‘బాహుబలి 3’ గురించి మీడియాలో వస్తున్న వార్తల పై రాజమౌళి స్పందించాడు. తన ట్విటర్ లో ‘బాహుబలి 3’ ఉండదు అని ట్విట్ చేసిన రాజమౌళి నిన్న ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయం పై పూర్తి క్లారిటీ ఇచ్చాడు. ‘బాహుబలి’ పార్ట్ వన్ లో మొదలైన కథ ‘బాహుబలి 2’ ముగింపుకు వస్తుందని అంటూ క్లారిటీ ఇచ్చాడు. 

అయితే తన దృష్టిలో ‘బాహుబలి’ అనేది ఒక ప్రపంచం అని చెపుతూ ‘బాహుబలి’ సినిమా పూర్తి అయినా ‘బాహుబలి’ పాత్ర మాత్రం సజీవంగా కొనసాగుతూ ఆ పాత్రను ఆధారంగా చేసుకుని ‘బాహుబలి’ 3 లాంటి సినిమాలు చాల తన నుంచి వస్తాయి అని తన అభిప్రాయాన్ని లీక్ చేసాడు రాజమౌళి. ఇదే సందర్భంలో మాట్లాడిన విజయేంద్ర ప్రసాద్ తన కొడుకు మాటలకు అడ్డు వస్తూ ‘బాహుబలి 4-5-6’ ఉన్నా ఆశ్చర్యం లేదు అని అన్నప్పుడు అవును అంటూ రాజమౌళి తన మనసులోని ఉద్దేశ్యాలు బయట పెట్టాడు.

హాలీవుడ్ సినిమా ‘హ్యారీ పోటర్’ సిరీస్ ఎటువంటి సంచలనాలు క్రియేట్ చేసిందో అటువంటి సంచలనాలు సృష్టించడానికి రాజమౌళి తన ‘బాహుబలి’ ప్రపంచాన్ని సృష్టించడానికి సిద్ధం అవుతున్నట్లుగా రాజమౌళి అధికారికంగా వెల్లడించాడు. అయితే ప్రభాస్ పాత్ర ‘బాహుబలి 2’ తో ముగిసి పోతుందని అందువల్ల ‘బాహుబలి 3’ లో ఎవరూ నటిస్తారు అన్నది ఇప్పుడు చెప్పలేనని కామెంట్స్ చేసాడు రాజమౌళి. 

దీనిని బట్టి చూస్తుంటే ‘బాహుబలి 3’ లో మరో ఊహించని ట్విస్ట్ ఉండటమే కాకుండా టాలీవుడ్ కు మరో కొత్త ‘బాహుబలి’ వస్తాడు అని అనుకోవాలి. రాజమౌళి ‘బాహుబలి’ ప్రపంచంతో టాలీవుడ్ లోని ఎంతమంది హీరోలు ‘బాహుబలి’ గా మారుతారో రానున్న కాలం తెలియచేస్తుంది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: