తెలుగు ఇండస్ట్రీలో సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన రక్త చరిత్ర చిత్రంతో తెలుగులో పరిచయం అయిన రాధికా ఆప్టే తర్వాత నందమూరి బాలకృష్ణ సూపర్ హిట్ చిత్రాలు లెజెండ్, లయన్ లో నటించింది. తెలుగులో చాలా సాంప్రదాయంగా కనిపించే ఈ అమ్మడు బాలీవుడ్ లో మాత్రం పిచ్చి పిచ్చిగా రెచ్చిపోయింది. ఆ మద్య బాలీవుడ్ లో వచ్చిన హంటర్ చిత్రంలో ఈ అమ్మడిని చూసి కుర్రకారు మతులు పోగొట్టుకున్నారు. తర్వాత బదలాపూర్ చిత్రంలో హాట్ సీన్లలో నటించి సంచలనం సృష్టించింది.

ఈ అమ్మడు శృంగార పాత్రలో నటించినా దక్షిణాది చిత్రల్లో మంచి పాత్రలు వస్తున్నాయి. సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న కబాలి చిత్రంలో రాధికా ఆప్టే నటిస్తుంది.  తాజాగా ఈ అమ్మడు మరో యూట్యూబ్ రికార్డు క్రియేట్ చేసింది. బాలీవుడ్ దర్శకుడు సంజయ్ ఘోష్ ఒక గొప్ప ఐడియా తో తెరకెక్కించిన షార్ట్ ఫిల్మ్ రాధిక నటించింది. ఈ షార్ట్ ఫిల్మ్ లో రాధిక తన నటన , సెక్సీ లూక్స్ తో అందరిని బాగా ఆకట్టుకుంది. తన నటనతో విమర్శకుల నుంచి ప్రశంసలు పొందింది.  

రాధిక ఆప్టె


ఈ షార్ట్ ఫిల్మ్ లో రాధికా ఆప్టె వేసుకున్న డ్రెస్ చాలా సెక్సీగా కనిపిస్తుంది. హర్రర్, థ్రిల్లర్ గా రూపొందించిన   14 నిమిషాల నిడివి గల ఈ షార్ట్ ఫిల్మ్ ను యూ ట్యూబ్ ద్వారా  విడుదల చేశారు. ఐదు నెలల క్రితం విడుదల చేసిన ఈ షార్ట్ ఫిల్మ్ ని ఇప్పటి వరకు 55 లక్షల నెటిజన్ల వ్యూస్ ని సొంతం చేసుకొని  సెన్సేషన్ రికార్డ్ క్రియేట్ చేసింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: