ఎవరా హీరోయిన్ - ఎవరా హీరో అని క్యూరియాసిటీగా ఉంది కదా ఆ హీరోయిన్ ఎవరో కాదండి రకుల్ ప్రీత్ సింగ్. ఆ హీరో జూనియర్ ఎన్టీఆర్. వీళ్లిద్దరికీ ఏ ఉంది అనే డౌట్ వచ్చిందా? కచ్చితంగా వాళ్లిద్దరి మధ్య ఏమీ లేదు. కానీ.. ఓ విషయం మాత్రం కచ్చితంగా ఉంది. అదే ప్రస్తుతం రాబోతున్న నాన్నకు ప్రేమతో సినిమాతోనే..
               
రకుల్ ప్రీత్ సింగ్. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, లౌక్యం సినిమాలతో లక్కీ హీరోయిన్ గా ముద్రపడింది. కానీ.. అదంతా 2014లోనే. 2015లో రకుల్ నటించిన పండగ చేస్కో, కిక్ 2, రచ్చ హ్యాట్రిక్ ఫ్లాప్ లుగా నిలిచాయి. కనీసం ఒక్కటి హిట్ అయినా.. ఆ అదృష్టం ట్యాగ్ లైన్ అలాగే ఉండేదేమో. ఈ వరుస ఫ్లాప్ లతో.. రకుల్ అన్ లక్కీ అనే ముద్ర పడిపోయింది.
                
2015లో వరుస ఫ్లాప్ సినిమాల్లో నటించిన రకుల్.. 2016 మీదే ఆశలు పెట్టుకుంది. ముఖ్యంగా జూనియర్ ఎన్టీర్ తో నటించిన నాన్నకు ప్రేమతో మూవీ మీద కోటి ఆశలతో ఉంది. అలాగే.. 2016లో అల్లు అర్జున్ సరైనోడు సినిమా కూడా రిలీజ్ అవుతుంది. ఈ రెండు సినిమాల్లో ఏ ఒక్కటి హిట్ అయినా ఓకే. లేకపోతే.. రకుల్ అన్ లక్కీ హీరోయిన్ అనే ముద్ర పర్మినెంట్ గా పడిపోతుంది. 


ఇది ఆమె కెరీర్ మీదే ప్రభావం చూపే చాన్స్ ఉంది. అందుకే ఇప్పుడు రకుల్ ఫ్యూచర్ జూనియర్ చేతిలో ఉందన్న మాట. ఓ పక్క ఎన్టీఆర్ కూడా ఈ సినిమాతో ఎలాగైనా తన సత్తా చాటాలని చూస్తున్నాడు. ఇన్నాళ్ళుగా అందని ద్రాక్షలా ఉన్న 50 కోట్ల షేర్ ని కూడా ఈ సినిమాతో సాధించాలని కసిగా ఉన్నాడు ఎన్టీఆర్. మరి ఇన్ని భారీ అంచనాలతో వస్తున్న ఈ సినిమా ఎలాంటి హిట్ కొడుతుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: