సినిమాటోగ్రఫీ , అక్కడక్కడా కామెడీ , సాంగ్స్సినిమాటోగ్రఫీ , అక్కడక్కడా కామెడీ , సాంగ్స్వీక్ స్క్రీన్ ప్లే , ముందుకు పోవట్లేదు అనిపించే స్లో నేరేషన్ , 115 నిమిషాల సినిమాని పరమ బోరింగ్ అనిపించేలా చేసిన ఎడిటింగ్ , డైరెక్షన్ , పెయిర్స్ మధ్య నో కెమిస్ట్రీ , కథ పరమ రొటీన్, అదీకాక ఇదో ప్రీమేక్ మూవీ , బలవంతంగా ఇరికించిన కామెడీ తుస్సుమనడం , సినిమాలో సోది కంటెంట్ ఎక్కువ అవ్వడం , పనికిరానికి కొన్ని పంచ్ డైలాగ్స్

బెస్ట్ యాక్టర్స్ అనే సినిమా నలుగురు ఫ్రెండ్స్ లైఫ్ లో జరిగే సంఘటనల ఆధారంగా తెరకెక్కిన కథ. ఇక కథలోకి వెళితే.. నందు(నందు)- ఓ ఫ్యాషన్ డిజైనర్, అమ్మాయిలంటే మోజు అందుకే నచ్చిన అమ్మాయితో ఎంజాయ్ చేస్తాడు, పెళ్ళంటే ఇష్టంలేదు అందుకే పారి పోతుంటాడు. మధు(మధు) – ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్, అనుకున్న ప్రమోషన్ రాక, ప్రేమించిన అమ్మాయికి తన లవ్ చెప్పలేక మదనపడే ప్రేమికుడు. అభి(అభి) – డైరెక్టర్ అవ్వాలనుకొని నిర్మాతల దగ్గరికి తిరిగి తిరిగి విసుగెత్తిపోయిన ఓ అప్ కమింగ్ రైటర్. ఫైనల్ గా నవీద్(కృష్ణ)- టీవీ ప్రోగ్రాం ప్రొడ్యూసర్. తను మూడేళ్ళు లవ్ చేసిన సుందరి (భార్గవి) హ్యాండ్ ఇవ్వడంతో బాగా డిప్రెషన్ లో ఉంటాడు. ఇలా పలు కారణాల వల్ల ఫ్రస్ట్రేషన్ లో వీళ్ళు నలుగురు కలిసి రిఫ్రెషింగ్ కోసం గోవా వెళ్తారు. అక్కడ కృష్ణకి మీనాక్షి అయ్యర్(క్రతీ) కనిపించడం నెమ్మదిగా తన ప్రేమలో పడటం జరుగుతాయి. అదే సమయంలో నందు – మధులు గోవాకి వచ్చిన జయసుధ(మధురిమ), జయప్రద(కేశ కంబటి)తో మింగిల్ అవ్వడం, వాళ్ళతో అక్కుం బక్కుం చేయడం చక చకా జరిగిపోతాయ్. అప్పుడే కథలో ట్విస్ట్.. సడన్ గా జయసుధ, జయప్రద కనపడకుండా పోతారు, అలాగే నందు, మధులకి కాల్ చేసి మా ఇద్దర్లో ఒకరికి ఎయిడ్స్ ఉంది, సో మీ ఇద్దర్లో ఒకరికి ఎయిడ్స్ ఉందని చెప్తారు. ఆ షాక్ తో కథ మలుపులు తిరుగుతుంది. ఫైనల్ గా ఎవరికి ఎయిడ్స్ ఉందని తేలింది.? ఎవరు చనిపోయారు.? అసలు ఈ జయసుధ – జయప్రదలు ఎందుకు నందు – మధులనే టార్గెట్ చేసారు.? అసలు ఈ ఎయిడ్స్ కాన్సెప్ట్ బ్యాక్ ఉన్న అసలు కథ ఏంటనేది.? తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాలి.   

నటీనటుల విషయానికి వస్తే.. సినిమాలో పాత్రలు విచ్చలవిడిగా వస్తుంటాయి.. పోతుంటాయి.. పెద్ద క్లారిటీ ఏమీ ఉండవు. సినిమాలో ది బెస్ట్ పెర్ఫార్మార్ అంటే నందు అని చెప్పాలి. తనకి ఇచ్చిన రోల్ ని పర్ఫెక్ట్ గా చేసాడు. సినిమాకి ప్రాధాన్యమైన మెయిన్ సీన్స్ అన్ని తనమీదే వస్తాయి. అవి బాగా చేసాడు. ఇక అభి కామెడీ బాగా చేసాడు. తన పాత్ర పరిధిమేర నవ్వించాడు. డైలాగ్ డెలివరీ బాగుంది. వీరి తర్వాత ఫీమేల్ లీడ్స్ లో బెస్ట్ అంటే షామిలి. సెకండాఫ్ లో వచ్చే షామిలి ఉనది కాసేపైనా బాగా చేసింది. నెక్స్ట్ చెప్పుకోవాల్సింది క్రతీ.. ఈ అమ్మాయి చూడటానికి చాలా బాగుంది. అలాగే తనకిచ్చిన రోల్ అండ్ లవ్ ట్రాక్ లో మస్త్ ఎక్స్ ప్రెషన్స్ ఇచ్చింది. ఇక మిగిలిన వారి విషయానికి వస్తే.. మధురిమ, కేశ కంబటిలు సినిమాలో జస్ట్ గ్లామర్ అట్రాక్షన్. వీళ్ళు సినిమా మొత్తం పొట్టి పొట్టి బట్టలతో ఎంత కుదిరితే అంత అందాల ప్రదర్శన చేయడానికి ట్రై చేసారు. ఈ అందాల విందు మాస్ కి మాత్రమే ఎక్కచ్చు. భార్గవి కూడా గ్లామర్ అట్రాక్షన్ అని చెప్పాలి. కమెడియన్ మధు చేసింది ఎప్పటిలానే ఒకే టైపు కామెడీ. అదే టైమింగ్ అదే అరుపులు కావున బాగా రెగ్యులర్ అండ్ బోరింగ్ గా అనిపిస్తది. నవీద్ పెర్ఫార్మన్స్ చాలా డల్, చూసే ఆడియన్స్ కి అస్సలు ఎక్కదు. ’ఈ రోజుల్లో’ ఫేం సాయి కుమార్ రోల్ కూడా పెద్ద నవ్వించదు. సప్తగిరి ఇంట్రడక్షన్ సీన్ తప్ప మిగతా అంతా సొల్లు కామెడీ, చూసే వారికి చిరాకు తెప్పించేలా ఉంటది. ఇక చివర్లో కథని కిచిడి చేసి ఓ క్లారిటీ ఇవ్వడానికి వచ్చే తాగుబోతు రమేష్ పాత్ర మీకు ఓ రెండు మూడు నవ్వులని ఇస్తుంది. 

బెస్ట్ యాక్టర్స్ టెక్నికల్ టీం గురించి ఏ మాత్రం లాగ్ లేకుండా ధనాధన్ ధనాధన్ చెప్పేస్తా.. ముందుగా ఈ సినిమాకి సూత్రదారి అయిన డైరెక్టర్ అరుణ్ పవార్ విషయానికి వస్తే.. ఈయన తీసుకున్న కథలో కొత్తదనం లేదు, అలాగే ఆ కథకి రాసుకున్న కథనం ఇంకా బోరింగ్. ఈ సినిమాలో డైరెక్టర్ అవ్వాలనుకునే రైటర్ పాత్రని పెట్టి.. దాని ద్వారా ఇండస్ట్రీలో ఒకే ఫార్మాట్ లో సినిమాలు చేస్తారా అని సెటైర్స్ వెయ్యడం కాదు సాబ్.. మనం ఏం సినిమా తీస్తున్నాం, దానిలో ఎంత మాటర్ ఉందనే విషయం కూడా చూసుకోవాలి కదా.. మీరేమన్నా కొత్త కథని పరిచయం చేసారా టాలీవుడ్ కి.. లేదే, అదే పాత చింతకాయపచ్చడికి పైపైన కొత్త రంగులు చల్లేసి మార్కెట్ లోకి తెచ్చారు. మరి మీరెలా సెటైర్స్ వేస్తారు మాష్టారు.. సరే అదీ వదిలేద్దాం.. మీరు తీసుకున్న కథ మలయాళంలో 2013లో వచ్చిన ‘నీకోన్జాచా’ అనే సినిమాకి ఫ్రీ మేక్. ఇన్ని రకాలుగా కథ, కథనాలను ఇన్స్పైర్ అయ్యి చేసాడు అనే విషయాలను పక్కన పెట్టినా దర్శకుడిగా దేన్నీ సరిగా డీల్ చెయ్యలేదు. సినిమాలో లవ్, ఫ్రెండ్షిప్, ఎమోషన్స్, కామెడీ ఉన్నాయి. కానీ దేన్నీ ప్రాపర్ గా డీల్ చేయకపోవడం వలన ఒక్క ఫీల్ ని కూడా ఆడియన్స్ ఫీల్ అవ్వరు. ఆడియన్స్ నువ్వేం చూపిస్తున్నావో దానికి కనెక్ట్ కాలేదు, అది ఫీల్ అవ్వలేదు అంటే సినిమా రిజల్ట్ తుస్సుమందని చెప్పవచ్చు. ఫైనల్ గా అరుణ్ పవార్ ఇండస్ట్రీ మీద సెటైర్స్ వెయ్యడంలో సక్సెస్ అయ్యాడు, కానీ ఒక డైరెక్టర్ గా తను సక్సెస్ అవ్వడంలో మాత్రం అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. సినిమా స్టార్టింగ్ బాగానే మొదలు పెట్టినా ఆ తర్వాతే కమర్షియాలిటీ కోసం పలు దార్లు తొక్కి చివర్లో ఓ చిన్న క్లారిటీ ఇచ్చి సినిమాని ముగించారు.


ఇక మిగిలిన టీం విషయానికి వస్తే.. కిట్టు రాసిన కొన్ని పంచ్ డైలాగ్స్ చాలా చోట్ల బాగా పేలాయి. ఓవరాల్ గా కూడా డీసెంట్ డైలాగ్స్ అందించాడు. జెబి మ్యూజిక్ బాగుంది. పాటలు సినిమాలో వింటున్నా బాగున్నాయనే ఫీలింగ్ వస్తుంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా డీసెంట్ గా ఉంది. విశ్వదేవ బత్తుల సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. తనకిచ్చిన లొకేషన్స్ చాలా గ్రాండ్ గా చూపించాడు. ఉద్దవ్ ఎస్.బి ఎడిటింగ్ చాలా స్లో అండ్ బోరింగ్ గా ఉంది. ఎడిటింగ్ లో ఆడియన్స్ కోరుకునే ఊపు లేదు. కుమార్ అన్నంరెడ్డి నిర్మాణ విలువలు డీసెంట్ గా ఉన్నాయి.    


‘బెస్ట్ యాక్టర్స్’ టైటిల్ కి ‘జీవితంలో’ అనేది ట్యాగ్ లైన్.. ఈ సినిమాకి ట్యాగ్ లైన్ చాలా పర్ఫెక్ట్ కానీ అది సినిమాకి సూట్ అవ్వలేదు చూసే ఆడియన్స్ కి సెట్ అవ్వుద్ది.. ఎందుకు అంటే.. బెస్ట్ యాక్టర్స్ అనే పరమ బోరింగ్ సినిమాని చూస్తూ నిజ జీవితంలో చూస్తూ టార్చర్ అనుభవించేది వాల్లే కాబట్టి.. సో ఈ సినిమా తీసిన నటించిన వారి కంటే డబ్బు పెట్టి థియేటర్స్ కి వచ్చి పెయిన్ తీసుకునే ఆడియన్స్ నా దృష్టిలో ది బెస్ట్ అని చెప్పాలి. సినిమా కథా పరంగా లవ్, కామెడీ, ఫ్రెండ్ షిప్, హార్ట్ టచింగ్ ఎమోషన్స్ ఉన్నాయి.. కానీ తెరపికి వచ్చే సరికి.. ఆడియన్స్ ఫీల్ మై లవ్ అని ఫీలయ్యేలా ఒక్క లవ్ సీన్ లేదు, హాహా అని గట్టిగా నవ్వుకునే ఒక్క కామెడీ సీన్ లేదు, దోస్త్ మేరా దోస్త్ అని మన స్నేహాన్ని గుర్తు చేసుకునే ఒక్క లవ్లీ ఫ్రెండ్షిప్ మోమెంట్ కూడా లేదు, ఇక చివరిగా ఆడియన్స్ మనసుకు హత్తుకునే ఒక్క ఎమోషన్ కూడా లేదు. దీన్ని బట్టి సినిమాలో ఆడియన్స్ ఎంజాయ్ చెయ్యడానికి ఏం లేదని అర్థమయ్యిందని అనుకుంటా.. కేవలం నేత్రానందాన్ని ఇచ్చే అందాల ఆరబోత, విజువల్స్ తప్ప మరేమీ లేదు. ఈ రెండిటి వలన సినిమాలు ఆడవు. సో ఈ సినిమా రేంజ్ ఏంటి.? రిజల్ట్.? ఏంటి అనేది మళ్ళీ నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదనుకుంటా..  

Nandu,Madhurima,Shamili Agarwal,Naveed,Bhargavi,Arun Pawar,Kumar Annam Reddy,J.Bబెస్ట్ యాక్టర్స్ – ది బెస్ట్ 'ఫ్రీమేక్' ఫ్లాప్.!

మరింత సమాచారం తెలుసుకోండి: