తెలుగు ఇండస్ట్రీలో రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం ‘బాహుబలి’. రెండు సంవత్సరాలు సుదీర్ఘంగా కష్టపడి తీసిన చిత్రం వ్యూజువల్స్ పరంగా కూడా అద్భుతాలు సృష్టించింది. ఈ చిత్రంతో తెలుగు లో ఒక కొత్త అధ్యాయం మొదలైంది. ఇప్పటి వరకు తెలుగు చిత్రాలు ప్రపంచ స్థాయిలో ఎక్కడా పేరు రాలేదు. ఫస్ట్ టైమ్ బాహుబలి దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా మంచి ఆదరణ లభించింది. ఇక ఈ చిత్రంలో కొన్ని ఫైట్ సీన్లలో గ్రాఫిక్ టెక్నాలజీ అత్యద్భుతంగా ఉపయోగించారు.

బాహుబలి చిత్రంలో చాలా వరకు  వ్యూజువల్ ఎఫెక్ట్స్ చాలా బాగా చూపించారు. ముఖ్యంగా భల్లాల దేవ (రానా)  ఓ పెద్ద దున్నతో ఫైటింగ్ సిన్ చూస్తుంటే రోమాలు నిక్కబొడుస్తాయి. నిజంగా అంత పెద్ద దున్నపోతుతో ఫైటింగ్ చేయడం అంటే అబ్బో అనుకుంటారు. అది పూర్తిగా వ్యూజువల్ ఎఫెక్ట్స్..దాదాపు 500 VFX షాట్ లతో రూపొందించారు. అంత భారీ దున్న ను సృష్టించడం దానితో భల్లాలదేవుడు వీరోచితంగా పోరాడుతున్నట్టు చూపించడం అందులోనూ ఏమాత్రం గ్రాఫిక్స్ ఎఫెక్ట్ గా కనిపించకుండా జాగ్రత్త పడటం ఒక్క రాజమౌళికే చెల్లింది.


బాహుబలి చిత్రంలో ఫైటింగ్ షూటింగ్


అందుకే బాహుబలి తెలుగు సినిమా చరిత్రలోనే ఓ అతిపెద్ద మైలురాయిగా నిలిచిపోయిలా సినిమాను చెక్కిన జక్కన్నపేరు, నటించిన ప్రభాస్ రానా , శివగామి రమ్యకృష్ణ ల పేరు…తెలుగు సినిమా చరిత్ర ఉన్నంత కాలం సజీవంగా మిగిలిపోతాయ్.బాహుబలి సినిమాలో దున్నతో భల్లాలదేవ ఫైటింగ్ కు సంబంధించిన మేకింగ్ వీడియోను విడుదల చేశారు. ప్రస్తుతం సోషల్ నెట్ వర్క్ లో హల్ చల్ చేస్తుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: