దేవదాసు సినిమాతో ఎంట్రీ ఇచ్చిన యువ హీరో రామ్.. చేసిన రెండు మూడు సినిమాల్లో ఫుల్ ఎనర్జీ చూపించే సరికి ఎనర్జిటిక్ స్టార్ అనే స్క్రీన్ నేం ఇచ్చేశారు దర్శక నిర్మాతలు. సినిమా ఏదైనా రామ్ ఎనర్జీ పర్ఫార్మెన్స్ సినిమాకు బాగా హెల్ప్ అవుతుంది. అయితే కొద్దిరోజులుగా రామ్ సినిమాలన్ని బాక్సాఫీస్ దగ్గర వసూళ్లను రాబట్టలేకపోతున్నాయి. అది దర్శక నిర్మాతల లోపమా.. లేక రామ్ కథల సెలక్షన్స్ లోపమా అన్నది పక్కన పెడితే రామ్ కెరియర్ మాత్రం అస్థవ్యస్థంగా మారింది. 


ఈ సంవత్సరం పండగ చేస్కో అంటూ వచ్చిన రామ్ కాస్త పర్వాలేదనిపించినా తర్వాత వచ్చిన శివమ్ మాత్రం అసలు రామ్ సినిమాను ఎందుకు చేశాడని అతని అభిమానులు అనుకున్నారు. ఎనర్జీ అంతా వేస్ట్ చేసుకుంటున్న రామ్ కరెక్ట్ సినిమా ఎప్పుడు పడుతుందో ఏమో అనుకుంటున్నారంతా..! అయితే ప్రస్తుతం తను హీరోగా చేస్తున్న సినిమా నేను శైలజా.. టైటిల్ చాలా ప్లెసెంట్ గా ఉంది కాబట్టి సినిమా కూడా మంచి లవ్ స్టోరీ అని తెలుస్తుంది.


శివమ్ సినిమాలో రామ్ :


మలయాళ బ్యూటీ కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు రచయిత తిరుమల కిశోర్ డైరెక్ట్ చేస్తున్నాడు. స్రవంతి మూవీస్ బ్యానర్లో స్రవంతి రవికిశోర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా ఆడియో మరో రెండు రోజుల్లో రిలీజ్ అవనుంది. సినిమాలో డి.జె పాత్రలో నటిస్తున్న రామ్ క్లాస్ గా ఉంటూనే మాస్ అంశాలన్ని పొందుపరచాడట. సినిమా కథ కోసం వన్ ఇయర్ ట్రావెల్ చేశానని సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ నాడు స్రవంతి రవికిశోర్ అన్నారు.


సినిమా దర్శకత్వంలో కాస్త ఇన్వాల్వ్ అయ్యే రామ్ ఈ సినిమాకు కూడా తన చేతి వాటం చూపించాడని తెలుస్తుంది. అయితే ఈ సినిమా రిజల్ట్ మీదే తన ఫ్యూచర్ ఆధారపడి ఉన్నదన్నది వాస్తవం. అయితే ఒకవేళ ఈ సినిమా అటు ఇటైతే మాత్రం రామ్ పరిస్థితి మరి దారుణంగా తయారవుతుంది. జనవరి 1 న రిలీజ్ చేస్తున్న ఈ సినిమా సక్సెస్ కొట్టి రామ్ మళ్లీ తన సక్సెస్ ట్రాక్ లోకి తీసుకురావాలని కోరుకుందాం.  


మరింత సమాచారం తెలుసుకోండి: