బాలీవుడ్ లో ఒకప్పుడు అందాల రాశిగా పేరు పొందిన సీనియర్ నటి సాధన శివదాసానీ (74) కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. సెప్టెంబర్లో 74వ పుట్టినరోజు జరుపుకున్న సాధన అనారోగ్యంతో హిందూజా ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. గతేడాది డిసెంబర్లో ఆసియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీలో ఆమె ఇటీవల చికిత్స కూడా చేయించుకున్నారు. శుక్రవారం తన నివాసంలో తుదిశ్వాస విడిచారని ఆమె స్నేహితురాలు, బీజేపీ ముంబై అధికార ప్రతినిధి షైనా ఎన్ సీ తెలిపారు. సాధనకు పెంపుడు కుమార్తె ఉన్నారు.

1941, సెప్టెంబర్ 2న కరాచీలోని సింధ్ కుటుంబంలో ఆమె జన్మించారు. 1959లో వచ్చిన 'లవ్ ఇన్ సిమ్లా' సినిమాతో బాలీవుడ్ లో హీరోయిన్ గా పరిచయమయ్యారు. 1960 దశకంలో టాప్ హీరోయిన్లలో ఒకరిగా వెలుగొందారు. అప్పట్లో 'సాధనా కట్' పేరుతో ఆమె కేశాలంకరణ(హెయిర్ స్టైల్) బాగా పాపులర్ అయింది. ముంగురులను నుదుటిపై అడ్డంగా దువ్విన తలకట్టు మహిళా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

తను పెంచుకుంటున్న కూతురితో సాధన 


పరాఖ్, హమ్ దోనో, ప్రేమ్ పత్రా, అసలీ-నకిలీ, ఏక్ ముసాఫిర్ ఏక్ హసినా, దుల్హా దుల్హన్, మేరీ మెహబూబ్, దిల్ దౌలత్ దునియా, ఛోటే సర్కార్ తదితర సినిమాల్లో నటించారు.ఆమె మరణవార్త వినగానే అభిమానులు, బాలీవుడ్ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా సంతాపం వ్యక్తం చేసారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: