డ్రగ్ మాఫియాకు సంబంధించిన నేపథ్యంలో ప్రారంభమైన ఈ మూవీ బాక్సాపీస్ వద్ద ప్రేక్షకులను బాగానే అలరిస్తుందని అంటున్నారు. నేడు ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా రిలీజ్ అయిన డిక్టేటర్ మూవీకి థియోటర్స్ వద్ద ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. నందమూరి హీరోల మూవీలు అంటే ముఖ్యంగా కొంత మేర మాస్ ఎలిమెంట్స్ ఉండాలి. అలా ఉంటేనే ప్రేక్షకులకి ఆ కిక్ వస్తుంది.


ఇక ఇలాంటి మాస్ ఎలిమెంట్స్ డిక్టేటర్ మూవీలో బాలకృష్ణ చాలానే చూపించాడు. ఈ మూవీకి సంబంధించిన రన్ టైం దాదాపు 153 నిముషాలుగా ఉంది. ఈ రన్ టైం తో ప్రేక్షకులు సంతోషంగా ఫీల్ అయ్యారు. మూవీని ఎక్కువుగా సాగధీత ధోరణిలో కాకుండా, పక్కా కమర్షియల్ ఫార్ములాలో తెరకెక్కించారు. మొదగా పోరాట సన్నివేశాలు, తరవాత ఒక్కో క్యారెక్టర్ పరిచయం, తరువాత హీరోయిన్ ఎంట్రి, హీరో గురించిన నేపథ్యం, విలన్ పై రివేంజ్...ఇలా పక్కాగా స్టోరీ వెళ్ళింది.


దీంతో నందమూరి అభిమానుకి ఈ మూవీ బాగా నచ్చింది. ఇక సాధరాణ ప్రేక్షకుడి విషయానికి వస్తే పర్వాలేదు అనే టాక్స్ తో సరిపెడుతున్నారు. ఓ రకంగా చూస్తే...ఇప్పటి వరకూ రిలీజ్ అయిన సంక్రాంతి మూవీలలో కమర్షియల్ గా అలరిస్తున్న మూవీ డిక్టేటర్ అని చెప్పవచ్చు. ఈ మూవీలోబాలయ్య తన ట్రేడ్ మార్క్ డైలాగ్స్ తో ఆకట్టుకుంటున్నాడు.


ఇక కమెడియన్లు 30 ఇయర్స్ పృథ్వీ మరియు హేమల మధ్యల వచ్చే కామెడీ సన్నివేశాలు కొంత రిలీఫ్ ని ఇచ్చాయి. మొత్తంగా ప్రేక్షకలు డిక్టేటర్ మూవీకి అటు పూర్తి నెగిటివ్ టాక్, ఇటు పూర్తి పాజిటివ్ టాక్ ని ఇవ్వకుండా పర్వాలేదని అని చెబుతున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: