తెలుగు ఇండస్ట్రీలో సంచలన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న రాంగోపాల్ వర్మ ఇప్పటి వరకు తెలుగు హీరోలపై కామెంట్స్ చేస్తూ ట్విట్టర్ లో తన అభిప్రాయాలను పెడుతున్నారు.అయితే ఆయన తన అభిప్రయాలను నిర్మోహమాటంగా చెప్పేస్తుంటారు. ఆ మద్య పవన్ కళ్యాన్, మహేష్ బాబు లపై చేసిన కామెంట్స్ తో అభిమానులు ఆయనకు శవయాత్ర అంటూ ఫేస్ బుక్ లో శ్రద్దాంజలి ఫోటో పెట్టి హల్ చల్ చేశారు. దానికి కౌంటర్ గా ఆయన కూడా ఆ ఫోటోను షేర్ చేశారు.

ఇలా ఎప్పుడూ వివాదాల్లో మునిగిపోయే దర్శకుడు ఇప్పుడు బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.  నిన్న ఢిల్లీలోని రామ్‌నాథ్ గోయంకా ఎక్స్‌లెన్స్ ఇన్ జర్నలిజం అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్న అమీర్ మాట్లాడుతూ.. దేశంలో జరుగుతున్న పలు సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇదే విషయం నా భార్య కిరణ్‌రావ్ పలుమార్లు నాతో చర్చించింది. ఓ దశలో ఈ దేశం వదిలి వెళ్దామని ప్రతిపాదించిందని పేర్కొన్నారు. అసలు అసహనం అంటే అర్థమేమిటో వాళ్లకు సరిగా తెలుసా అని ప్రశ్నించారు. భారత దేశంలో ఎక్కువ మంది హిందువులు ఉన్నారు.

అమీర్ ఖాన్, కిరణ్ రావ్


గత కొంత కాలంగా అసహనం గురించి మాట్లాడుతున్న సల్మాన్ ఖాన్, షారూఖ్ ఖాన్, అమీర్ ఖాన్ వీరంతా ముస్లిం హీరోలు. అయినా కూడా ముగ్గురు ఖాన్‌లు స్టార్లుగా కొనసాగడమే ప్రజల సహనానికి నిదర్శనం. దేశంలో మరి అసహనం ఎక్కడ ఉందో నాకు అర్థం కావడం లేదు. అసహనంపై కొందరు ప్రముఖులు ఫిర్యాదు చేస్తున్నరు. ప్రజల మనోభావాలు దెబ్బతినేలాంటి అంశాలపై డ్రాయింగ్ రూం చర్చల ద్వారా వారి పాపులారిటీ పెరుగుతదేమో కానీ స్టార్ల స్పందనతో మతాల మధ్య అంతరం మాత్రం పెరుగుతదని ఆయన పేర్కొన్నారు. అభిమానులు హీరోలు అంటే చాలా అభిమానిస్తారు వారు మాట్లాడే మాటల పై కూడా ప్రభావం ఉంటుందని వారు అర్ధం చేసుకొని మాట్లాడితే బాగుంటుంది అని సూచించారు. 

రాంగోపాల్ వర్మ ట్విట్స్ : 

మరింత సమాచారం తెలుసుకోండి: