సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడూ సంచలనాలకు కేంద్ర బిందువుగా ఉండే దర్శకుడు రాంగోపాల్ వర్మ ఇప్పుడు చిక్కుల్లో పడ్డాడు. గంధపుచెక్కల స్మగ్లర్ వీరప్పన్‌ను మట్టుబెట్టడానికి పోలీసులు ఎలాంటి వ్యూహాలు అనుసరించారు అనే విషయాలను వెల్లడిస్తూ రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న చిత్రం ‘కిల్లింగ్ వీరప్పన్'. డిసెంబర్ 4న తెలుగు, కన్నడం, తమిళంలో విడుదల చేస్తున్నాం అని ప్రకటించారు.  వారంలో విడుదలకు సిద్దమవుతున్న నేపథ్యంలో భారీ షాక్ తగిలింది ఈ చిత్ర నిర్మాతలకు.

 'కిల్లింగ్ వీరప్పన్' సినిమా విడుదల చేయరాదని వీరప్పన్ సతీమణి ముత్తులక్ష్మి డిమాండ్ చేశారు. విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడుతూ...కిల్లింగ్ వీరప్పన్ సినిమాను హిందీలో తెరకెక్కించడానికి మాత్రమే తన నుంచి దర్శకుడు రామ్గోపాల్వర్మ అనుమతి పొందారని చెప్పారు. అయితే కన్నడ, తమిళ భాషల్లో సినిమా తీయడానికి అనుమతి పొందలేదని ఆమె స్పష్టం చేశారు. కిల్లింగ్ వీరప్పన్ సినిమాను హిందీ, తమిళ భాషల్లో మాత్రమే విడుదల చేయాలన్నారు. తాను కిల్లర్వీరప్పన్ చిత్రం చూసిన తరువాతేనే ఆ సినిమా విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

అంతే కాదు  కిల్లింగ్ వీరప్పన్ అనే సినిమా టైటిల్ అభ్యంతరంగా ఉందని ఈ సినిమా ట్రైలర్ చూసినప్పుడు వీరప్పన్ను అవహేళనగా చూపించినట్లు తెలుస్తోందన్నారు. అంతే కాదు కిల్లింగ్ వీరప్పన్ ఓ దొంగ మాత్రమే అని అయితే ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే తన భర్తను నెగెటివ్ గా చూపించారని అమె ఆవేదన వ్యక్తం చేశారు. కిల్లర్ వీరప్పన్ సినిమాను అడ్డుకోవడానికి కోర్టు అనుమతి పొందామని తెలిపారు.

కిల్లింగ్ వీరప్పన్ చిత్రం పోస్టర్


మరోవైపు 2006 సంవత్సరంలోనే రూ. 31 లక్షలు ముత్తులక్ష్మికి చెల్లించి కిల్లింగ్ వీరప్పన్ సినిమా హక్కులు పొందినట్లు కన్నడ సినిమా డైరెక్టర్ ఎ.ఎమ్.రమేశ్ తెలిపారు. శ్రీకృష్ణా క్రియేషన్స్, జెడ్‌త్రీ ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రంలో సందీప్‌ భరద్వాజ్‌, శివరాజ్‌ కుమార్‌, రాక్‌లైన్‌ వెంకటేష్‌, పరుల్‌ యాదవ్‌ ప్రధాన పాత్రలు పోషించారు. బి.వి.మంజునాథ్‌, ఇ.శివప్రకాష్‌, బి.ఎస్‌.సుధీంద్ర నిర్మాతలు.


మరింత సమాచారం తెలుసుకోండి: