వరల్డ్ వార్ II ఎపిసోడ్ , గ్రేట్ విజువల్స్ , వరుణ్ తేజ్ , ప్రాగ్య జైశ్వాల్ ల పెర్ఫార్మన్స్ , సినిమాటోగ్రఫీ , బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ , రొమాంటిక్ ట్రాక్ , శ్రీని అవసరాల కామెడీ వరల్డ్ వార్ II ఎపిసోడ్ , గ్రేట్ విజువల్స్ , వరుణ్ తేజ్ , ప్రాగ్య జైశ్వాల్ ల పెర్ఫార్మన్స్ , సినిమాటోగ్రఫీ , బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ , రొమాంటిక్ ట్రాక్ , శ్రీని అవసరాల కామెడీ కథలో లోటు పాట్లు , సెకండాఫ్ లో ఇంకాస్త బెటర్ గా ఉండాల్సిన స్క్రీన్ ప్లే , స్లో నేరేషన్ , ఎడిటింగ్ , యాక్షన్ ఎపిసోడ్స్ లో ఇంటెన్సిటీ మిస్ అవ్వడం

క్రిష్ ఎప్పుడూ ఒక బర్నింగ్ పాయింట్ ని తీసుకొని, రెండు విభిన్న కథలుగా చేసి, ఒకే బ్యాక్ డ్రాప్ లో చెప్పడానికి ట్రై చేస్తుంటాడు.. ఇందులో అతను కులం మీద తన బాణాన్ని సందించాడు. కంచె సినిమాని రెండు టైమింగ్స్ లో చెప్పాడు. ఒకటి 1936, మరొకటి 1944.. ముందుగా 1936 విషయానికి వస్తే.. రాచకొండ సంస్థానానికి అధినేత ఈశ్వర్ ప్రసాద్(నికేతన్ ధీర్), అతని చెల్లెలు ప్రిన్సెస్ సీతాదేవి(ప్రాగ్య జైశ్వాల్). అదే ఊర్లో తక్కువ కులంలో జన్మించిన కుర్రాడు ధూపాటి హరిబాబు(వరుణ్ తేజ్). వీరిద్దరూ మద్రాసు యూనివర్సిటీలో చదువుకుంటూ ఒకరిని ఒకరు ప్రేమించుకుంటారు. కానీ వీరి పెళ్ళికి కులం అడ్డు వస్తుంది. దాంతో ఊర్లో గొడవలు భగ్గుమంటాయి. ఆ గొడవలని ఎలా ఆపారు.? వారి ప్రేమ ఏమయ్యింది.? అన్నది అక్కడి కథ.. ఇక 1944కి వస్తే రాయల్ ఇండియన్ ఆర్మీ హెడ్స్ అయిన ఈశ్వర్ ప్రసాద్ - హరిబాబులు ఇటలీ తరపున పోరాడటానికి సిద్దమవుతారు. అలా వార్ ఫీల్డ్ లో ఉన్న వీరి పై శత్రు సైన్యం ధ్వంసం చేసి ఆర్మీ చీప్ మరియు కల్నల్ ని బందిస్తుంది. కట్ చేస్తే వారి నుంచి తప్పించుకున్న హరిబాబు తనతో పాటు ఉన్న మరో నలుగురుతో కలిసి తమ ఆర్మీ చీఫ్ మరియు కల్నల్ ని ఎలా కాపాడాడు అన్నదే ఇక్కడి కథ.  

నటీనటులందరూ ది బెస్ట్ అవుట్ పుట్ ఇచ్చారు.. కాదు కాదు క్రిష్ అందరి నుంచీ ముక్కుపిండి మరీ సూపర్బ్ అవుట్ పుట్ రాబట్టుకున్నాడని చెప్పాలి. వరుణ్ తేజ్ కి ఇది రెండవ సినిమా కానీ తన పెర్ఫార్మన్స్ మాత్రం ఓ పది సినిమాల అనుభవం కలిగిన నటుడిలా ఉంది. ప్రతి చిన్న ఎక్స్ ప్రేషన్ ని కూడా చాలా బాగా ఇచ్చాడు. అలాగే డైలాగ్ డెలివరీ, పదాల ఉచ్చారణలో కూడా చాలా క్లారిటీ అండ్ మెచ్యూరిటీ కనిపించింది. ఇకపై వరుణ్ ఇలాంటి సినిమాలు చేస్తాడో లేదో తెలియదు కానీ నటుడిగా తనకి మంచి గుర్తింపును తెచ్చి తన కెరీర్లో అలా నిలిచిపోయే సినిమా అవుతుంది. ప్రిన్సెస్ అంటే ఇలానే ఉండేదేమో అనిపించేనతలా ప్రాగ్య జైశ్వాల్ ని చూపించారు. ఆమె అలనాటి అచ్చమైన సాంప్రదాయ దుస్తుల్లో కనిపించిన తను ఇచ్చిన హావ భావాలకు కుర్రాళ్ళు ఫిదా అయిపోతారు. సూపర్బ్ పెర్ఫార్మన్స్ ఇచ్చింది. తనకి కచ్చితంగా కంచె బిగ్ బ్రేక్ ఇస్తుంది.  నికేతన్ ధీర్ నెగటివ్ షేడ్స్ ని బాగానే చూపించాడు. ఇక శ్రీనివాస అవసరాల చలం, శ్రీ శ్రీ గారి మాటలను చెబుతూనే వాటిలో ఉన్న ఓ తెలియని చమత్కారాన్ని ప్రేక్షకులకు అందించి సినిమాలో కాసేపు నవ్వించాడు. గొల్లపూడి మారుతీ రావు, సింగీతం శ్రీనివాసరావు, పోసాని కృష్ణ మురళి, సత్యం రాజేష్ లు తమ పాత్రలకు న్యాయం చేసారు. 

సాంకేతిక విభాగంలో ముందుగా తెలుగు ప్రేక్షకులు గర్వించేలా ఓ సినిమాని అందించిన క్రిష్ కి ముందుగా గ్రేట్ సెల్యూట్ చేస్తున్నాను.. ఇక సినిమాగా ఆయన ఎలా తీసారు అనే విషయానికి వస్తే.. కంచె కథలో ఆయన ఇప్పటికీ ప్రజలు కొట్టుకుంటున్న కుల వ్యవస్థ గురించి చెప్పాలనుకున్నాడు..  అందుకోసం ఆయన కుల వ్యవస్థ ఎక్కువగా ఉన్న 1940 టైం లైన్ ని సెలక్ట్ చేసుకున్నాడు. దానికి ప్రేమకథ ని - వరల్డ్ వార్ II ని మిక్స్ చేసిన విధానం సింప్లీ సూపర్బ్. కానీ ఈయన కథలో ఎన్నో సూపర్బ్ సీన్స్ రాసుకున్నా ఇంటెన్సిటీని మిస్ అయ్యాడు. చాలా సీన్స్ లో ఆడియన్స్ కమాన్ పీక్స్ కి తీసుకెళ్ళు అని ఫీలవుతుంటారు కానీ ఆ పీక్స్ స్టేజ్ ని క్రిష్ రీచ్ అవ్వలేదు. సినిమాకి అదే మైనస్. దానికి తోడు సినిమాని మొదటి నుంచి చివరిదాకా స్లోగా నేరేట్ చేసుకుంటూ వెళ్ళారు. అక్కడక్కడా అయితే మరీ స్లో అయిపోతుంది. దానివలన ఆడియన్స్ కూడా చాల లో పిచ్ లో సినిమా చూస్తుంటారు. అలాగే పాత్రల మధ్య ఎమోషన్ కంటెంట్ ని పూర్తి స్థాయిలో ఆడియన్స్ కి కనెక్ట్ చేయలేకపోయాడు. ప్రేమకథలో ఏం జరుగుతుందా అనేది ఆడియన్స్ కి అర్థమవుతుంటుంది, కానీ వార్ ఎపిసోడ్ విషయంలో ఇంకాస్త క్లారిటీ ఇవ్వాల్సింది. అలాగే కథనంలో బి, సి సెంటర్ ఆడియన్స్ కి కాస్త ఇబ్బంది కరం ఆయిన ఫ్రంట్ - బ్యాక్ అనే ఫార్మాట్ ని ఫాలో అయ్యాడు. అర్థమైన వారికి ఈ స్క్రీన్ ప్లే సూపర్బ్ అనిపిస్తుంది కానీ మిగత వారికి అంతగా ఎక్కదు. ఓవరాల్ గా తెలుగులో కొత్త తరహా సినిమాల కోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తున్న సినిమా అభిమానులను భీభత్సంగా మెప్పించాడు. కానీ రెగ్యులర్ అండ్ రొటీన్ సొల్లు సినిమాలు కోరుకునే వారికి మాత్రం ఈ సినిమా పెద్దగా కనెక్ట్ అవ్వదు.       


ఇలాంటి ఓ యావరేజ్ బడ్జెట్ సినిమాలో వరల్డ్ వార్ II ఎపిసోడ్ ని చూపించిన విధానం అదరహో అనాలి. అలాగే ఆ ఎపిసోడ్స్ కోసం వాడిన విఎఫ్ఎక్స్ వర్క్ కూడా చాలా చాలా బాగుంది. జ్ఞాన శేఖర్ సినిమాటోగ్రఫీ సింప్లీ సూపర్బ్.. 1936 ఫ్లేవర్ ని తెరపై చూపించడానికి జ్ఞాన శేఖర్ - ఆర్ట్ డైరెక్టర్ సాహి సురేష్ ల కష్టం గురించి స్పెషల్ గా చెప్పాలి. ప్రతి సీన్ ప్రతి ఎపిసోడ్ మనకు అలనాటి ఇండియాని గుర్తు చేస్తుంది. అలాగే వరల్డ్ వార్ ఎపిసోడ్ ని రియల్ గా అనిపించడం కోసం వారు వాడిన రియల్ వెపన్స్ కూడా సినిమాకి మరింత రియలిస్టిక్ ఫీల్ ని తీసుకొచ్చాయి. ఓవరాల్ గా తెలుగు స్క్రీన్ పై ఈ రేంజ్ విజువల్స్ అందించిన జ్ఞాన శేఖర్ - సాహి సురేష్ లకు హ్యాట్సాఫ్.. చిరంతన్ భట్ మ్యూజిక్ అండ్ రీ రికార్డింగ్ కూడా సినిమాకి చాలా పెద్ద ప్లస్ అయ్యింది. సూరజ్ - రామకృష్ణల ఎడిటింగ్ అంతగా బాలేదు. చాలా బోరింగ్ ఎలిమెంట్స్ మరియు సెకండాఫ్ పాటని కట్ చేసి ఉండచ్చు. ఇకపోతే వెంకట్ - డేవిడ్ ల యాక్షన్ ఎపిసోడ్స్ కూడా అలనాటి మల్లయుద్దాన్ని గుర్తు చేస్తాయి. వరల్డ్ వార్ II పార్ట్ ని కూడా బాగా కంపోజ్ చేసారు. రాజేవ్ రెడ్డి - సాయి బాబు నిర్మాణ విలువలు బాగా రిచ్ గా ఉండడమే కాకుండా ఒక హాలీవుడ్ ఫీల్ ని తెచ్చి పెట్టాయి. సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ ఈ సినిమాకి స్పెషల్ అట్రాక్షన్.. ఆయన రాసిన ఓ రెండు డైలాగ్స్ మీ కోసం.. 'ఇష్టానికి ప్రేమకి ఉన్న తేడా ఏంటి - గులాబి పువ్వును ఇష్టపడితే కోసేస్తాం, అదే ప్రేమిస్తే ఆ మొక్కకి నీళ్ళు పోస్తాం.. పదవంటే ఏమనుకున్నావ్ .. గొడవల మీద గుత్తాదిత్యం.. మనుషులు కలిసి బతకాలిరా.. కంచెలు వేసుకొని కాదు'.

మొదటి నుంచీ రొటీన్ కి భిన్నంగా వెళ్తున్న క్రిష్ 'కంచె' లాంటి సినిమాని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చి తెలుగు చలన చిత్ర సీమలో ఓ సరికొత్త ఓరవడికి నాది పలికాడు.. ఇలాంటి ఓ సినిమా చేసినందుకు తెలుగు సినిమా ప్రేమికుడుగా క్రిష్ కి సెల్యూట్ చేస్తున్నా...ఇకనన్నా క్రిష్ లాంటి దర్శకున్ని చూసి మన దర్శకులు నేర్చుకోవాల్సింది చాలా ఉంది.. ఇక కంచె సినిమాకి వస్తే కంచె సినిమాలో ప్రతి తరహా ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే కొన్ని పాయింట్స్ ఉన్నాయి. అవే ప్రేమకథ, ఫ్యామిలీ ఎమోషన్స్ మరియు యుద్ద నేపధ్యంలో వచ్చే వార్ ఎపిసోడ్స్. వీటన్నిటినీ బాగానే మిక్స్ చేసిన క్రిష్ నేరేషన్ ఇంకాస్త స్పీడ్ గా ఉండేలా చెప్పి ఉంటే సినిమా కమర్షియల్ గా కూడా సూపర్ సక్సెస్ అయ్యేది. ప్రస్తుతానికి బాక్స్ ఆఫీసు వద్ద కమర్షియల్ గా యావరేజ్ అనిపించుకున్నా ప్రతి ఒక్కరి హృదయాల్ని టచ్ చేసే సినిమా 'కంచె'. తెలుగూ ప్రేక్షకులు ఇలాంటి సినిమాని తెలుగు తెరపై ఇదివరకూ చూడలేదు కావున వీలైనంత వరకూ ఈ సినిమాని సిల్వర్ స్క్రీన్ పై చూసి ఎంజాయ్ చేయండి.. 

Varun Tej,Pragya Jaiswal,Krish,Saibabu Jagarlamudi & Y. Rajeev Reddy,Chirantan Bhattకంచె - రొటీన్ కమర్షియల్ సినిమాలకు 'కంచె' వేసే సినిమా.!

మరింత సమాచారం తెలుసుకోండి: