కథా బలం లేకుండా కేవలం బూతును ఆధారంగా ఎంచుకుని సినిమాలు తీస్తే అవి విజయం సాధించలేవు అని తెలిసినా ఇంకా చాల మంది దర్శక నిర్మాతలు కేవలం బూతు సీన్స్ తో సినిమాను నింపి డబ్బులు చేసుకుందామని ఇంకా ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు. దీనికి ఉదాహరణ ఈమధ్యనే విడుదలైన ‘లజ్జ’ సినిమా పోస్టర్లు. అయితే ఈ సినిమాను ఒక దృశ్య కావ్యం అంటూ ఈసినిమా దర్శకుడు అర్ధం కాని స్టేట్ మెంట్లు ఇస్తున్నాడు.

దర్శకుడు నరసింహ నంది పేరు చాలామందికి తెలియకపోయినా కొంత కాలం క్రితం 1940లో ఒక గ్రామంలో జరిగిన సంఘటన ఆధారంగా ‘కమలతో నా ప్రయాణం’  అనే సినిమా ఒకటి తీసి అవార్డు అందుకున్నాడు. హీరో శివాజీ వేద కలిసి నటించిన ఆ సినిమా పై కూడ చాల తీవ్ర అభ్యంతరాలు అప్పట్లో వచ్చాయి.

అయితే ఆ కామెంట్స్ ను నరసింహ నంది పట్టించుకోకుండా తన సినిమా కళాత్మక చిత్రం అంటూ అప్పట్లో వాదిస్తూ వచ్చాడు. ఇప్పుడు కూడ అదే పరిస్థితి ఈ ‘లజ్జ’ సినిమాకు ఎదురౌతోంది. కళాత్మక సినిమాను వాణిజ్య పంధాలో నిర్మించాను అని చెపుతున్న ఈ దర్శకుడి మాటలు ఎవరికీ అర్ధంకాని విషయాలుగా మారాయి. బాలు మహేంద్ర బాలచందర్ శైలిలో ఈసినిమాను తీసాను అని చెపుతున్న ఈ దర్శకుడు మాటలు విని అందరూ షాక్ అవుతున్నారు.

అంతేకాదు సరిగ్గా ఆలోచిస్తే తన సినిమా దృశ్య కావ్యం, లేదంటే తన సినిమా బూతు సినిమా అని చెపుతున్న ఈ దర్శకుడి మాటలు వింటే ఎవరి మైండ్ అయినా బ్లాంక్ అవ్వడం ఖాయం. మంచి సినిమాలకే కలెక్షన్స్ లేని ఈరోజులలో ఈ దర్శకుడు ఇటువంటి బూతు ప్రయోగాన్ని ఎందుకు చేస్తున్నాడో అతడికే తెలియాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: