తెలుగు ఇండస్ట్రీలో బాహుబాలి చిత్రంతో ఇటు టాలీవుడ్ అటు బాలీవుడ్ లో విపరీతమైన క్రేజ్ సంపాదించాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ఒక్క సినిమాతోనే ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న హీరో ప్రభాస్..ఇప్పుడు ప్రభాస్ తో యాడ్స్ చేయాంచాలని కార్పోరేట్ సంస్థలు పోటీ పడుతు వచ్చారు.  ఈ మద్య ‘మహీంద్రా’ వెహికల్స్ కి మొదటిసారిగా ప్రభాస్ బ్రాండ్ అంబాసిడర్ గా మారాడు కూడా. అయితే ఆ మద్య హాలీవుడ్ నుంచి కూడా అవకాశాలు వస్తున్నాయని ప్రచారాలు జోరుగా సాగుతున్నాయి.  ఇక పోతే ప్రభాస్ తమ సినిమా కచ్చితంగా చేయాల్సిందేనంటూ కొందరు దర్శకనిర్మాతలు ఆయన్ని ఒత్తిడి చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. అడిగినంత రెమ్యునరేషన్ ఇచ్చేందుకు సైతం సిద్ధపడుతున్నారు.

దేశవ్యాప్తంగా భారీ క్రేజ్ వచ్చిపడడంతో అతనితో సినిమాలు తీస్తే కచ్చితంగా కలెక్షన్ల వర్షం కురుస్తుందన్న నమ్మకంతో దర్శకనిర్మాతలు ప్రభాస్ వెంట పడుతున్నారని తెలిసింది.  అయితే బాలీవుడ్ లో ‘దూమ్ ’ ‘దూమ్ 2’ ‘దూమ్ 3’ సినిమాలకు విపరీతమైన క్రేజ్ లభించింది..ముఖ్యంగా ఈ సినిమాల్లో హీరో కంటే విలన్ వేషం వేసిన వారికే పెద్ద పేరు వచ్చింది. బాలీవుడ్ బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌస్ అయిన యష్ రాజ్ ఫిల్మ్స్ వారు ప్రభాస్ ని ‘ధూమ్ 4’లో విలన్ రోల్ కోసం అప్రోచ్ అయ్యారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఒక వేళ ‘దూమ్ 4’ లో మనోడు నటిస్తే అందులోనూ విలన్ గా ఇండియాలో ప్రముఖ నటుడిగా ఎదిగే అవకాశాలు ఉన్నాయంటున్నారు టాలీవుడ్ వర్గాలు.

బాహుబలి చిత్రంలో ప్రభాస్


దీనిపై స్పందించిన ప్రభాస్ తను  ‘ధూమ్ 4’ నటించడం లేదని తెల్చి చెప్పారు.. వాస్తవానికి బాలీవుడ్ నుంచి అనేక ఆఫర్లు వస్తున్న మాట వాస్తవమే అని అయితే ప్రస్తుతం తనకు ఇంతగా గుర్తింపు తెచ్చిన బాహుబలి 2 సినిమా షూటింగ్ లో నిమగ్నమై ఉన్నందున్న ఎలాంటి ఆఫర్లు వచ్చినా స్వికరించే పరిస్థితిలో లేనని అన్నారు. ప్రస్తుతం బాహుబలి 2  దాదాపు 40 శాతం పూర్తియిందని మిగత 60 శాతం ఎంత వీలైనంత త్వరగా కంప్లీట్ చేయాలని చూస్తున్నారు రాజమౌళి అందుకు పూర్తి సహకారం ఇచ్చేందుకు రెడీగా ఉన్నారు నటీనటులు.

దూమ్ సీక్వెల్ చిత్రాలు 


ఈ నేపథ్యం వేరే సినిమాల్లో ఆఫర్ చేయడానికి సిద్దంగా లేనని తేల్చి చెప్పాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. గతంలో ఈ సినిమా కోసం రెండున్నర సంవత్సరాలు కష్టపడ్డాడు..ఆ సమయంలో తన పెళ్లి కూడా క్యాన్సల్ చేసుకున్నట్లు సమాచారం. ఏది ఏమైనా ‘బాహుబలి 2 ’ విడుదల తర్వాత ప్రభాస్ మరోసారి సంచలన హీరోగా మారడం ఖాయం. దీంతో బాలీవుడ్ నుంచి అవకాశాలు వాటంతట అవే వస్తాయని అనుకుంటున్నారు సినీ వర్గాలు. 


మరింత సమాచారం తెలుసుకోండి: