ఛార్మీ అంటే కేవలం అందాల ప్రదర్శనకు తనకు ఎప్పుడూ అభ్యంతరం లేదన్నట్లుగా తెర మీద అభిమానులకు విందు వడ్డిస్తూ ఉండే హీరోయిన్‌ మాత్రమేకాదు.. తన మనసులో ఉన్నది ఉన్నట్లుగా బయటకు చెప్పేసి.. వివాదాస్పద రొమాంటిక్‌ కామెంట్లతో తరచూ వార్తల్లో నిలుస్తూ ఉండే బోల్డ్‌ ఉమన్‌ కూడా! అలాంటి ఛార్మి ఇప్పుడు ఓ పురుష పుంగవుడిని చూసి తాను అస్సలు తాళలేకపోయానని.. 'అబ్బ ఎంత హాట్‌ గా ఉన్నాడో' అని.. తనను చాలా రెచ్చగొట్టేసినట్లుగా కామెంట్లు పంచుకుంది. అయితే ఘనమైన అందాల నిన్నటితరం నాయిక ఛార్మీని అంతగా టెంప్ట్‌ చేసిన మగాడు ఎవడో తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది కదా! 


సదరు కండలు తిరిగిన గండరగండడు, సిక్స్‌ ప్యాక్‌తో మాత్రమే కాదు.. తన కంటిచూపుతో కూడా అమ్మాయిలను ఉడుకెత్తి పోయేలా చేయగల మొనగాడు మరెవరో కాదు.. గేం ఆఫ్‌ త్రోన్స్‌ లో ఖల్‌ డ్రోగో పాత్రలో నటించిన జేసన్‌ మొమొవా! అతణ్ని చూస్తే చాలు ఛార్మీ అసలు తాళలేకపోతున్నట్లున్నది. 


అతని ఫోటోను తన సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్స్‌లో షేర్‌ చేస్తూ.. 'అతనంటే పడి చచ్చిపోతున్నా.. అస్సలు తాళలేకపోతున్నా.. అబ్బా.. ఏం కళ్లు.. ఏం చిరునవ్వు.. ఏం చూపులు.. గుచ్చేసుకుంటున్నాయి..' అని అర్థం వచ్చేలాగా కామెంట్లు పెట్టింది. 


సరదాసరదాగా సినీ ఫంక్షన్ల వేదికల మీదనుంచి కూడా బూతులు మాట్లాడేయడం, తద్వారా తను చాలా బోల్డ్‌ ఉమన్‌ను అనే ఇంప్రెషన్‌ క్రియేట్‌ చేయడం, ఇటీవలి కాలంలో అన్నీ.. బోల్డ్‌ పాత్రలనే ఎంచుకుంటూ వస్తున్న ఛార్మీని ఇంతగా వేడెక్కించాడంటే.. జేసన్‌ మొమోవా.. అమ్మాయిల మనసులు దోచేసే రేంజిలోనే ఉంటాడని అనుకోవాల్సిందే. 


మరింత సమాచారం తెలుసుకోండి: