చిరంజీవి కాలం నుంచీ నైజాం ఏరియా హీరోలకి ఒక పెద్ద సవాలే, ఆ ప్రాంతంలో ఎవరు సినిమా ఎక్కువ కి అమ్ముడు పోతే ఎవరు సినిమా అక్కడ ఎక్కువ కలక్షన్ లు రాబడితే ఆ హీరో కి పెద్ద హీరో హోదా రావడం ఆదరకొట్టే హీరో అయిపోవడం చాలా సాధారణ విషయం. ఇప్పటికీ అదే నడుస్తోంది.


నైజాం లో లోఫర్ సినిమా ఏడున్నర కోట్లకి కొన్నారు అన్న విషయం ఇప్పటికే ప్రకటించాం. నైజాంలో డిస్ట్రిబ్యూషన్ అంటే మనకి గుర్తొచ్చేది దిల్ రాజు, ఆయన ఆ ప్రాంతంలో తనకంటూ ఒక పర్ఫెక్ట్ మార్క్ పెట్టుకుని మరీ ఎలేస్తున్నాడు. ఆ ప్రాంతంలో సినిమాలు అంటే దిల్ రాజుకే వెళతాయి కానీ ఈ మధ్య కాలం లో దిల్ రాజు కి షాక్ ఇస్తూ "అభిషేక్ పిక్చర్స్" కి శ్రీమంతుడు చేరింది, దిల్ రాజు చెప్పిన రేట్ నచ్చకపోవడం తో సినిమాకి సహా నిర్మాత అయిన మహేష్ బాబు స్వయంగా అభిషేక్ కి ఈ సినిమాని అప్పజెప్పాడు.

  

వరసగా 1 నేనోక్కడినే, ఆగడు సినిమాలు ప్లాప్ అవ్వడంతో మహేష్ బాబు కి దిల్ రాజు తక్కువ రేట్ చెప్పి తరవాత నాలిక కరుచుకున్నారు. మొత్తానికి శ్రీమంతుడు సినిమా మాత్రం అభిషేక్ పిక్చర్స్ కి చేరడం మంచి హిట్ సాధించడం జరిగింది కూడా. అయితే మహేష్ కి పెట్టినట్టు గా అంత అమౌంట్ ని వరుణ్ తేజ్ మీద పెట్టడం మాత్రం దారుణం అంటున్నారు విశ్లేషకులు. ఏడు కోట్లు వరుణ్ తేజ్ మీద చాలా ఎక్కువ ఐదు కోట్లు అంటే ఒకరకంగా పరవాలేదు, అయితే శ్రీమంతుడు ను కూడా ఇదే అభిషేక్ పిక్చర్స్ కొన్నపుడు కూడా ఇలాంటి కామెంట్ లే వినిపించాయని, కానీ లాభం వచ్చిందని, ఇప్పుడు కూడా అదే కావచ్చుగా అన్న సమాధానాలు కూడా వినిపిస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: