తెలుగు ఇండస్ట్రీలో బాల నటుడిగా వెండితెరకు పరిచయం అయిన ఆలీ..తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా, కమెడియన్ గా, హీరోగా తనకంటూ ఓ ప్రత్యేకత చాటుకున్నాడు.  ఆలీ ఈ మద్య బుల్లితెరపై యాంకర్ అవతారమెత్తాడు..అంతే కాదు సినిమా ఈవెంట్స్ కి కూడా వ్యాఖ్యాత గా వ్వవహరిస్తున్నాడు. ఇక సినిమాలో సీనియర్ హాస్యనటుడిగా మంచి పేరు ఉన్నా..ఇప్పుడు ఆలీ అంటే యాంకర్లు, కొంత మంది హీరోయిన్లు చిర్రెత్తిపోతున్నారు.

ఈ మద్య ఆలీ కుళ్లు జోక్స్, చెత్త కామెంట్స్ తో డబుల్ మీనింగ్ మాటలు మాట్లాడుతూ.. యాంకర్లను, హీరోయిన్లను ఇబ్బంది పెడుతన్నాడు..ఆ మద్య తోటి యాంకర్ పై కామెంట్స్ చేసి తర్వాత తిట్టించుకున్న సందర్భాలూ ఉన్నాయి. మరో ఆడియో ఫంక్షన్లో సమంత నడుం ‘బెజవాడ బెంజ్ సర్కిల్’ లా ఉందని కామెంట్ చేశాడు..తర్వాత మరో యాంకర్ శ్యామలపై కామెంట్ చేశాడు..తర్వాత రాశీఖన్నా,రకూల్ ప్రితిసింగ్ ఇలా చెత్త డైలాగ్స్, చెత్త కామెంట్స్ చేశాడు..అప్పుడు నవ్వుకోవడానికి బాగున్నా తర్వాత వాటిపై వచ్చే విమర్శలు చూసి యాంకర్లు, హీరోయిన్లు మానసికంగా భాదపడ్డట్టు తెలుస్తుంది. 


మొన్న ఆదివారం ‘సైజ్ జీరో’ చిత్రానికి సంబంధించి ఆడియో ఫంక్షన్లో..ఆలీ అనుష్క తొడలపై కామెంట్ చేశాడు.. ఈ వ్యాఖ్యలపై మహిళలు మండిపడుతున్నారు. 'అనుష్క తొడలు' అంటూ ఆలీ పెద్ద చర్చకు తెర లేపాడు. అనుష్క తొడలు అద్భుతమని ఆ తొడలంటే తనకు ఎంతో ఇష్టమని చేసిన ఆలీ వ్యాఖ్యలపై మండిపడుతూ హైదరాబాద్ కు చెందిన ఆశ అనే ఓ యువతి ఫైరయింది. ఇలాంటి అసభ్యకర కామెంట్స్ చేస్తూ అవమానపరిస్తే మహిళ సంఘాలతో ఆలీ అంతు చూస్తామంటూ ఓ వీడియో చేసి నెట్ లో పెట్టింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ నెట్ వర్క్ లో తెగ హల్ చల్ చేస్తుంది. 


అనుష్కపై కామెంట్ చేస్తున్న ఆలీ


ఆలీ చేస్తున్న ప్రొగ్రామ్స్ నేరుగా టీవీల్లో లైట్ ప్రోగ్రామ్స్ కాబట్టి కుటుంబ సభ్యులతో చూస్తూ ఉంటామని అలాంటి ఇలా చెత్త మాటలు మాట్లాడితే పిల్లలు, తల్లిదండ్రులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. మరోసారి ఆలీ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే..మహిళ సంఘాలతో ఆలీ అంతు చూస్తామని ఆ యువతి హెచ్చరించింది. ఆ మద్య అన్నపూర్ణ సుంకరి అనే యువతి   'ఆలీ మనిషా..దున్నపోతా..' అంటూ ఘాటు పదజాలం వాడిన సంగతి తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: