తెలుగు ఇండస్ట్రీలో బాలీవుడ్ నుంచి ఎంతో మంది విలన్లు గా వచ్చారు..వస్తున్నారు. కొంతమంది తెలుగు ఇండస్ట్రీలోనే సెటిల్ అయ్యారు కూడా.. తాజాగా కిక్-2, రేసుగుర్రం సినిమాల్లో విలన్ నటించిన రవికిషన్ పెద్ద షాక్ లో ఉన్నట్లు సమాచారం..  19 సంవత్సరాల వయస్సు ఉన్న తన కూతురు కొన్నిరోజుల నుండి కనిపించడంలేదని బంగూర్ నగర్ పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కేసు నమోదు చేశారు.

 ప్రస్తుతం తన కూతురు కనిపించకపోవడంతో తీవ్ర ఆందోళనలో రవికిషన్ ఉన్నట్లు అయన సన్నిహితులు చెబుతున్నారు. అయితే ఈ విషయంపై డిసీపి ధనుంజయ్ కులకర్ణి మాట్లాడుతూ ‘రవికిషన్ కూతురు కనబడకుండా వెళ్ళడం ఇది మొదటిసారి కాదని అంతకు ముందు కూడా ఒకసారి ఇలాగే కనబడకుండా వెళ్ళిపోయిందని ఆయన తెలిపారు. టాలీవుడ్‌లో రవికిషన్ ఇటీవల రవితేజ నటించిన కిక్-2సినిమాలో సోలమాన్ సింగ్ రాగూర్ పాత్రలో విలన్ గా నటించటంతోపాటు పలు సినిమాల్లో విలన్‌గా నటించారు.

రవి కిషన్ కి భోజపురిలో మంచి మార్కెట్ ఉంది. అక్కడ హీరోగా అతను చాలా హిట్స్ కొట్టారు. స్టార్ గా వెలుగుతున్నారు.  అయితే  ఇప్పటివరకు రవికిషన్ కూడా మీడియాతో ఈ విషయంపై మాట్లాడటానికి ముందుకు రావట్లేదు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. త్వరలోనే రవికిషన్ కూతురు ఆచూకి తెలుసుకుంటామని పోలీసులు తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: