బాలీవుడ్ బుల్లి తెరపై సర్కాస్ సీరియల్ లో వచ్చిన షారూఖ్ ఖాన్ తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. షారూఖ్  అంచలంచెలుగా పైకి వచ్చాడు..ఇప్పుడు బాలీవుడ్ లో సూపర్ స్టార్  స్థాయికి వెళ్లాడు.  షారూక్ అద్భుతమైన నటన కనబరుస్తూ.. విమర్శకుల నుంచి  మెప్పును సంపాదించారు. భారత సినీ పరిశ్రమలో ఇప్పటి వరకు అతను పదమూడు ఫిల్మ్ ఫేర్ బహుమతులను గెలుచుకున్నాడు, అందులో ఏడు ఉత్తమ నటుడి వర్గానికి చెందినవి.

షారూఖ్ ఖాన్ సినిమాలు దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే , కుచ్ కుచ్ హోతా హై, చక్ దే ఇండియా , ఓం శాంతి ఓం , రబ్ నే బనా దీ జోడీ  లాంటి సినిమాలో బాలీవుడ్ లో అద్భుతమైన విజయాలు సాధించాయి. షారూఖ్ ఖాన్ ముస్లిం మతస్తుడైనా.. గౌరీ చిబ్బెర్ హిందువుల అమ్మాయి ని 1991 అక్టోబర్ 25న సాంప్రదాయ హిందూ వివాహం చేసుకున్నారు.

ఈ దంపతులకు ముగ్గురు సంతానం కొడుకు ఆర్యన్ , కూతురు సుహానా, చిన్నబ్బాయి అబ్ రామ్.  చిన్నకొడుకు అబ్ రామ్ అంటే షారూఖ్ కి చాలా ఇష్టమట..ఎందుకంటే తన చిన్నప్పుడు అచ్చూ అలాగే ఉండేవాడట షారూక్. బీచ్ లో తన చిన్న కొడుకుతో ఆడుకుంటూ షారూఖ్ కూడా చిన్నపిల్లాడిలా మారాడు..


మరింత సమాచారం తెలుసుకోండి: