ప్రపంచంలో క్రికెట్ ను అభిమానంచని వారు అంటూ ఎవరూ ఉండరు..ఆటలు అంటే మారు మూల గ్రామాల్లో కూడా ఇప్పుడు క్రికెట్ అడుదామా అన్న స్థాయికి చేరారు పిల్లలు, పెద్దలు. అంతటి ప్రాధాన్యత సంతరించుకుంది.. ఇక భారత దేశంలో క్రికెట్ ఆరాధ్య దైవంగా భావించే వ్యక్తి ఎవరా అంటే సచిన్ టెండుల్కర్.. అలాగా వెస్టిండీస్ లో అంతటి స్థాయి సంపాదించుకున్న క్రికెట్ ఎవరాల అంటే వెంటనే గుర్తుకు వచ్చేది  లారా గుర్తుకు వస్తాడు.

తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు హాలిడే ట్రిప్ భలే స్టార్టయింది. షూటింగ్ కు విరామం ఇచ్చి సెలవులు గడిపేందుకు విదేశాలకు బయలుదేరిన మహేష్ ఫ్యామిలీకి అనుకోని అతిథి ఒకరు ఎదురై సర్ప్రైజ్ ఇచ్చారు. ఫ్యామిలీతో కలిసి హాలీడేస్ కు పారిస్ వెళ్తున్న మహేష్ బాబు అనుకోకుండా లారాతో కలిసి జర్నీ చేశారు. ఇటీవల విదేశాలకు హాలీవుడ్ వెళ్లినపుడు ప్రముఖ క్రికెటర్ బ్రియాన్ లారాను కలిసారు మహేష్ బాబు అండ్ ఫ్యామిలీ. ఈ సందర్భంగా గౌతం లారాతో కలిసి ఫోటో దిగారు. ఈ ఫోటోను ట్విట్టర్ ద్వారా షేర్ చేసి సంతోషం వ్యక్తం చేసారు మహేష్ బాబు. ఈ మూమెంట్ ని అభిమానులతో పంచుకున్న మహేష్ .. తనయుడు గౌతమ్, లారాతో  దిగిన ఓ ఫొటోని షేర్ చేస్తూ .. 'నేను ఇప్పటికీ లారా అభిమానినే' అని ఆనందాన్ని వ్యక్తం చేశారు.

మహేశ్ బాబుకి ఎంతోమంది అభిమానులుంటారు. ఆ అభిమానులు ఆటోగ్రాఫులు, ఫొటోగ్రాఫులు తీసుకుంటుంటారు. మరి.. మహేశ్ బాబు ఎవరికి అభిమాని అంటే? క్రికెట్ ప్లేయర్స్ లో మన భారతీయ ఆటగాళ్లు చాలామందికి మహేశ్ ఫేవరెట్. మరి అలాంటి వ్యక్తి అనుకోకుండా కలిస్తే వారి ఆనందానికి అవధులు ఉండవు కదా అందుకే లారాతో గౌతమ్ నవ్వుతూ ఫోటో దిగాడు. బ్రియాన్ లారాతో గౌతమ్ దిగిన ఫొటోను ట్విట్టర్లో షేర్ చేశాడు మహేశ్.

ఫ్యామిలితో మహేష్ బాబు


హాలిడేస్ ప్రారంభంలో మంచి కిక్ ఇచ్చిన ఫొటో ఇదనీ, జీవితాంతం పదిలంగా దాచుకోదగ్గ ఫొటో అని మహేశ్ బాబు అన్నాడు.రెండు రోజుల క్రితం హైదరాండ్ లో యుప్ టీవీ లాంచింగ్ కార్యక్రమానికి హాజరైన బ్రెయిన్ లారా ఈ రోజు హైదరాబాద్ నుంచి బయలు దేరాడు. అదే ఫ్లైట్ లో ఉన్న మహేష్ బాబు ఫ్యామిలీ అతన్ని చూడగానే కాసేపు అతనితో టైం స్పెండ్ చేసారు. సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ ఫోటో హల్ చల్ చేస్తుంది.

మహేష్ బాబు ట్విట్స్ : 

మరింత సమాచారం తెలుసుకోండి: