ఈ మద్య కాలంలో ‘అసహనం’ మీద తీవ్ర సంచలనాలు నాంది పలుకుతున్నాయి. గతంలో షారూఖ్ కాన్ తన పుట్టిన రోజున అసహనం గురించి మాట్లాడాడు అందుకే అవార్డులు వెనక్కి ఇచ్చేస్తున్నారు అని కామెంట్ చేశాడు. దీంతో యావత్ భారత దేశం షారూఖ్ ఖాన్ పై విరుచుకు పడింది. అసహనం ఉన్న భారతీయులైతే ఒక ముస్లిం నటుడిని నెత్తిన ఎందుకు పెట్టుకుంటుంది అని వాదించారు. దీనిపై సెలబ్రెటీలు కూడా బాగా స్పందించారు. ఇక  ఢిల్లీలోని రామ్‌నాథ్ గోయంకా ఎక్స్‌లెన్స్ ఇన్ జర్నలిజం అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్న అమీర్ మాట్లాడుతూ.. దేశంలో జరుగుతున్న పలు సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి.

ఇదే విషయం నా భార్య కిరణ్‌రావ్ పలుమార్లు నాతో చర్చించింది. ఓ దశలో ఈ దేశం వదిలి వెళ్దామని ప్రతిపాదించిందని పేర్కొన్నారు. అసలు అసహనం అంటే అర్థమేమిటో వాళ్లకు సరిగా తెలుసా అని ప్రశ్నించారు. భారత దేశంలో ఎక్కువ మంది హిందువులు ఉన్నారు. గత కొంత కాలంగా అసహనం గురించి మాట్లాడుతున్న సల్మాన్ ఖాన్, షారూఖ్ ఖాన్, అమీర్ ఖాన్ వీరంతా ముస్లిం హీరోలు. అయినా కూడా ముగ్గురు ఖాన్‌లు స్టార్లుగా కొనసాగడమే ప్రజల సహనానికి నిదర్శనం. దీనిపై తెలుగు నటులు, దర్శకులు కూడా తీవ్రస్థాయిలో విమర్శించారు. తాజాగా బాలీవుడ్ సీనియర్ నటి రవీనా టాండన్ కూడా అమీర్ పై విరుచుకుపడింది.

అమీర్ ఖాన్, కిరణ్ రావ్


అమీర్ కామెంట్స్ ఆ తర్వాత ముందు పరిస్థితులపై తన అభిప్రాయాన్ని ట్విట్టర్ ద్వారా పంచుకుంది రవీనా. నరేంద్ర మోడీ  ఇండియా ప్రధాని కావడం  ఇష్టం లేని వాళ్లంతా  కలిసి.. ఇపుడు ఇండియా పరువు తీసే పని పెట్టుకున్నారని తేల్చేసింది. ఇందుకు ఒక న్యూస్ లింక్ ను కూడా షేర్ చేసింది.  "మోడీ ప్రధాని అయ్యాక పరిస్థితులతో ఇండియాలో బతకలేమని అనేవారు.. ముంబై దాడులప్పుడు ఏమయ్యారు. ముంబైపై బాంబు దాడుల సమయంలో ఏమైపోయారు..." అని నేరుగా ప్రశ్నించింది రవీనా. ఇండియా నీకు చాలా ఇచ్చింది.. నువ్వు ఇండియాకి ఏమిచ్చావ్ అని ప్రశ్నించుకోమంటూ అగ్గిమీద గుగ్గిలం అయింది రవీనా టాండన్.


మరింత సమాచారం తెలుసుకోండి: