ఈ మద్య కాలంలో బాలీవుడ్ లో అడల్ట్ కాంటెంట్ ఉన్న చిత్రాలు విపరీతంగా వస్తున్నాయి..పెద్ద సినిమాలను కూడా బీట్ చేసే స్థాయిలో ఈ సినిమాలు దూసుకువెళ్తున్నాయి. అంతే కాదు ఇలాంటి సినిమాలు నిర్మాతలకు మంచి వ్యాపారం అయ్యింది. ఇక ఇలాంటి సినిమాల్లో నటించడానికి బీ గ్రేడ్ నటీమణులు విపరీతంగా ఉంటారు..సినిమాలకు గ్రాఫిక్ టెక్నాలజీ వాడాల్సిన అవసరం ఉండదు..ఖర్చు తక్కువ ఆదాయం ఎక్కువ అందుకే బాలీవుడ్ లో ఇప్పుడు ఇాలాంటి శృంగారభరిత చిత్రాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు.

హేట్ స్టోరీ, హాట్ స్టోరీ-2 ఇప్పటికే ఈ రెండు సినిమాలో బాలీవుడ్లో విడుదలై సంచలనం సృష్టించాయి. వాస్తవానికి ఈ సినిమాలో కథా పరంగా పెద్దగా విశేషాలు ఏమీ లెకున్నా విచ్చలవిడి శృంగారం మాత్రం బోలెడంత ఉంది..దీంతో ఈ సినిమాలు పెట్టుబడికి రెండు మూడీంతలు ఎక్కువే రాబట్టాయి. హేట్ స్టోరీ  3 ట్రైలర్ యూట్యూబ్ లో హల్ చల్ చేస్తోంది..జరీన్ ఖాన్ , షర్మాన్ జోషి , కరణ్ సింగ్ ప్రధానపాత్రధారులుగా విశాల్ పాండ్య తెరకెక్కిస్తున్న 'హేట్ స్టోరీ 3 ట్రైలర్ ను చిత్రయూనిట్ లేటేస్ట్ గా లాంచ్ చేసింది.. తుమ్హే అప్నే బనాయా అంటూ సాప్ట్ సాంగ్ తో మొదలైన ఈ ట్రైలర్ హీటెక్కిస్తోంది..లిమిట్స్ కు మించి జరీన్ ఖాన్ రోమాన్స్ చేసింది.

హేట్ 3 చిత్రంలో దృశ్యం


బూతు సినిమాలకు ఏ మాత్రం తీసి పోకుండా ఈ ట్రైలర్ ఉంది. ట్రైలర్ మొత్తం సెక్స్ సీన్లు, ముద్దు సీన్లతో నింపేసి యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేసారు. శాల్ పాండే దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ ద్వారా బాలీవుడ్ కి పరిచయమైన జరీన్ ఖాన్ హీరోయిన్. కత్రినా పోలికలతో ఉన్న ఈ బ్యూటీ ఈ సినిమాలో శృంగార రసాన్ని ఓ రేంజిలో పండించింది. ఇంకా కరణ్ సింగ్ గ్రోవర్, డైసీ షా, శర్మాన్ జోషీ నటిస్తున్నారు. గతంలో హేట్ స్టోరీ 2 చిత్రంతో భారీ లాభాలు గడించిన భూషణ్ కుమార్ ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు.. ఈ  సాంగ్ ట్రైలర్ చూసిన వాళ్లకు ఇది కామన్ ఫిల్మా..? బ్లూ ఫిల్మా..? అని ఆశ్చర్యపోతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: