పెరటి మొక్క వైద్యానికి పనికి రాదని ఓ సామెత. సినీ హీరోయిన్ల విషయంలోనూ ఇది రుజువవుతోంది. టాలీవుడ్ నాయకులు, దర్శకులు ముంబై భామల వెనకాల పడుతూ ఉంటే..మన తెలుగమ్మాయిలు ఇతర భాషల్లో సత్తా చాటుతున్నారు. ఇక్కడ అంతంత మాత్రంగానే అవకాశాలు దక్కినా పరభాషల్లో మాత్రం దుమ్ములేపుతున్నారు. అలాంటి హీరోయిన్లకు శ్రీ దివ్య ఓ ఉదాహరణ.   

 

బస్టాప్  మూవీతో హీరోయిన్‌గా పేరు తెచ్చుకొని 'మల్లెలతీరంలో సిరిమల్లె పువ్వు' చిత్రం చేసింది శ్రీదివ్య. ఇందులోనూ తనదైన యాక్షన్ తో మెరిసింది. కేరింత సినిమాలోనూ రాణించింది. కానీ ఆ తర్వాత టాలీవుడ్‌లో ఆఫర్స్ రాలేదు. ఇక్కడ ఛాన్స్ లు రాకపోవడంతో చెన్నయ్ కి మకాం మార్చింది. కోలీవుడ్ లో 'వరుతపదత వాలిబర్ సంగం' అనే సినిమాలో నటించి మంచి హిట్‌ అందుకుంది. దీంతో ఈ ముద్దుగుమ్మకు వరుస ఆఫర్లు వచ్చిపడ్డాయి. 


తమిళంలో శ్రీ దివ్య చేసిన సినిమాలన్నీ హిట్ కొడుతున్నాయి. ఒకదాని తర్వాత ఒకటి బాగా ఆడుతున్నాయి. చిన్న హీరోల నుంచి పెద్ద హీరోల వరకూ అందరితోనూ జట్టు కట్టి అలరిస్తోంది. రీసెంటుగా విశాల్ తో నటించే ఛాన్స్ కూడా కొట్టేసింది. కొంబన్ వంటి హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు ముత్తయ్య ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు..


ఏ భాష అయితే ఏమైందిలే అంటూ శ్రీదివ్య కోలీవుడ్ కే ప్రిఫరెన్స్ ఇస్తోంది. ఆఫర్స్ పెరుగుతుండడంతో ఈ తెలుగు అందం రెమ్యూనరేషన్ కూడా బాగా పెంచిందని ఓ టాక్ . మొత్తానికి మన తెలుగు పరిమిళం ..తమిళతెరపై బాగానే గుబాళిస్తోందన్నమాట. 


మరింత సమాచారం తెలుసుకోండి: