హీరోయిన్ ను నైట్ కోసం బుక్ చేసుకున్నారంటే.. వేరే అర్థాలకు వెళ్లకండి.. ఇది నైట్ పార్టీ బుకింగ్ అన్నమాట. హీరోయిన్ ఏంటీ.. నైట్ పార్టీ బుకింగ్ ఏంటీ అనుకుంటున్నారా.. అదేనండీ బాబు.. కొత్త సంవత్సరం వస్తోంది కదా.. డిసెంబర్ 31 సంబరాల కోసం ఈవెంట్ మేనేజర్లు ఇప్పుడు హీరోయిన్ల వెంటపడుతున్నారు. హీరోయిన్ డ్యాన్స్ ఉంటే ఆ న్యూయిర్ పార్టీ కిక్కే వేరు కదా.

హీరోయిన్లు కూడా ఈ న్యూయిర్ బుకింగ్స్ పై ఆసక్తి గా ఉన్నారు. ఎందుకంటే.. ఆ ఒక్క రాత్రి కోసం బాగా డిమాండ్ ఉంటుంది కాబట్టి కోట్లలో వసూలు చేయొచ్చు. మరి ఒక్కరాత్రి సంపాదన అంత హైరేంజ్ లో ఉంటే ఏ హీరోయిన్ మాత్రం కాదంటుంది చెప్పండి. వివిధ రకాల క్లబ్బులు, సంస్థలు, ఇప్పటికే హీరోయిన్లను అడ్వాన్సు గా బుక్ చేసుకుంటున్నాయి. 

హీరోయిన్ల కోసం దేశీయ సంస్థలే కాదు.. విదేశాల నుంచి కూడా నైట్ పార్టీ ఆఫర్లు వస్తున్నాయి. ప్రత్యేకించి యూఎస్, దుబాయ్, అరబ్ ఎమిరేట్స్ వంటి దేశాల్లో న్యూయియర్ పార్టీలకు మంచి డిమాండ్ ఉంది. ఈ న్యూయిర్ బుకింగ్స్ లో మిల్కీ బ్యూటీ తమన్నా కాస్త అడ్వాన్సుడుగానే ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే అమెరికాకు చెందిన ఓ ఈవెంట్ మేనేజింగ్ సంస్థ తమన్నాను డిసెంబర్ 31 రాత్రి కోసం బుక్ చేసుకున్నట్టు తెలుస్తోంది. 

సదరు సంస్థ నార్త్ కరోలినాలో జరిగే డిసెంబర్ 31 రాత్రి వేడుకలకు తమన్నా తో ఓ స్పెషల్ డ్యాన్స్ షో ను ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే తమన్నా పేరుతో టిక్కెట్ల అమ్మకం మొదలైందట. ఒక్కో టిక్కెట్ మన కరెన్సీలో దాదాపు 6 వేల రూపాయల వరకూ ఉందట. సాధారణంగా అందం, అభినయం ఉన్న హీరోయిన్లకు సినిమా ఛాన్సులు త్వరగా వస్తే.. ఈ డిసెంబర్ 31 కోసం మాత్రం కాస్త సెక్సీ ఇమేజ్ ఉన్న తారలకే ఎక్కువ డిమాండ్ ఉంటుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: