ఈ వారం విడుదల కాబోతున్న ‘సైజ్ జీరో’ పై భారీ అంచనాలు ఉన్నాయి. పివిపి నిర్మాణ సంస్థ దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కొడుకు కోడలు కలిసి అనుష్కతో చేస్తున్న ఈ ప్రయోగం ఎంత వరకు సక్సస్ అవుతుంది అన్న ఆ శక్తి అందరిలోనూ ఉంది. ఈ సినిమా స్టోరీ పరంగా బాగా రావడమే కాకుండా మంచి మెసేజ్ కూడ ఉండటంతో ఈసినిమా సూపర్ హిట్ అవుతుందని పివిపి సంస్థ భారీ అంచనాలు పెట్టుకుంది. 

అయితే ఇంత భారీ అంచనాలు ఉన్నా ఈ సినిమాకు అనుకున్న విధంగా బయ్యర్లు స్పందించలేదు అనే టాక్ ఫిలింనగర్ లో వినపడుతోంది. అదేవిధంగా ఈసినిమా శాటిలైట్ రైట్స్ కూడ ఇంకా అమ్మకం కాలేదు అని అంటున్నారు. దీనితో ఈసినిమాను పివిపి నిర్మాణ సంస్థ సొంతంగా విడుదల చేస్తోంది అనే వార్తలు ఫిలింనగర్ లో హడావిడి చేస్తున్నాయి. 

ఇలాంటి పరిస్థుతుల నేపధ్యం వలనే పివిపి సంస్థ ‘బంగారం  లాంటి అవకాశం’ అంటూ కేజి బంగారం స్కీమ్ ని ప్రకటించారు అనే టాక్ ఉంది. అయితే సామాన్యంగా సినిమాలు విడుదలై పరాజయం చెందిన తరువాత ఆ సినిమాల కలెక్షన్స్ ను నిలబెట్టడానికి ఆ సినిమా నిర్మాణ సంస్థలు ఇటువంటి లాటరీలు స్కీమ్ లు పెడుతూ ఉంటారు. 

అసలు ఇంతకీ సినిమా విడుదల కాకుండానే ఇలా కేజీ బంగారం ఆఫర్ ను ప్రకటించి పివిపి మరో కొత్త పబ్లిసిటీ టెక్నిక్ కు శ్రీకారం చుట్టారు అన్న వార్తలు వస్తున్నాయి. చెక్కు బుక్ ఉన్న ప్రతివ్యక్తి నిర్మాత కాలేదు అని ఈమధ్య సంచలన వ్యాఖ్యలు చేసిన పొట్లూరి ప్రసాద్ ప్రస్తుతం మహేష్, నాగార్జునలతో సినిమాలు తీస్తూ రానున్న ఆరు నెలల్లో 9 సినిమాలను మొదలు పెడుతున్నాను అని పొట్లూరి చెప్పారు అంటే ప్రస్తుతం టాలీవుడ్ లో పివిపి హవా ఏ స్థాయిలో ఉందో ఎవరికైనా అర్ధం అవుతుంది..


మరింత సమాచారం తెలుసుకోండి: