జూనియర్ ఎన్టీఆర్ తో నటించే అవకాశం గురించి చాలామంది హీరోయిన్స్ క్యూ కడుతూ ఉంటే గతంలో ఒక హీరోయిన్ జూనియర్ తో నటించే అవకాశం వచ్చినా రెండు రోజులు మాత్రమే నటించి ఆ సినిమా పరిస్థుతులు బాగాలేవు అంటూ జూనియర్ సినిమాను తిరస్కరించి వెళ్ళిపోయింది. కొంత కాలం క్రితం జూనియర్ నటించిన ‘రభస’ సినిమా షూటింగ్ లో ఈ సంఘటన జరిగింది. 

ఆమె ఎవరో కాదు హీరోయిన్ నజ్రియా నజీమ్. మలయాళ సినిమా రంగంలో క్రేజీ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన నజ్రియాకు సినిమా రంగంలోని వాతావరణం నచ్చక శాస్వితంగా సినిమాలకు గుడ్ బై చెప్పి మలయాళ యంగ్ హీరో ఫ‌హ‌ద్ ఫాజిల్ ని పెళ్ళి చేసుకుంది. ఇప్పుడు మలయాళ సినిమా రంగంలో అక్కడి అమ్మాయిలకు ఇతడు డ్రీమ్ హీరో.

అయితే ఇతడి పై దర్శకుడు కొరటాల శివ దృష్టి పడటంతో ఇతడు జూనియర్ తో దర్శకత్వం వహించబోతున్న ‘జనతా గ్యారేజ్’ సినిమాలో ఒక ముఖ్య పాత్రకు ఎంపిక చేసాడు అన్న వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమాలో జూనియర్ తండ్రి పాత్రకు మోహన్ లాల్ ను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. 

జూనియర్ సినిమాలకు మలయాళ ప్రేక్షకులలో కూడ క్రేజ్ తీసుకు రావడానికి మలయాళ యూత్ లో మంచి క్రేజ్ ఉన్న ఫహద్ ఫాజిల్ ను ఎంపిక చేసారు అని తెలుస్తోంది. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ యంగ్ సూపర్ స్టార్ ఫహద్ ఫాజిల్ ల సహకారంతో జూనియర్ మలయాళ సినిమా రంగంలో వ్యూహాత్మకంగా వేస్తున్న ఎత్తుగడల కోసం ఏకంగా ఒకసారి తనను తిరస్కరించిన హీరోయిన్ భర్తను ఎంపిక చేసుకోవడం ఇప్పుడు టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది..  



మరింత సమాచారం తెలుసుకోండి: