సినిమాటోగ్రఫీ , సాంగ్స్ సినిమాటోగ్రఫీ , సాంగ్స్ పాత్రలని రాస్కున్న విధానం , ఊహాజనిత స్క్రీన్ ప్లే , డెడ్ స్లో నేరేషన్ , ఎడిటింగ్ , డైరెక్షన్ , డైలాగ్స్ , సందర్భం లేకుండా వచ్చే సాంగ్స్ , ఫైట్స్ , సాగదీసిన క్లైమాక్స్ , రొటీన్ కమర్షియల్ ఫార్మాట్ కథ

రత్నం రాయ్ (సుమన్) వరల్డ్స్ బెస్ట్ బిజినెస్ మాన్స్ లో ఒకడు.. స్పేస్ షిప్ లను తయారు చేసే కాంట్రాక్ట్ ని కూడా దక్కించుకుంటాడు. అతను తన అనంతరం తన ఆస్తి తన కంపెనీలో పనిచేసే వారందరికీ సమానంగా చెందాలని వీలునామా రాసి పెట్టుకొని ఉంటాడు. ఆ విషయం తెలుసుకున్న రత్నం రాయ్ కొడుకు అజయ్(అజయ్) ఆస్తి కోసం తన తండ్రినే చంపడానికి నిర్ణయించుకుంటాడు. అనుకున్నట్టుగానే రత్నం రాయ్ ని చంపేస్తాడు. కానీ ఆస్తి వివరాలు, వీలునామా అన్ని తన పర్సనల్ కంప్యూటర్ లో పెట్టుకొని ఉంటాడు రత్నం రాయ్. ఈ సీక్రెట్ కోడ్ ని అజయ్ తీయలేకపోతాడు. అక్కడి నుంచి కట్ చేస్తే ఇండస్ట్రియలిస్టు ప్రకాష్ (రాజీవ్ కనకాల) కథలోకి వస్తాడు. తన చెల్లెలే మన హీరోయిన్ అఖీర(చాందిని). చాందినిని ప్రకాష్ అసిస్టెంట్ కిడ్నాప్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తుంటాడు. కట్ చేస్తే ఆ కిడ్నాప్ చేసిన కారుని కార్లు దొంగతనం చేసే మన హీరో చందు (తేజస్) కొట్టేస్తాడు. అదే టైములో తనకి కావాల్సింది అఖీర దగ్గర ఉందని అజయ్ తెలుసుకుంటాడు. దాంతో ఇరు వర్గాలు చందు – అఖీర ల వెంటపడతారు. అక్కడి నుంచి కథ ఎలాంటి మలుపులు తిరిగింది.? అసలు తన ప్రకాష్ అసిస్టెంట్ అఖీరని ఎందుకు కిడ్నాప్ చేసాడు.? అజయ్ మనుషులు ఎందుకు అఖీరని వెంటాడుతున్నారు.? వీటన్నిటి నుంచి అఖీరని మన హీరో చందు ఎలా తప్పించాడు.? అన్నదే మిగిలిన కథాంశం.  

కేటుగాడు సినిమాలో సీనియర్ యాక్టర్స్ గా కనిపించిన సుమన్, అజయ్, రాజీవ్ కనకాల లాంటి వారు తప్ప మిగతా ఎవరూ మంచి నటనని కనబరచలేదు. హీరో తేజు తనకి ఇచ్చిన పాత్రలో డీసెంట్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. కానీ తన పాత్రని సరిగా డిజైన్ చేయలేదు. హీరోగా చెప్పుకునేంత ఇంపాక్ట్ పాత్రలో లేదు, పైగా తను చేయడానికి ఏమీ లేదు. మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమాలని ఎంచుకొని సింపుల్ గా సినిమాలు చేసుకుంటే తేజస్ సక్సెస్ అవ్వచ్చు. ఇక మన హీరోయిన్ చాందిని కొన్ని స్టడీగా ఉన్న సీన్స్ లో చూడటానికి  బాగుంది. కానీ హావ భావాలే పెద్దగా పలకించలేదు. ఇక్కడ తన తప్పేమీ లేదు.. ఎందుకంటే తన నుంచి అలాంటి హావభావాలను రాబట్టుకొని ఓకే చేసింది డైరెక్టర్ కదా... అతిధి మాత్రలో సుమన్ మెప్పిస్తే, నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో అజయ్ బాగా చేసాడు. అలాగే రాజీవ్ కనకాల రెండు షేడ్స్ ఉన్న పాత్రలో ఆకట్టుకున్నాడు. ఇక కామెడీ కోసం పెట్టిన సప్తగిరి పాత్ర ఆడియన్స్ కి పెద్ద టార్చర్. నవ్వించకపోగా తెగ చిరాకు పెట్టించేసాడు.

కేటుగాడు అనే సినిమా మన టాలీవుడ్ రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్ నుంచి ఊడిపడిన మరో సినిమా..  ఓ ప్రేమకథ, రెండు చేజ్ లు, మూడు ఫైట్స్, నాలుగు సాంగ్స్ మధ్యలో సొల్లు డ్రామా.. ఈ ఫ్లేవర్ ని డైరెక్టర్ ఎక్కడా మిస్ చేయలే.. సినిమాని మొదలు పెట్టడం ప్రస్తుతం – గతం అని లింక్ పెడుతూ స్టార్ట్ చేసినా సరైన క్లారిటీ లేకపోవడం వలన మొదట్లోనే ఆడియన్స్ కి బ్యాండ్ బాజా బారాత్ మొదలైపోతుంది. సినిమా మొత్తంలో సుమన్ ఉన్న 5 నిమిషాల పార్ట్ బెస్ట్ అని చెప్పవచ్చు. మిగతా అంతా ఎలా ఉంటుందంటే ‘ఇట్స్ పెయినింగ్.. అదికూడా బాగా.. మామూలు రేంజ్ కాదు’,, కొన్ని సీన్స్ లో కాస్త నవ్వించాడు కానీ ఆ తర్వాత చిరాకు పెట్టేసారు.. ముఖ్యంగా సప్తగిరితో చేయించిన ట్రాక్.. అది కామెడీ కాడు కామెడీకి పట్టిన పీడ అనేలా ఉంది..  

 

కేటుగాడు అనే సినిమా ఆద్యంతం ఆడియన్స్ ని టార్చర్ పెట్టడం వెనకున్న ఒకే ఒక వ్యక్తి డైరెక్టర్ కిట్టు. టోటల్ గా తను చేసిన మిస్టేక్స్ వలనే సినిమా ఓ రేంజ్ లో ప్రేక్షకులను నిరుత్సాహపరిచింది. సినిమాకి కీలకం అయిన కథ – స్క్రీన్ ప్లే – డైరెక్షన్ అనే విభాగాలను కిట్టు డీల్ చేసాడు, పైగా కిట్టుకి డైరెక్టర్ గా ఇది మొదటి సినిమా.. కథ – కొత్తదేమీ కాదు.. పాత రొటీన్ కథనే కాస్త కొత్తగా చెప్పాలని ట్రై చేసాడు. ప్రస్తుతం ఇండస్ట్రీలో చాలా మంది ఫాలో అవుతున్న విధానాన్నే తనూ ఫాలో అయ్యాడు. సో కథలో అయితే ఎలాంటి దమ్ము లేదు, సో తన టాలెంట్ అంతా కథనంలోనే చూపించాలి. ముఖ్యంగా తన దగ్గర ఉన్న కంటెంట్ మొత్తాన్ని సెకండాఫ్ లో మాత్రమే పెట్టేసాడు. దాంతో ఫస్ట్ హాఫ్ ని అనవసరపు రొమాంటిక్ ట్రాక్ తో, పాటలతో సాగదీసి బోర్ కొట్టించేసాడు. అసలు హీరో – హీరోయిన్ ఎందుకు ప్రేమలో పడతారు అన్న క్లారిటీనే లేదు.. సినిమాకి వాళ్ళే హీరో హీరోయిన్స్ కాబట్టి లవ్ ఉండాలి, వారి మధ్య పాటలు ఉండాలి సో ఉన్నాయి అన్న తరహాలో లవ్ ట్రాక్ ఉంది. ఇకపోతే సెకండాఫ్ అన్నా ఆసక్తికరంగా చెప్పాడా అంటే అదీ లేదు. తన దగ్గర ఉన్న కాస్తో కూస్తో కంటెంట్ ని కూడా ది వరస్ట్ పాజిబుల్ గా చెప్పడంలో కిట్టు సక్సెస్ అయ్యాడు. ఇకపోతే నేరేషన్ డెడ్ స్లో అనేదానికి పూర్తి జస్టిఫై చేసేలా ఉంది. వీటితో పాటు ఒక డైరెక్టర్ గా కూడా ఫెయిల్ అయ్యాడు. సీనియర్ యాక్టర్స్ కావున సుమన్ రాజీవ్ అజయ్ లు వారి అనుభవంతో చేసుకెళ్ళిపోయారు. కానీ మిగిలిన వారి నుంచి జీరో పెర్ఫార్మన్స్ రాబట్టుకున్నాడు. ఓవరాల్ గా కథ, కథనం, నేరేషన్, డైరెక్షన్, కామెడీ, లవ్ ట్రాక్, సస్పెన్స్ ఇలా ఏ ఒక్క విషయంలోనూ ఆకట్టుకోలేకపోయాడు డైరెక్టర్ కిట్టు.


సాయి కార్తీక్ అందించిన పాటలు ఓకే అనేలా ఉన్నాయి, ఇక అతని బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అంతగా లేదు, సినిమాకి పెద్దగా సింక్ అవ్వలేదు. పసం వెంకటేశ్వరరావు ఎడిటింగ్ సినిమాకి మరో బిగ్గెస్ట్ మైనస్. చాలా చోట్ల అవసరం లేదు ఇక అన్న సీన్స్ ని కూడా కట్ చేయకుండా ఆడియన్స్ కి టార్చర్ పెట్టాడు. ఎడిటర్ డైరెక్టర్ కి మించి వరస్ట్ అవుట్ పుట్ ఇచ్చాడు. డైలాగ్ రైటర్స్ పి. రాజశేఖర్ రెడ్డి – భాషశ్రీ రాసిన డైలాగ్స్ కూడా అయ్యయ్యో ఏందయ్యా మాకీ రచ్చ(జయప్రకాశ్ రెడ్డి స్టైల్)అనుకునేలా ఉన్నాయి. సినిమా టెక్నికల్ డిపార్ట్ మెంట్ లో పరవాలేదనిపించిన వాటిలో మలహభట్ జోషి డీసెంట్ విజువల్స్ ని అందించాడు. చాలా చ్టోల సినిమాకి ఎంచుకున్న లొకేషన్స్ బాగున్నాయి. వాటిని బాగా చూపించారు. ఇకపోతే వెంకటేష్ బలసాని నిర్మాణ విలువలు బాగున్నాయి.  


1990లో వచ్చిన మెగా హిట్ సినిమాలకి స్పూర్తిగా నిలిచే సినిమానే ఈ కేటుగాడు. ఇప్పటికే ఇలాంటి ఫ్లేవర్ లో చాలా సినిమాలు వచ్చి ఆడియన్స్ ని థియేటర్స్ లో మెప్పించాయి. కొన్ని నిరుత్సాహ పరిచాయి కూడాను. అలా నిరుత్సాహపరిచిన సినిమాల లిస్టులో ఈ రోజు కేటుగాడు కూడా చేరింది. పాత చింతకాయ పచ్చడి లాంటి కథ, ఎంగేజింగ్ గా లేని కథనం మరియు చాలా చెత్తగా అనిపించే ఎగ్జిక్యూషన్ కేటుగాడు సినిమాని ఫ్లాప్స్ వరుసలో నిలిపేలా చేసింది. ఈ కేటుగాడు సినిమా చూసే ఆడియన్స్ కి చేదు అనుభవాన్ని ఇవ్వడమే కాకుండా నిర్మాతలకి కూడా బాక్స్ ఆఫీస్ వద్ద చేదు కలెక్షన్స్ ని అందిస్తుంది.

Tejus,Chandini Chowdary,Kittu Nalluri,Venkatesh Balasani,Sai Karthikపంచ్ లైన్ : కేటుగాడు – వీడో పెద్ద సోది గాడు.!

మరింత సమాచారం తెలుసుకోండి: