గడ్డం పెంచడం ఇప్పుడు ఇండస్ట్రీలో హీరోలకి ఫాషన్ గా మారింది, మా హీరో గడ్డం బాగుంది అంటే మా హీరో గడ్డం బాగుంది అంటూ కొట్టుకుంటున్నారు ఫాన్స్ కూడా , ఎవరి గడ్డo కథాకమామిషీ ఏంటో ఇప్పుడు చూద్దాం.

 

 

 

1 పవన్ కళ్యాణ్ : ఈ మధ్య భారీగా సింహం జూలు లాగా గడ్డం పెంచి ఫేమస్ అయిన పవన్ కళ్యాణ్ అంతకు ముందు కూడా ఫుల్ గా గడ్డం పెంచి మరీ పంజా సినిమాలో నటించారు. ఆ సినిమా ప్లాప్ అయినా గడ్డం లుక్ లో పవన్ కనిపించడం బాగా ఫేమస్ అయ్యింది.

 

 

 

 

2 అల్లూ అర్జున్ : రుద్రమదేవి సినిమా కోసం గడ్డం పెంచిన బన్నీ గోన గన్నా రెడ్డి నిజంగా బతికున్నప్పుడు ఇలాగే ఉండేవాడా అన్నట్టుగా అనిపించాడు. గుర్రం మీద ఒక తెలంగాణా వీరోచిత యోధుడు రావడం లో కనిపించే స్టైల్ బన్నీ కి గడ్డమే ఇచ్చింది.

 

 

 

3 నాగార్జున : సినిమాల్లో అక్కడక్కడా గడ్డం తో కనిపించే నాగార్జున బయట ఫంక్షన్ లలో ఫ్రెంచ్ కట్ తో వివిధ స్టైల్ గడ్డాలతో కనిపిస్తారు .

 

 

4 రాం చరణ్ : మొదటి సినిమా నుంచీ లైట్ గడ్డంతో కనిపిస్తున్న రాం చరణ్, గడ్డం లేకపోతే అసలు బాగోడు అంటారు అభిమానులు. ఆరెంజ్ సినిమాలో ఫ్లాస్ బ్యాక్ ఎపిసోడ్ లో గడ్డం మీసం గీసేసిన రాం చరణ్ అసలు సెట్ కాలేదు . తరవాత సినిమాల్లో ఎక్కడా గడ్డం గీకి కనపడలేదు

 

 

 

5 ఎన్టీఆర్ : నాన్నకు ప్రేమతో సినిమా కి మొదటి ఆకర్షణే తారక్ గడ్డం అని చెప్పాలి. వర్కింగ్ స్టిల్స్ లీక్ అయినప్పటి నుంచీ ఎన్టీఆర్ ని గడ్డంలో చూసి ఫుల్ ఫిదా అయిపోయారు అభిమానులు. తెరమీద తన గడ్డంతో ఎన్టీఆర్ ఎలాంటి కొత్త అనుభూతి ఇస్తాడో చూడాలంటె సంక్రాంతి వరకూ ఆగాల్సిందే

 


మరింత సమాచారం తెలుసుకోండి: