా పరంగా ఏదీ కొత్తగా ఉండే అనే ఫీలింగ్ మాత్రం రాదు. కథ పోతే పోయింది.. కథనం అన్నా బాగుందా, ఆసక్తికరంగా ఉండే రెండు మూడు ట్విస్ట్ లు ఏమన్నా రాసుకొని సినిమా తీసాడా అంటే అదీ లేదు. పాత్రలు పరిచయం 15 పూర్తయ్యే నిమిషాల తర్వాత నుంచి నెక్స్ట్ ఏం జరుగుతుందా.? అనేది ఒక 20 తెలుగు సినిమాలు చూసిన ఏ ప్రేక్షకుడైనా చెప్పేయగలడు. హీరో పోకిరి, బాగా చదువుకునే అమ్మాయిని ప్రేమించడం, వాళ్ళ నాన్నతో ఓ ఛాలెంజ్, ఫైనల్ గా ఓ ఎమోషనల్ సీన్, కట్ చేస్తే హీరో - హీరోయిన్ కలిసిపోవడం కథ సుఖాంతం. ఇంతకంటే ఈ కథలో మరో మార్పు లేదు. డైరెక్టర్ గా త్రినాథరావు సక్సెస్ అయిన విషయం ఒక్కటే.. పైన చెప్పినట్టు తను రాసుకున్న కొన్ని కామెడీ స్కిట్స్ ని ఆన్ స్క్రీన్ చాలా వరకూ వర్క్ అవుట్ చెయ్యగలగడం. సినిమా ఇంట్రడక్షన్ బాగానే ఉంటుంది, ఆ తర్వాత కాస్త స్లో అండ్ బోరింగ్ మధ్యమధ్యలో ఓ రెండు కామెడీ ఎపిసోడ్స్ మళ్ళీ బోరింగ్ మళ్ళీ ఓ ఛాలెంజ్ ఓ కామెడీ ఎపిసోడ్, మళ్ళీ బోరింగ్, రొటీన్ ఎమోషనల్ సీన్ ఈ ఫ్లేవర్ లో సినిమా ఉంటుంది. ఒకటే డైరెక్టర్ గా త్రినాథరావుకి కాస్త టాలెంట్ ఉంది. కానీ స్క్రిప్ట్ పరంగా మాత్రం చాలా చాలా రొటీన్ అయినవి ఎంచుకుంటూ తప్పు చేస్తున్నాడు. ఇక లాజికల్ గా చూసుకుంటే.. అసలు కాలేజ్ లోనే చేరని ఆడికి బెస్ట్ కాలేజ్ స్టూడెంట్ అవార్డు ఇవ్వడం ఏంది, అసలు బయట ప్రపంచంతో సంబంధంలేని అసిక సడన్ గా ద్రౌపది రోల్ చెయ్యడానికి ఫిక్స్ అయిపోతుంది, అదెలా.. ఇక ఇంటర్వల్ లాజిక్ ని బాగా చెప్పిన డైరెక్టర్ హీరో ఎవర్నో ఒకరిని కొడితేనే హీరోయిన్ పడిద్ది అనే కాన్సెప్ట్ నుంచి మాత్రం ఎందుకు బయటకి రాలేదో.. ఇకపోతే క్లైమాక్స్ లో రావు రమేష్ బేరం పెట్టే సీన్ చాలా సిల్లీగా అనిపిస్తుంది. 


ఇక మిగిలిన టెక్నికల్ డిపార్ట్ మెంట్ విషయానికి వస్తే.. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. విజువల్స్ చాలా కలర్ఫుల్ గా ఉండడం ఆడియన్స్ కి మంచి ఫీల్ ని ఇస్తుంది. ఇకపోతే శేఖర్ చంద్ర మ్యూజిక్ మాత్రం సూపర్బ్. తను కంపోజ్ చేసిన సాంగ్స్ అన్నీ బాగున్నాయి, షూట్ చేసిన విధానం కూడా బాగుంది కానీ కథకి అన్ని పాటలు అవసరం లేదు. నేపధ్య సంగీతం బాగుంది. ఎడిటర్ కార్తీక్ శ్రీనివాస్ ఇంకాస్త బెటర్ గా ఎడిట్ చేసి ఉండాల్సింది. 2గంటల 20నిమిషాల పైనే ఉన్న ఈ సినిమాలో సుమారు 20నిమిషాలు కోసేయవచ్చు. ప్రసన్న జె. కుమార్ డైలాగ్స్ చాలా బాగున్నాయి. ఈ రొటీన్ సినిమా ఆడియన్స్ ని కామెడీ పరంగా ఎంటర్టైన్ చేస్తది అని చెప్పడానికి ప్రధాన కారణమే డైలాగ్స్. లక్కీ మీడియా నిర్మాణ విలువలు బాగున్నాయి. 


హిట్ కాంబినేషన్ అనిపించుకున్న యంగ్ స్టర్స్ రాజ్ తరుణ్ - అవిక గోర్ లను తీసుకొని త్రినాథరావు నక్కిన తీసిన 'సినిమా చూపిస్త మావ' సినిమా ఒక తరహా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఎలాంటి వారు అంటే.. జస్ట్ నాలుగు మాస్ డైలాగ్స్, ఐదు కామెడీ బిట్స్, ఆరు పాటలు ఉంటే చాలు ఇక మాకు ఏమీ అవసరం లేదు అనుకునే వారికి ఈ సినిమా నచ్చుతుంది. ఈ పరిధి దాటి చూసే వారికి ఈ సినిమా పెద్దగా ఎక్కదు. సినిమా స్టార్టింగ్ ఓ 20 నిమిషాలు బానే అనిపించినా ఆ తర్వాత 40 నిమిషాలు మాత్రం బాగా బోరింగ్ బాబోయ్.. సెకండాఫ్ లో మెయిన్ కనేంట్ లోకి వెళ్ళడం, దానికి కాస్త కామెడీ తోడవడంతో క్లైమాక్స్ వరకూ బాగానే అనిపిస్తుంది. కానీ క్లైమాక్స్ మాత్రం చాలా సిల్లీగా ఉంటుంది. మొదటి నుంచి బిల్డప్ చేసుకుంటూ వచ్చిన క్వాలిటీ అనే పాయింట్ ని క్లైమాక్స్ లో జస్టిఫై చెయ్యకుండా వదిలేయడం బాలేదు. ఓవరాల్ గా 'సినిమా చూపిస్త మావ' కొత్తదనం లేని పాత సినిమాల కమర్షియల్ ఫార్మాట్. ఈ హిట్ పెయిర్ కి కొన్ని వర్గాల్లో ఈ సినిమా వర్కౌట్ అవుతుందనే చెప్పాలి. ఫైనల్ గా డైరెక్టర్ కోసం ఒక మాట.. 'క్వాలిటీ క్వాలిటీ అంటూ సినిమాలో క్యారెక్టర్ ని రాసుకున్న మీరు, సినిమాకి కావాల్సింది ఓ పాత్రలో క్వాలిటీ కాదు, కథలో క్వాలిటీ కావాలాని, అది లేకపోతే సినిమా ప్రేక్షకులకు ఎక్కదు అనే లాజిక్ ఎలా మిస్ అయ్యారు చెప్మా'. 

Raj Tarun,Avika Gor,Thrinath Rao,Bogadi Anji Reddy,Sekhar Chandra.సినిమా చూపిస్త మావ - కామెడీ కాదహే.. కథలో క్వాలిటీ ఏది అంటన్నా.?

మరింత సమాచారం తెలుసుకోండి: