అత్యంత సామాన్యుడిగా పుట్టి అసమాన్యుడిగా ఎదిగిన రజినీకాంత్ జీవితంలో ఎన్నో షాకింగ్ నిజాలు ఉన్నాయి. ఆసియా దేశాలలో జాకీచాన్ తరువాత అత్యంత భారీ పారితోషికం తీసుకునే రజినీకాంత్ తాను షూటింగ్ లో పాల్గొంటున్నప్పుడు భోజన విరామ సమయంలో అవకాశం కుదిరితే చెట్టుకింద మడత మంచం వేసుకుని పోడుకోవడం ఇష్టపడతాడు అన్న విషయం తెలిస్తే ఎవరైనా షాక్ అవుతారు.

స్టార్ హోటల్స్ లో ఉండే రజినీకాంత్ వేరే రాష్ట్రాలకు షూటింగ్ కు వెళ్ళినప్పుడు తన కారులో హైవే పై ప్రయాణం చేస్తూ మార్గమధ్యంలో ఒక చిన్న కాకా హోటల్ లో టీ తాగితే వచ్చే ఆనందం మరెక్కడా రాదు అని చెపుతాడు రజినీ. అంతేకాదు కోట్ల రూపాయల విలువైన లేటెస్ట్ కారులు తన ఇంటి ముందు ఉన్నా ఒకొక్కసారి అర్దరాత్రి పూట తన పాత స్కూటర్ పై తన చిన్న నాటి స్నేహితుడును వెనక కూర్చో పెట్టుకుని ప్రయాణం చేయడంలో వచ్చే ఆనందం మరేక్కడా లేదు అంటాడు.

వెండి తెర పై మిలమిలా మెరిసే బట్టలతో మేకప్ తో కనిపించే రజినీకాంత్ నిజజీవితంలో మాత్రం ఎప్పుడూ మేకప్ చేసుకోడు సరికదా కనీసం ఒకొక్కసారి పెరిగి పోయిన తన తెల్ల గడ్డం కూడ పట్టించుకోడు. మాట్లాడవలసిన చోట కళ్ళతో సమాధానం చెప్పాలి కాని ఆవేశ పడకూడదు అంటాడు రజినీకాంత్. అయితే ఈ విషయాలన్నీ నిజజీవితంలో అనుసరించడానికి సామాన్యులకు సాధ్యం కానిపని.
ఇన్ని అసామాన్య లక్షణాలు ఉన్నాయి కాబట్టే ఆయన వయస్సు 66 సంవత్సరాలు దాటిపోయినా రజినీకాంత్ సినిమా విడుదల రోజు అంటే ఇప్పటికీ తమిళనాడులో ఒక పండుగ వాతావరణం కనిపిస్తుంది.

కెమెరా వెనుక నిజ జీవితంలో తాత అయిన రజినీకాంత్ కెమెరా ముందుకు మేకప్ వేసుకుని వస్తే ఆయన స్పీడ్ ముందు భారత దేశంలోని ఏ టాప్ యంగ్ హీరో కూడ సరిపోడు. సినిమా జీవితాన్ని అతడు సాధించిన రికార్డులను ఏ మాత్రం పట్టించు కోకుండా తాను తనలా బ్రతకాలి అని కోరుకునే రజినీకాంత్ వ్యక్తిత్వం ఇప్పటికీ ఎవ్వరికీ అర్ధంకాని రహస్యం. వినాయకుడుని ఇష్టపడే రజినీకాంత్ వీలుదొరికితే చాలు ఆయన బొమ్మను పట్టుకుని హిమాలయాలకు వెళ్ళిపోతాడు. అయితే తమిళ ప్రజలు మాత్రం రజినీకాంత్ రాజకీయాలలోకి వస్తే బాగుంటుంది అని కోరుకుంటారు. తమిళ ప్రజల కోరికలను రానున్న రోజులలో అయినా పద్మ విభూషణ్ రజినీకాంత్ తీరుస్తాడేమో చూడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: