ఎన్నో అంచనాలతో నిన్న విడుదలైన ‘అఖిల్’ అక్కినేని అభిమానులకే షాక్ గా మారడంతో ప్రస్తుతం అఖిల్ అభిమానులు మౌనంగా ఉన్నారు. అయితే ఈసినిమా ఈ పరిస్థుతులలో ఈ సినిమా నెగిటివ్ టాక్ తెచ్చుకోవడానికి నాగార్జున మితిమీరిన జోక్యంతో పాటు వినాయక్ చేసిన తన శక్తికి మించి చేసిన  ప్రయత్నాలు అనే కామెంట్స్ ప్రస్తుతం ఫిలింనగర్ లో హడావిడి చేస్తున్నాయి. ఈ సినిమా పై విశ్లేషకులు చెపుతున్న అభిప్రాయం ప్రకారం మినిమమ్ గ్యారంటీతో  సినిమాలు తీసే వినాయక్ పై అతడి శక్తికి మించిన బరువును పెట్టడంతో అఖిల్ కు ఈ దుస్థితి వచ్చింది అనే కామెంట్స్ వస్తున్నాయి. 

దర్శకుడు వినాయక్ తన సినిమాలలో అద్భుతాలు ఏమీ చేయడని కేవలం కామన్ ప్రేక్షకులకు ఏమి కావాలో అది చూసుకుంటూ తీసే సమర్ధ మాత్రమే వినాయక్ ఉందని అయితే అటువంటి దర్శకుడికి ఒక సెలబ్రెటీ కుటుంబ వారసుడిని పరిచయం చేసే భారీ బాధ్యత పెట్టి  తప్పు చేసారు అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. సామాన్యంగా వినాయక్ సినిమాలో కనిపించే మాస్ అంశాలు కూడ అఖిల్ సినిమాలో సరిగా కుదరక పోవడంతో ప్రేక్షకులు అసలు తాము చూస్తున్నది వినాయక్  సినిమాయేనా అనే అనుమానంలోకి వెళ్ళిపోయారు అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. 

అంతేకాదు ‘అఖిల్’ సినిమాచూస్తున్న ప్రేక్షకులకు ఏదో  తెలియని లోపం ‘అఖిల్’ సినిమాలో ఉన్నట్లు ఫీల్ అవుతున్నట్లు టాక్. అసలు ఈ సినిమా కథలో ఒకటి రొటీన్ లవ్ ట్రాక్ అయితే,  రెండవది ప్రధానమైన జువా ట్రాక్. కానీ జువా ట్రాక్ మొత్తం పసలేకుండా తయారు కావడానికి నాగార్జున తీసుకున్న అతి జాగ్రత్తలు అనే మాటలు వినిపిస్తున్నాయి. ఫిలిం నగర్ లో వినపడుతున్న వార్తల ప్రకారం ఈ జువా ట్రాక్ ను వినాయక్ కాస్త వివరంగానే చిత్రీకరించినట్లు తెలుస్తోంది. 

అయితే సినిమా ఫైనల్ ప్రొడక్ట్ తయ్యారు అయ్యాక ఈ నిడివిని చూసి భయపడిన నాగార్జున కత్తెరను తన చేతిలోకి తీసుకుని అనాలోచితంగా చేసిన ఎడిటింగ్ ఈ సినిమాను దెబ్బతీసింది అనే మాటలు వినిపిస్తున్నాయి. ఇది ఇలా ఉండగా వినాయక్ ‘బహుబలి’ గ్రాఫిక్స్ స్థాయిలో ‘అఖిల్’ గ్రాఫిక్స్ ఉండేలా చేసిన ప్రయత్నం వికటీంచడం కూడా అఖిల్ కు శాపంగా మారింది అనే కామెంట్స్ ఉన్నాయి. అదీ కాకుండా వినాయక్ కు రెగ్యులర్ ఫార్మాట్ సినిమాలు తీసే సత్తా వుంది కానీ, ఇలాప్రయోగాలు చేసే సత్తా లేదు అంటూ విమర్శకులు కామెంట్ చేస్తున్నారు. ఈ వార్తలు ఇలా ఉండగా అఖిల్ సినిమాకు వచ్చిన మొదటి రోజు కల్లెక్షన్స్ 9 కోట్లు కావడంతో ఒక కొత్త  హీరో సినిమాకు ఈ స్థాయిలో కలెక్షన్స్ రావడం మరీ నిరాశ పడ నక్కర లేదు అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా ‘అఖిల్’ షాక్ లో అక్కినేని కుటుబం ఉంది  అని ఫిలింనగర్ టాక్..  


మరింత సమాచారం తెలుసుకోండి: