తెలుగు ఇండస్ట్రీలో మంచి దర్శకుడిగా పేరు తెచ్చుకున్న సుకుమార్ మొట్టమొదటి సారిగా నిర్మాతగా వ్యవహరిస్తూ తీసినే చిత్రం కుమారి 21 ఎఫ్. ఈ చిత్రానికి రాక్ మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీ సంగీతం అందించాడు. అప్ కమింగ్ హీరో రాజ్ తరుణ్ హీరోగా హెబా పాటిల్ హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రం విడుదలైన రోజు నుంచి మంచి కలెక్షన్లతో అద్భుత విజయం సాధించింది. ఈ చిత్రానికి సుకుమార్ కథ, స్క్రీన్ ప్లే , మాటలను అందించడంతో పాటు నిర్మాతగా వ్యవహరించి మంచి సక్సెస్ సాధించాడు. తాజాగా ఈ చిత్రాన్ని నిషేదించాలని హెచ్ఆర్సీలో ఫిర్యాదు నమోదైంది.

ఈ చిత్రంలో అమ్మాయిలను మరీ కించ పరిచే విధంగా ఉందంటూ..ఒక హీరోయిన్ చేత అన్నీ డబుల్ మీనింగ్ మాటలు చెప్పించి యువతను రెచ్చగొట్టే విధంగా ఉన్నాయంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ మద్య ‘పవన్ కళ్యాణ్ హఠావో..పాలిటిక్స్ బాచావో’ అనే పుస్తకాన్ని రాసిన బొగ్గుల శ్రీనివాస్ తాజాగా ‘కుమారి 21 ఎఫ్’ నిషేదించాలంటూ హెర్ఆర్సీలో ఫిర్యాదు చేశారు. ఈ చిత్రంలోని ప్రతీ సన్నివేశం అమ్మాయిలను అవమానపరిచేదిగా ఉందంటూ మానవ హక్కుల కమీషన్ కు ఫిర్యాదు చేసారు.


 ‘కుమారి 21 ఎఫ్’ పోస్టర్


ఈ ఫిర్యాదులో చిత్ర నిర్మాత సుకుమార్ , హీరో రాజ్ తరుణ్, దర్శకుడు సూర్య ప్రతాప్ పై క్రిమినల్ కేసును నమోదు చేయాలంటూ కోరారు. ఇక పోతే  బొగ్గుల శ్రీనివాస్ ఫిర్యాదుపై స్పందించిన హెచ్ ఆర్సీ ఛైర్మన్ ఫిబ్రవరి లోగా నివేదిక ఇవ్వాలని హైదరాబాద్ పోలీస్ కమీషనర్ కు నోటిసులు జారీ చేశారట. మరి ఈ పిటీషన్ వ్యవహారం ఎంత దూరం వెళ్తుందో చూడాలి మరి .


మరింత సమాచారం తెలుసుకోండి: