మరి కొద్ది రోజులలో రామ్ గోపాల్ వర్మ తనకు తాను రాసుకున్న స్వీయ చరిత్ర ‘గన్స్ అండ్ తిగ్స్’ త్వరలో విడుదల కాబోతోంది. ఈ పుస్తకాన్ని ప్రమోట్ చేస్తూ ఒక ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన రామ్ గోపాల్ వర్మ కార్యక్రమంలో ఒక ప్రముఖ కాలేజీకి చెందిన అనేకమంది అమ్మాయిలు అబ్బాయిలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అమ్మాయిలు అడిగిన అనేక ఆ శక్తికర ప్రశ్నలకు వర్మ తనదైన శైలిలో సమాధానాలు ఇచ్చాడు. 

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఒక అమ్మాయి వర్మను టార్గెట్ చేస్తూ శ్రీదేవి తొడలు గురించి ఎందుకు కామెంట్స్ చేసారు అని ప్రశ్నించడమే కాకుండా హీరోలకు కూడ తొడలు ఉంటాయి కదా హీరోల తొడల పై ఎందుకు కామెంట్ చేయరు ? అంటూ వర్మను నిలదీసింది. అయితే దానికి సమాధానంగా వర్మ చాల ధీటైన సమాధానం ఇచ్చాడు. ‘అమ్మాయిల తొడలు గురించి అబ్బాయిలు ఇష్ట పడినంతగా అబ్బాయిల తొడల గురించి అమ్మాయిలు ఇష్టపడరు కదా ?’ అంటూ షాకింగ్ రిప్లయ్ ఇవ్వడమే కాకుండా అమ్మాయిలు ఇష్టపడితే అబ్బాయిల తొడలు చూపించే రోజులు వస్తాయి అంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు వర్మ.

అంతేకాదు అమ్మాయిలకు అబ్బాయిల తొడల పై గౌరవం లేదు అంటూ సెటైర్లు కూడ వేసాడు. కాని తనకు అమ్మాయిల తొడలు అన్నా – గన్స్ అన్నా విపరీతమైన గౌరవం అని అంటూ వర్మ తన స్వీయ చరిత్రలో ఈ విషయాలే ఎక్కువగా వ్రాసాను అని కామెంట్ చేశాడు. ఇదే సందర్భంలో మరొక అమ్మాయి మీరు రానున్న రోజులలో ఒక భక్తి సినిమా తీయ వలసి వస్తే ఏ దేవుడు పై తీస్తారు అని ప్రశ్నించినప్పుడు ఇక్కడ కూడ తన మార్క్ ను ప్రదర్శించాడు.

తనకు ఎప్పుడైనా అవకాశం వస్తే వినాయకుడి పై ఒక భక్తి సినిమా తీస్తానని తన దృష్టిలో దేవుళ్ళు అందరిలోకి చాల అందమైన దేవుడు వినాయకుడు అంటూ గణాధిపతి పైనే సెటైర్లు వేసాడు వర్మ. అతి త్వరలో విడుదల కాబోతున్న వర్మ స్వీయ చరిత్రలో ఇంకా ఎన్ని సంచలనాలు ఉంటాయో అన్న ఆ శక్తి అందరిలోనూ రోజురోజుకు పెరిగిపోతోంది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: