తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ కన్నుల పండువగా చేసుకున్నారు..ఇక ఏపీలో సంక్రాంతి వచ్చిందంటే దేశ విదేశాల్లో ఉన్నవారు కూడా ఖచ్చితంగా తమ సొంత గ్రామాలకు వచ్చితీరుతారు. ఈ పండుగ సెలబ్రెటీలకు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు..ఇక మెగా ఫ్యామిలీ అయితే ప్రత్యేకంగా బెంగుళూర్ లోని ఫామ్ హౌజ్ లో ఘనంగా నిర్వహించకున్నారు. తాజాగా బాహుబలి చిత్రంతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సంక్రాంతి వేడుక తన కుటుంబ సభ్యులతో హ్యాపీ హ్యాపీగా చేసుకున్నారు.

 ప్రస్తుతం బాహుబలి ది కంక్లూజన్ చిత్రంతో బిజీగా ఉన్న ప్రభాస్ ఈ చిత్రం తర్వాత సుజీత్ డైరెక్షన్‌లో ఒక సినిమా చేయనున్నట్టు సమాచారం.  ఎంత బిజీ షెడ్యూల్ అయినా  సంక్రాంతి పండుగను తన ఫ్యామిలీతో కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు.

రెబల్ స్టార్ కృష్ణం రాజు ఫ్యామిలీ కూడా ఈ సంక్రాంతి సంబరాలలో పాల్గొనగా, వీటికి సంబంధించిన ఫోటోలు నెట్‌లో హల్ చల్ చేస్తున్నాయి. ప్రస్తుతం బాహుబలి 2 కేరళా షిఫ్ట్ అయ్యింది..అక్కడే కొన్ని రోజులు షూటింగ్ జరుపుకోనున్నారు.  ఇప్పటికే చిత్ర యూనిట్ ఇప్పటికే అక్కడికి చేరుకున్నట్టు సమాచారం.


మరింత సమాచారం తెలుసుకోండి: