అక్కినేని నట వారసుడు అక్కినేని అఖిల్ సినిమా నిన్ననే సెన్సార్ క్లియరెన్స్ కూడా సంపాధించింది. ఇక దీపావళికి రిలీజ్ చేయడమే తరువాయి. అయితే అఖిల్ సినిమాకు అక్కినేని అఖిల్ కు ఎంత ప్రెస్టీజియస్ ప్రాజెక్టో అలానే అందులో హీరోయిన్ గా చేసిన సయేషా సైగల్ కి కూడా అంతే ఇంపార్టెంట్. సినిమాలో నటించి లక్కీ చాన్స్ కొట్టేసింది ఎవరో కాదు బాలీవుడ్ దేవదాసు దిలీప్ కుమార్ మనువరాలే. సినిమా ఫ్యామిలీ నుండే వచ్చిన సయేషాకు కూడా ఈ సినిమా చాలా ప్రెస్టీజియస్ అని చెప్పాలి. సినిమా హిట్ అఖిల్ కు ఎంత అవసరమో అదే విధంగా సయేషాకు కూడా అవసరం.


వి.వి.వినాయక్ డైరక్షన్లో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమాలో అక్కినేని అఖిల్ కి మంచి జోడీగా నటించి అలరించింది సయేషా సైగల్. సినిమా ఫ్యామిలీనే కాబట్టి ఈ లొకాలిటీ అంతా తనకు చిన్నప్పటినుండి అలవాటే. అయితే సినిమా రిలీజ్ అయిన పోస్టర్స్, ట్రైలర్స్ లో అమ్మడు కూడా బాగా ఆకట్టుకుంది. అఖిల్ సినిమాలో అక్కినేని అఖిల్ ని మాత్రమే చూస్తారు కాని సినిమాలో ఆడియెన్స్ తన మీద కూడా ఓ చూపు వేసేలా చేసుకుంది ఈ హాట్ బ్యూటీ. మొదటి సినిమానే కాబట్టి కొంచం మొహమాట పడ్డా అమ్మడి అందానికి కాస్త స్పైసీ యాడ్ చేస్తే మాత్రం అదిరిపోయినట్టే.


అఖిల్ సినిమాలో అఖిల్, సయేషా సైగల్ :


ప్రస్తుతం తెలుగు సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీకి మరో స్టన్నింగ్ ఆఫర్ వచ్చిందని సమాచారం. బాలీవుడ్ ఎనర్జీ హీరో అజయ్ దేవ్ గన్ సినిమాలో హీరోయిన్ గా లక్కీ చాన్స్ కొట్టేసిందట సయేషా సైగల్. మొదటి సినిమా అఖిల్ తో రెండో సినిమా ఏకంగా అజయ్ దేవ్ గన్ తో చాన్స్ కొట్టేసి సూపర్బ్ ఎంట్రీ ఇచ్చింది సయేషా. శివాయ్ అనే టైటిల్ తో వస్తున్న ఈ బాలీవుడ్ సినిమాను అజయ్ తన సొంతంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇంకో విశేషం ఏంటంటే శివాయ్ సినిమాకు దర్శకత్వం కూడా చేస్తున్నాడు అజయ్ దేవ్ గన్..


మరి రెండో సినిమానే బాలీవుడ్ స్టార్ హీరోతో చాన్స్ కొట్టేసిన సయేషా అఖిల్ సినిమా తర్వాత టాలీవుడ్ స్టార్ హీరోల సరసన కూడా నటించే చాన్స్ కొట్టేస్తుందనడంలో సందేహం లేదు. ప్రస్తుతం దీపావళికి రానున్న అఖిల్ సినిమా ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో అనే టెన్షన్లో ఉంది ఈ అమ్మడు. మరి అమ్మడు టాలీవుడ్ ఫేట్ ని డిసైడ్ చేసే అఖిల్ సినిమా రిజల్ట్ ఎలా ఉందో తెలుసుకోవాలంటే ఇంకో వారం రోజులు వెయిట్ చేయాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: