తెలుగు,తమిళ ఇండస్ట్రీలో మంచి ఫామ్ లో కొనసాగుతున్న హాట్ బ్యూటీ హన్సిక. చిన్నప్పుడు బాల తారగా బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. తర్వాత తెలుగు, తమిళ ఇండస్ట్రీలో అగ్ర హీరోలతో నటిస్తూ తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ సంపాదించింది.  పాలబుగ్గల హన్సిక ప్రస్తుతం తమిళ్ లో వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.  హీరో విజయ్ తో ఈ మద్య ‘పులి’ సినిమాలో సెకండ్ హాఫ్ లో కనిపించి కుర్రాళ్ల మతులు పోగొట్టింది.  తాజాగా  ఉదయనిధి స్టాలిన్ సరసన జాలీ ఎల్ ఎల్ బి అనే చిత్రంలో నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబాయి పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది.

ఇప్పుడు అక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి..దీంతో అక్కడ ఊహించన విధంగా వరదలు ముంచెత్తాయి.  నగరం అల్లకల్లోలం అయిపోయిన పరిస్థితి. అనుకోని సంఘటనతో అందరూ టెన్షన్ కి గురయ్యారు. ఇక హన్సిక పరిస్థితి మరీ దారుణం. ఒక రోజు మొత్తం వరద నీటిలోనే ఇరుక్కుపోయారు. మోకాళ్ల లోతు నీటిలో కనీసం గంట పాటు సుదీర్ఘంగా నడక సాగించాల్సొచ్చిందంటే అర్థం చేసుకోవాలి. జాలీ ఎల్ ఎల్ బి షూటింగ్ ముగించుకొని తన  వ్యక్తిగత సిబ్బందితో పాటు తిరుగు పయనం అయ్యింది. అయితే మార్గ మధ్యంలో ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఇకపోతే ముందుకు వెళ్లలేక వెనక్కి వెళ్లలేక మద్యలోనే చిక్కుకు పోయింది.

జాలీ ఎల్ ఎల్ బి చిత్రంలో ఉదయనిధి,హన్సిక 


ఏం చేయాలో పాలుపోని హనీ కాసేపు ఫోన్ లో తనవారికి ప్రొడక్షన్ టీమ్ కి కాల్ చేయాలని ప్రయత్నించింది. కానీ అసలు సిగ్నల్ అన్నదే కనెక్టవ్వలేదు. పైగా కార్ దిగి ఎటైనా నడిచి వెళ్లిపోదామంటే మోకాళ్ల లోతు నీటిలో దిగాల్సిన పరిస్థితి. తనకి   పార్క్ హయత్ లో రూమ్ కేటాయించారు.  అక్కడకు చేరుకోవాలంటే కనీసం గంటా రెండు గంటల టైమ్ పడుతుందట..తప్పని పరిస్థితితో కారు దిగితే మోకాళ్ల లోతు నీటిలో దిగాల్సిన పరిస్థితి. దాంతో ఏదోలా రోడ్డుపై నడుచుకుంటూ వేరొక హోటల్ కి వెళ్లాలనుకుని కార్ దిగింది.  ఎలాగోలా వ్యక్తిగత స్టాఫ్ తో కలిసి ఐటీసీ గ్రాండ్ చోళా హోటల్ కి చేరుకుంది. బతుకు జీవుడా అనుకొని హోటల్ లో విశ్రాంతి తీసుకుందట. 


మరింత సమాచారం తెలుసుకోండి: