ఫస్ట్ హాఫ్ లో వర్క్ అవుట్ అయిన కామెడీ , రెజీన పెర్ఫార్మన్స్, లుక్ అండ్ గ్లామర్ ట్రీట్ , సెకండాఫ్ లో కొన్ని మోమెంట్స్ , సినిమాటోగ్రఫీ , మిక్కీ జె మేయర్ మ్యూజిక్ ఫస్ట్ హాఫ్ లో వర్క్ అవుట్ అయిన కామెడీ , రెజీన పెర్ఫార్మన్స్, లుక్ అండ్ గ్లామర్ ట్రీట్ , సెకండాఫ్ లో కొన్ని మోమెంట్స్ , సినిమాటోగ్రఫీ , మిక్కీ జె మేయర్ మ్యూజిక్ పాత చింతకాయ పచ్చడి కథ , ఊహాజనిత కథనం , సాగదీసిన ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ , ఏ పాత్రకి సరైన క్యారెక్టరైజేషన్ లేకపోవడం , విలన్స్ ని కామెడీగా చూపడం , కామెడీ కోసం కథని గంగలో కలిపేయడం , సెకండాఫ్ ఎడిటింగ్

అమ్మ, నాన్న, ఓ బుజ్జి చెల్లి.. ఇదీ మన హీరో సుబ్రమణ్యం(సాయిధరమ్ తేజ్) ఫ్యామిలీ. కానీ మనోడికి ఉన్న మనీ సమస్య వల్ల ఒక డాలర్ కి 60 రూపాయలు వచ్చే అమెరికా వెళ్ళి విచ్చలవిడిగా డాలర్స్ సంపాదించాలనుకొని అమెరికా వెళ్లి అక్కడ జాబ్ చేస్తుంటాడు. అలా డాలర్ వేటలో మన సుబ్రమణ్యం వాళ్ళ దగ్గరా వీళ్ళ దగ్గరా పని చేస్తూనే తనకి తానే ఓ సరికొత్త ఉద్యోగాన్ని క్రియేట్ చేసుకుంటాడు. అదే తనని తాను అమ్ముకోవడం.. తనకి ఏ పని చెప్పినా చెయ్యడానికి సిద్దం కానీ అది చెయ్యాలంటే దానికి తగ్గా డాలర్ రేటు తనకివ్వాలి. అలా ఇస్తే డాన్స్, పాట, ఫైటు, జంపింగ్స్..వగైరా..వగైరా.. ఇలా ఏం చెయ్యడానికైనా సై అంటాడు. అలా తనకి నచ్చిన పని చేస్తూ డాలర్స్ పోగు చేసుకునే సుబ్రమణ్యంకి ఓ రోజు ప్రేమలో పది ఒకడి చేతిలో మోసపోయిన సీత(రెజీన కసాండ్ర) కనపడడం, తనకి ఆసరాగా నిలవడం అది కాస్తా నిధానంగా ప్రేమగా మారుతున్న సమయంలో ఓ సమస్య కూడా వచ్చేస్తుంది.. సీత తన చెల్లి గీత(తేజస్వి) పెళ్లి కోసం కర్నూల్ వెళ్ళాల్సి వస్తుంది. తనకి తోడుగా సుబ్రమణ్యం ని కూడా తీసుకెళుతుంది. అలాగే ఇక్కడ సీత వల్ల మన సుబ్రమణ్యంకి ఓ సమస్య వస్తుంది. ఆ సమస్య పేరు బియ్యం బుజ్జి (రావు రమేష్). అది ఆఓళాఆ ఉండగా పాత గొడవల వల్ల ఇండియా వచ్చిన సుబ్రమణ్యంని గోవింద్ గౌడ్(అజయ్) కూడా వెతుకుతూ ఉంటాడు. కర్నూల్ లో సీతకి ఉన్న సమస్య ఏమిటి.? ఆ సమస్యకి సుబ్రమణ్యం ఏం పరిష్కారం చూపి బియ్యం బుజ్జిని అడ్డుకున్నాడు.? అలాగే తనని టార్గెట్ చేసిన గోవింద్ గౌడ్ ని ఎలా అడ్డుకున్నాడు.? అన్నదే మీరు తెరపై చూసి తెలుసుకోవాల్సిన మిగతా కథాంశం.

ఇక ఈ సినిమాలో నటీనటుల విషయానికి వస్తే.. ఈ సినిమాతో సుప్రీం హీరో అనే ట్యాగ్ లైన్ ని పెట్టుకున్న సాయిధరమ్ తేజ్ గురించి ముందుగా చెప్పుకుందాం.. ఇప్పుడిప్పుడే నటుడిగా అడుగులేస్తున్న సాయిధరమ్ తేజ్ ఈ సినిమాలో కొన్ని సీన్స్ లో చిరంజీవి మరియు పవన్ కళ్యాణ్ లను ఇమిటేట్ చెయ్యడానికి ట్రై చేసాడు. ఆ సీన్స్ బాగానే పండాయి. ముఖ్యంగా తన ఇంట్రడక్షన్ సీన్ లో పవన్ మేడ్ ఇన్ ఆంధ్ర స్టూడెంట్ బిట్ లో సూపర్బ్ అనిపించాడు. ఇక ఓవరాల్ గా డాన్సులు దుమ్ములేపెసాడు. కొన్ని సీన్స్ లో సెటిల్ గా చేయడం బాగానే ఉంది, కానీ చాలా చోట్ల అవసరానికి మించి చేసినట్లు ఉంటుంది. అంటే ఓవరాక్షన్ లా అనిపిస్తుంది. ఆ విషయంలో కేర్ తీసుకోవాలి. అలాగే ఫస్ట్ హాఫ్ లో హీరోకి ఉన్న క్యారెక్టరైజేషణ్ సెకండాఫ్ లో అస్సలు కనిపించలేదు. నటుడిగా తనని తానూ మెరుగు పరుచుకోవాల్సిన విషయాలు ఇంకా ఉన్నాయి. ఇక సినిమాలో ఆద్యంతం అట్రాక్ట్ చేసేది మాత్రం రేజీన అని చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదు. నటన పరంగా, లుక్ పరంగా, ఎమోషన్స్ పరంగా, గ్లామర్ పరంగా, స్కిన్ షో పరంగా ఇలా అన్నిటిలోనూ రెజీన కెరీర్ బెస్ట్ ఇచ్చిందని చెప్పాలి. రెజీన ఈ సినిమాకి ఒక మెయిన్ హైలైట్ గా చెప్పుకోవచ్చు. ఇక ఈ సినిమాలో ఎవ్వరికీ సరైన పాత్రలను తీర్చి దిద్దలేదు. ఆద శర్మ పాత్ర జస్ట్ జుజుబీ ఎనలా ఉంటుంది. తను చేసింది కూడా ఏమీ లేదు. ఈ పాత్ర చేయడం తన కెరీర్ కి నష్టమే తప్ప ఉపయోగం లేదు. రావు రమేష్ , సుమన్, అజయ్, ప్రగతి, కోట శ్రీనివాసరావు, రణధీర్, నరేష్, ఝాన్సీ, నాగబాబు లాంటి వారు ఓకే అని పించుకున్నారు వారి పాత్రల్లో.. కానీ ఏ పాత్రని సరిగా రాసుకోలేదు, కావున ఏ పాత్ర పెద్దగా ఆడియన్స్ కి కనెక్ట్ అవ్వదు. బ్రహ్మానందం అక్కడక్కడా ప్రేక్షులను బాగానే నవ్వించాడు. 

'రామయ్యా వస్తావయ్యా' రూపంలో హరీష్ శంకర్ కి ఒక ఫ్లాప్ రావడంతో ఈ సినిమాని చాలా చాలా సేఫ్ గా ప్లాన్ చేసుకున్నాడు. అందుకే సుబ్రమణ్యం ఫర్ సేల్ లాంటి రెగ్యులర్ అండ్ రొటీన్ కథని ఈ సినిమాకి ఎంచుకున్నాడు. ప్రీ ప్రమోషన్స్ లో ఇచ్చిన ఇంటర్వ్యూస్ లో పాత కథనే కొత్తగా చెబితే చాలు అని చెప్పిన హరీష్ శంకర్ ఈ సినిమాకి అదే మంత్రాన్ని తూచా తప్పకుండా పాటించాడు. ఎందుకంటే తను తీసుకున్న కథని మనం ఇప్పటికే చాలా సార్లు చూసేసాం. కానీ ప్రెజంటేషన్ ని డిఫరెంట్ గా ప్లాన్ చేసుకోవడానికి ట్రై చేసాడు. ఆ విషయంలో ఫస్ట్ హాఫ్ పరంగా కాస్త సక్సెస్ అయినా సెకండాఫ్ లో మాత్రం దారితప్పి గమ్యం చేరని రూట్ లో ప్రయాణం చేసి ఓ చోట సినిమాని ముగించేసాడు. సినిమా స్టార్టింగ్ ని బాగానే మొదలు పెట్టాడు, హీరో పాత్రని బాగానే పరిచయం చేసాడు, ఎలివేషన్ ఇచ్చాడు, హీరోయిన్ ని తెచ్చాడు, హీరో హీరోయిన్ ని కలిపాడు.. అంతవరకూ ఓకే ఆ తర్వాతనే వచ్చిన స్టైల్ సీన్స్ మళ్ళీ వస్తుంటాయి. అక్కడి నుంచి చిన్న ట్విస్ట్ తో కథని ఇండియాకి తెచ్చి  ఇంటర్వల్ బ్లాక్. అది కూడా ఓకే. ఆ తర్వాతే అసలు సమస్య అంతా.. ఎలా అంటే ఇంటర్వెల్ బ్లాక్ తో ఇక ఏం జరుగుతుంది అనేది తెలిసిపోతుంది. అంతే కాకుండా అప్పటి వరకూ చూపిన హీరోయిజం ఒక్కసారిగా తుస్సుమంటుంది. హీరో హీరోయిజంని వదిలేసి కామెడీ మీద పడతాడు, దీనికంటే మించిన మైనస్,, విఅల్న్స్ ఇద్దరినీ బకరా గాళ్ళని చేసి ఓ సిల్లీ, కామెడీ, సొల్లు ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ ని చూపించడం. దాంతో చూసే ఆడియన్స్ కి కథ విషయంలో చిరాకు వస్తుంది. ఆ తర్వాత అనవసరమైన సెంటిమెంట్ సీన్స్ తో క్లైమాక్స్ ని ఒక మీటర్ లో అవ్వాల్సిన దాన్ని కిలోమీటర్ సాగదీసి వదిలాడు. చెప్పాలంటే సేకందాలో కథని, కథనాన్ని ఎటు పడితే అటు తిప్పేసాడు. కామెడీ బిట్స్ వస్తున్నా కథలో సింక్ లేకపోవడం వలన ఆడియన్స్ కి అస్సలు ఎక్కదు. జస్ట్ కామెడీ బిట్స్ మాత్రమె కావాలంటే ఇంట్లో కూర్చొని కామెడీ చానల్ చూస్కోవచ్చు కదా, సినిమాకి రావడం ఎందుకు అంటా.. ఇకపోతే వీక్ సెంటిమెంట్ సీన్స్.. ఎలా అంటే సీరియల్ లో వచ్చే సీన్స్ లా అనిపిస్తాయి, అలాగే ఒక్క సీన్స్ లో ఝాన్సీ, తన కూతురు ఒక్క సెకన్లో  మారిపోవడం, ఆద శర్మ మారిపోవడం, విలన్స్ మారిపోవడం అనే పాయింట్ సిల్లీ అనే పదమే సిగ్గుపడేంత సిల్లీగా ఉంది. అసలు ఇదెలా సాధ్యం అంటారు డైరెక్టర్ సాబ్.. హౌ.. హౌ.. అని అడుగుతున్నా.. సో దీనివలన సినిమా అర్థం ఉడికిన కిచిడీలా తయారైంది. హరీష్ శంకర్ కథ పాతదే, అలాగే కథనం ఇంకా పాతగా ఉంది.. డైరెక్షన్ మాత్రం కాస్త బెటర్ గా ఉండడం వలన చలా మంది సినిమా చల్తా అంటారు, కొంతమంది ఏదో ఉందిలే అని కూడా అంటారు. 


ఇక మిగతా టెక్నికల్ డిపార్ట్ మెంట్స్ విషయానికి వస్తే.. సి రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. అమెరికా విజువల్స్ ని చాలా బాగా చూపించాడు. విజువల్స్ చాలా రిచ్ గా, చాలా గ్రాండ్ గా ఉన్నాయి. మిక్కీ జె మేయర్ సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చాయి, అలాగే నేపధ్య సంగీతం ఇంకా పెద్ద హెల్ప్ అయ్యింది. హీరో ని ఎలివేట్ చేసే సీన్స్ లో మ్యూజిక్ అదుర్స్. గోతం రాజు ఎడిటింగ్ లో బాగా డ్రాగ్స్ ఉన్నాయి. ఒక 10 నిమిషాలన్నా కట్ చేయాల్సింది. రామ్ లక్షణ్ అండ్ వెంకట్ కంపోజ్ చేసిన యాక్షన్ ఎపిసోడ్స్ బాగున్నాయి. రామకృష్ణ ఆర్ట్ వర్క్ చాలా బాగుంది. సెట్ వర్క్ చాలా చాలా గ్రాండ్ గా ఉంది. హరీష్ శంకర్ రాసిన డైలాగ్స్ కి 50 - 50 మార్క్స్ మార్క్స్ మాత్రమే పడ్డాయి. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణ విలువలు మాత్రం సూపర్బ్. 


ఈ వారం ఒక రోజు ముందుగానే బాక్స్ ఆఫీసు వద్ద సందడి చేయడానికి మన యంగ్ సుప్రీం హీరో అదేనండి మన సాయిధరమ్ తేజ్ 'సుబ్రమణ్యం ఫర్ సేల్'. పాత కథకి కొత్త రంగులు మరియు కొన్ని కామెడీ బిట్స్ జోడించి బాక్స్ ఆఫీసు వద్ద సేల్ చెయ్యాలని డైరెక్టర్ హరీష్ శంకర్ ప్లాన్ చేసాడు. ప్లాన్ బాగానే ఉన్నా ప్లాన్ ని మాత్రం పర్ఫెక్ట్ గా అమలు చేయలేకపోయాడు, చెప్పాలంటే ఎక్కువ భాగం ఫెయిల్ అయ్యాడు. సుబ్రమణ్యం ఫర్ సేల్ అనే సినిమా కథ, కథనం లాంటి వాటితో పని లేకుండా నాలుగు ఫైట్లు, ఐదు పాటలు, ఆరు కామెడీ బిట్స్ కోరుకునే రెగ్యులర్ ఆడియన్స్ కి నచ్చే సినిమా అయితే మిగతా వారికి మాత్రం బాగా బోరింగ్ గా అనిపించే పరమ రొటీన్ స్టఫ్.. ఈ సినిమాలో ఆడియన్స్ కి రిలాక్స్ ఇచ్చేది అక్కడక్కడా వర్కౌట్ అయిన కమెడీ, రొమాన్స్ అయితే చిరాకు పెట్టేది మాత్రం కథ - కథనాలే.. ఒవర్ల్ జి బాక్స్ ఆఫీసు వద్ద యావరేజ్ గా సేల్ అయ్యే స్టఫ్ 'సుబ్రమణ్యం ఫర్ సేల్'.

Sai Dharam Tej,Regina Cassandra,Adah Sharma,Harish Shankar,Dil Raju,Mickey J Meyerసుబ్రమణ్యం ఫర్ సేల్ – యావరేజ్ సేల్స్ ఫర్ సుబ్రమణ్యం.

మరింత సమాచారం తెలుసుకోండి: