తెలుగు ఇండస్ట్రీలోకి బాల నటుడిగా వెండితెరకు పరిచయం అయిన ఆలీ తర్వాత మంచి కమెడియన్ గా ఎదిగాడు. కొన్ని సినిమాల్లో హీరోగా కూడా నటించినా తర్వాత కామెడి క్యారెక్టర్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. ఈ మద్య బుల్లి తెరపై యాంకర్ గా కూడా వ్యవహరిస్తున్నారు. అంతే కాదు ఆడియో ఫంక్షన్లో కూడా వ్యాఖ్యాతగా అందరిని నవ్విస్తున్నాడు.  ఈ మద్య ఆలీ కుళ్లు జోక్స్, చెత్త కామెంట్స్ తో డబుల్ మీనింగ్ మాటలు మాట్లాడుతూ.. యాంకర్లను, హీరోయిన్లను ఇబ్బంది పెడుతన్నాడు..ఆ మద్య తోటి యాంకర్ పై కామెంట్స్ చేసి తర్వాత తిట్టించుకున్న సందర్భాలూ ఉన్నాయి.

మరో ఆడియో ఫంక్షన్లో సమంత నడుం ‘బెజవాడ బెంజ్ సర్కిల్’ లా ఉందని కామెంట్ చేశాడు..తర్వాత మరో యాంకర్ శ్యామలపై కామెంట్ చేశాడు..తర్వాత రాశీఖన్నా,రకూల్ ప్రితిసింగ్ ఇలా చెత్త డైలాగ్స్, చెత్త కామెంట్స్ చేశాడు. అంతే కాదు ఆ మద్య ‘సైజ్ జీరో’ చిత్రానికి సంబంధించి ఆడియో ఫంక్షన్లో..ఆలీ అనుష్క తొడలపై కామెంట్ చేశాడు.. ఈ వ్యాఖ్యలపై మహిళలు మండిపడుతున్నారు. 'అనుష్క తొడలు' అంటూ ఆలీ పెద్ద చర్చకు తెర లేపాడు. అనుష్క తొడలు అద్భుతమని ఆ తొడలంటే తనకు ఎంతో ఇష్టమని చేసిన ఆలీ వ్యాఖ్యలపై తీవ్ర కలకలం చోటు చేసుకుంది.

ఆలీ కామెంట్స్ చేసిన సెలబ్రెటీలు


తాజాగా దీనిపై అనుష్క స్పందించింది.. అలీ నాకు మంచి మిత్రుడని ,అతడు కావాలని చేసిన కామెంట్ కాదని అతడు ఎలాంటి వాడో ,అతడి కుటుంబం ఎలాంటిదో నాకు బాగా తెలుసనీ చాలా క్యాజువల్ గా అన్న మాటలు పెద్ద వివాదం అయ్యాయని ఆ వ్యాఖ్యలను తేలిగ్గా కొట్టి పారేసింది. అయితే అనుష్క ఇలా అంటున్నా ఈ వివాదం మాత్రం ఆలీపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అంతే కాదు మనోడో ఓ టీవీ చానల్ లో ఈ విషయంపై క్షమాపణలు కూడా చెప్పాడు.  


మరింత సమాచారం తెలుసుకోండి: