బంగాళాఖాతం అల్పపీడన ప్రభావంతో తమిళనాడులో  భారీ వర్షాలు కురుస్తున్నాయి.. చెన్నైలోని పలు కీలక ప్రాంతాలు జల మయమయ్యాయి. ఎక్కడ చూసినా నీటితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత నెల రోజుల నుంచి కురుస్తున్న వానలతో అక్కడి ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా పోయింది.  రాష్ట్ర ముఖ్యమంత్రి జయలిత ప్రధానమంత్రి నరేంద్ర మోడితో సంప్రదింపులు జరుపుతూనే ఉన్నారు. అంతే కాదు సహాయక చర్యలు ప్రత్యక్షంగా వీక్షిస్తున్నారు.

మరోవైపు తమిళ సినీ తారలు కూడా బాధితులను ఆదుకోవడానికి నడుంబిగించారు. తమ అభిమాన సంఘాల వారికి వరదబాధితులను ఆదుకోమని ట్విట్టర్ల ద్వారా, ఫేస్ బుక్ ల ద్వారా తెలియజెప్పారు. ఇప్పటికే హీరోలు సిద్దార్థ, లారెన్స్ ప్రత్యక్షంగా సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. లారెన్స్ పది లక్షల ఆర్థిక సహాయం అందించారు..తమిళ హీరో సూర్య కూడా 25 లక్షలు, రజినీకాంత్ 10 లక్షలు, ధనుష్ 5 లక్షలు సహాయాన్ని ప్రకటించారు. స్వచ్చంద సంస్థలు, రాజీకీయ కార్యకర్తలు సహాయర చర్యల్లో పాల్గొంటున్నారు.


వరదనీటిలో అవస్థలు పడుతున్న జనం


తాజాగా  చెన్నై పరిస్థితి చూసి చలించిపోయిన నందమూరి సోదరులు ఎన్టీఆర్,  కళ్యాణ్ రామ్ తమ వంతు సహాయం గా తమిళనాడు చీఫ్ మినిస్టర్స్ రిలీఫ్ ఫండ్ కి సహాయాన్ని ప్రకటించారు. ఎన్టీఆర్ 10 లక్షల రూపాయలను, కళ్యాణ్ రామ్ 5 లక్షల రూపాయలను ప్రకటించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ చెన్నై లాంటి సిటీలో ఇలాంటీ ప్రకృతి వైపరీత్యాలు ఎంతో బాధ కలిగించిందని..చెన్నైతో తమకు మంచి అనుబంధం ఉందని ప్రజలు ధైర్యం కోల్పోకుండా ఉండవలసిన సమయం ఇది అన్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: