‘అఖిల్’ విడుదలై చాల చోట్ల ధియేటర్ల నుండి తీసివేసినా ఆ సినిమా రగిల్చిన రగడ ఇంకా సమసి పోవడంలేదు. ఎదో ఒక విషయమై ఈ సినిమాకు సంబంధించిన వార్తలు ఫిలింనగర్ లో హాట్ టాపిక్ గా మారిపోతూనే ఉన్నాయి. ఇప్పుడు లేటెస్ట్ గా ఈ సినిమా దర్శకుడు వినాయక్ ఈ సినిమా నిర్మాతలు నితిన్ అతడి తండ్రి సుధాకర రెడ్డిల పై ఫిలించాంబర్ లో ఫిర్యాదు ఇవ్వడానికి సిద్ధం అవుతున్నట్లు ఫిలింనగర్ లో గాసిప్పులు వినపడుతున్నాయి. 

ఫిలింనగర్ లో వినపడుతున్న వార్తల ప్రకారం వినాయక్ ఈసినిమా కొనుక్కుని నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లకు 3 కోట్ల వరకు నష్ట పరిహారం ఇస్తానని మాట ఇచ్చిన నేపధ్యంలో వినాయక్ కు ‘అఖిల్’ సినిమా నిర్మాతల నుండి పారితోషికం నిమిత్తం తనకు ఇంకా రావలసిన 4 కోట్ల రూపాయల గురించి వినాయక్ అఖిల్ మూవీ నిర్మతల పై ఒత్తిడి పెంచినట్లు టాక్. 

ఈ సినిమా ప్రారంభం కాకముందు ఈ సినిమా నిర్మాతలు వినాయక్ 12 కోట్ల పారితోషికాన్ని ఆఫర్ చేసి 8 కోట్లు ఇప్పటి వరకు సద్దుబాటు చేసారు అని ఫిలింనగర్ గాసిప్. అయితే ఈసినిమా విడుదలై ఘోరపరాజయం చెందాక ఈసినిమాకు సంబంధించిన నిర్మాతలు నితిన్ కాని అతని తండ్రి సుధాకర్ రెడ్డి కాని తన ఫోన్లకు స్పందించడం లేదని వినాయక్ బాధ పడుతున్నట్లు టాక్.

దీనితో వినాయక్ ఫిల్మ్‌ఛాంబర్‌‌లో ఫిర్యాదు చేసేందుకు రెడీ అవుతున్నాడని వార్తలు గుప్పుమంటున్నాయి. అయితే అఖిల్ ప్రీ రిలీజ్ బిజినెస్  దాదాపు 47 కోట్లయినా ఆ తర్వాత 18 కోట్ల షేర్ కూడ అఖిల్ వసూలు చేయలేకపోవడంతో ఈ సమస్యలు ఏర్పడ్డాయి అని అంటున్నారు. ప్రస్తుతం ఈ టాపిక్ హాట్ టాపిక్ గా మారింది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: