టాలీవుడ్ యంగ్ హీరోలు అంతా తాము పవన్ కళ్యాణ్ వీరాభిమానులమని చెపుతూ పవన్ దృష్టిని ఆకర్షించడానికి ప్రయత్నిస్తూ ఉంటే దీనికి భిన్నంగా యంగ్ హీరో నాగ శౌర్య నిన్న జరిగిన ‘అబ్బాయితో అమ్మాయి’ సక్సస్ మీట్ లో ఇతడు పవన్ పై చేసిన కామెంట్స్ అందర్నీ ఆశ్చర్య పరిచాయి. తాను పవన్ అభిమానిని అయినప్పటికీ పవన్ కన్నా ఎన్టీఆర్ ను విపరీతంగా అభిమానిస్తాను అంటూ షాకింగ్ కామెంట్స్ చేసాడు.

ఈసినిమాలో హీరో పాత్రను పోషించిన నాగ శౌర్య హీరోయిన్ దృష్టిని ఆకర్షించడానికి పవన్ కళ్యాణ్ ఫోటోలను చూపెడుతూ ఆమె వెంటపడే సన్నివేశాల గురించి మాట్లాడుతూ ఈ సన్నివేశాల చిత్రీకరణ ఆలోచన ఈసినిమా దర్శకుడు రమేశ్ వర్మది అని అంటూ తాను పవన్ అభిమానినే అయినప్పటికీ రమేశ్ వర్మ పవన్ కు వీరాభిమాని కావడంతో ఈసినిమాలో ఈ సన్నివేశం క్రియేట్ చేసిన విషయాన్ని బయట పెట్టాడు నాగ శౌర్య.

ఈ సినిమాకు మంచి టాక్ రాకపోయినా సక్సస్ మీట్ నిర్వహించడమే కాకుండా నాగ శౌర్య కెరియర్ లో మంచి ఓపెనింగ్స్ వచ్చిన సినిమాగా ఈసినిమాను పేర్కొంటూ సక్సస్ మీట్ నిర్వహించడం చాలామందిని ఆశ్చర్య పరిచింది. అయితే ఈ సక్సస్ మీట్ లో  పాల్గొన్న నాగ శౌర్య హీరోయిన్ పల్లక్ లల్వాని ముభావంగా కనిపించడం అందర్నీ ఆశ్చర్య పరిచింది. 

ఈ మధ్య కాలంలో నాగ శౌర్య నటించిన సినిమాలు అన్నీ వరసగా పరాజయం చెందుతూ ఉన్నప్పటికీ వరస పెట్టి నాగ శౌర్యకు అవకాశాలు వస్తూనే ఉన్నాయి. త్వరలో నందినీ రెడ్డి దర్శకత్వంలో రాబోతున్న ‘కళ్యాణ వైభవం’ పై భారీ అంచనాలు పెట్టుకునాడు..


మరింత సమాచారం తెలుసుకోండి: